April 19, 2024

నేను సైతం

రచన: సుధ ఆత్రేయ

జీవితమనేది గమ్యం కాదు గమనం మాత్రమే… నా పేరు అఖిల్ నేనో పెద్ద అంతర్జాతీయ ఫుడ్ బిజినెస్ కంపెనీకు ఒక డైరెక్టర్ను. సగటు భారతీయుడి కల అయిన అమెరికాలోని న్యూయార్క్ నగరంలో వాసము. పెద్ద హోదా మంచి జీతము. భార్య, ఇద్దరు పిల్లలు. నాకు కెరీర్ లో పై స్థాయికి చేరుకోవాలని చిన్నప్పటినుంచి కోరిక. అందుకు తగ్గట్టుగానే కష్టపడిచదివా. చదువంతా ఐఐటీ లోనే సాగింది. క్యాంపస్ లోనే జాబ్. కోరుకున్నట్టు గానే చాల ఉన్నత స్థితికి చేరుకున్నా. చిన్న వయసులోనే ఎంతో సాధించానని అనుకున్నా. కానీ….
@@@@@@@
“అఖిల్ మీరు వెంటనే నన్ను నా క్యాబిన్లో కలవండి”. ఇది నా ఫోనుకు సీఈఓ గారి నుంచి వచ్చిన సందేశం. అది చదవగానే గుండె ఒక్కసారిగా జల్లు మన్నది. సీఈఓ నాతొ నేరుగా మాట్లాడరు. మాకు ఏదైనా చెప్పదలిస్తే మీటింగ్ లో చెప్తారు కానీ ఎప్పుడు లేనిది ఇలా విడిగా ఎందుకు కలవమన్నట్టు. పరి పరి విధాలుగా నా ఆలచనలు సాగుతుండగా సీఈఓ గారి అనుమతితో వారి క్యాబిన్లోకి అడుగు పెట్టాను.
“అఖిల్ కూర్చోండి” అని చాల నమృతగా చెప్పి
“అఖిల్ మీ కొక ముఖ్యమైన పని అప్పగించాలని మా బోర్డు నిర్ణయిoచింది. మీరు ఈ పనికి అన్నివిధాలా సమర్ధులని మేము నమ్మి మీకు ఈ పని అప్పగిస్తున్నాము”. అని చెప్పడం ఆపి నన్ను చదవడం కోసం నా మోహంలో కి తేరిపారా చూసారు. వీళ్లు ఆవులించకుండానే పేగులు లెక్కపెట్టేవాళ్ళు. ముఖ్యమైన పని నాకు అప్పచెప్తున్నారు అంటే ఎంతో లోతుగా పరిశీలించి వుంటారు. నా ఈ ఆలోచనలను పైకి కనపడకుండా ఎంతో నమృతగా “మీ అభిమానానికి ధన్యవాదాలు సార్” అన్నాను. “చూడండి అఖిల్ విషయమేమిటంటే ఇండియాలో ఒక లేడి సైన్టిస్ట్ మన ఇన్స్టంట్ ఫుడ్ ఐటమ్స్ లో లెడ్ ఎక్కువగా ఉందని కోర్ట్ లో కేసు వేసింది. కింది కోర్టులో ఆవిడే గెలిచింది. అప్పటివరకు అతిధీమాగా వున్న మన వాళ్ళు మొద్దునిద్ర నుంచి మేల్కని సుప్రీంకోర్టులో కౌంటర్ పిటేషన్ వేశారు. ఆమె సైన్టిస్ట్ కాబట్టి మొత్తం ఆధారాలు అవి సేకరించి పక్కాగా సోషల్ యక్టీవిస్టులతో కలిసి ఈ పిటిషన్ వేసింది. నయానో భయానో ఆమెను లొంగదీసుకోవడం కుదరలేదు. మనకు అందిన న్యూస్ ప్రకారము, తనే గెలిచెట్టువుంది. పైగా ఇప్పటి ప్రభుత్వం మునపటిలా లేదు లాబీయింగ్ అస్సలు ఒప్పుకోలేదు. మొత్తం అంతా మనకు ప్రతికూలంగా ఉంది. కోర్టు లో ఓడిపోతే కోర్టు విధించే జరిమానా చాలా ఎక్కువగా ఉంటుంది అంతే కాదు మన సరుకునoత వెనక్కు తెప్పించాల్సి ఉంటుంది. అందువల్ల నష్టం మామూలుగా వుండదు. ఇప్పటికే స్టాక్ మార్కెట్లో మన షేర్లు నష్టాల్లో వున్నాయి. అందువల్ల మీరు వెంటనే ఇండియా వెళ్లి ఆమెతో మాట్లాడి, ఇకపై ఇలా జరగదని కేసు ఉపసంహరిన్చుకోమని ఒప్పించండి. తర్వాతి వాయదాకు ఇంకా మూడు నెలలు సమయం వుంది. సో మీకు కూడా మూడు నెలల గడువు వుంది. మీరు ఇది సాధిస్తే మిమ్మల్ని ఆసియ ఖండానికి హెడ్ గా కంపెనీ నియమిస్తుంది.” అని చెప్పడం ముగించి నా జవాబు ఏమిటా అని నావైపు చూసాడు.
అంతా విన్న నాకు నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారో అర్థం కాలేదు. ఎంతో మంది ఈ పాటికే ప్రయత్నం చేసుంటారు. మరి ఇందులో నేను చేసేది ఏముంది. ఇదేం తిరకాసో అర్థం కాక ప్రస్నార్ధకమైన మొహం తో ఒక మొహమాటపు నవ్వు నవ్వాను. నా మానసు ఇట్టే గ్రహించి
“చుడండి అఖిల్ ఇంత మంది చెయలేనిది ఒక మామూలు డైరెక్టర్ ను నేనేం చేయగలను అనే కదా మీ అనుమానం. యా నిజమే ఆ సైంటిస్టు తన మితృలు అంతా మీ ఆంధ్రకు చెందినవాళ్లు. మన వాళ్లంతా బిజినెస్ పరంగా మాట్లాడుంటారు. మీరు మీ ప్రాంతం వారిగా మీ భాషలో వివరించి చెప్పండి. నిజానికి అక్కడ ఎన్నో కల్తీలు ఇదో పెద్ద కల్తీ మీ భారతీయులకు” అని వెటకారంగా అన్నాడు.
పెద్ద జాతీయ వాదిని కాను కానీ ఎందుకో భారతీయులను చులకన చేసి మాట్లాడేపాటికి నాకు తెలియకుండానే చుర్రున చూసా. సీఈఓ గాడు మరి తెలీకుండా గారు గాడయ్యాడు వెంటనే సర్దుకొని “ఇది అసలు కల్తీ కాదని చెప్పండి”అన్నాడు. నాకు ఆలోచించుకోవడానికి సమయం కావాలన్నాను.
“అఖిల్ ఆలోచించుకొని జవాబు చెప్పేంత సమయం మన దగ్గర లేదు. మీరు ఈ క్షణమే yes or no చెప్పాలి. లేదు అంటే ఇంకో ఆంధ్రావాలా కు చెప్తాము. మీ బిజినెస్ ఎత్తులు, మాట విధానం నచ్చి మిమ్మల్ని అనుకున్నాము సో డిసైడ్ నౌ” అని హుకుం జారీ చేశాడు..
ఇంకేం మాట్లాడతా. కాంటినెంట్ హెడ్ చేస్తాను అని భారీ ఆశ చూపాడు. ఆ పోసిషన్ చేరుకోవడానికి కనీసం పదేళ్లు పడుతుంది. మరి నేను ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏమిటి. అదే అడగాలని అతని వైపు చూసా. చెప్పాగా వీరు సామాన్యులు కారు.
“మీ ప్రయత్నం మీరు చేయండి. మాకు మీ పైన పూర్తి నమ్మకం వుంది. మీరు చేయలేకపోతే వాట్ నెక్స్ట్ అన్నది మేము చూసుకుంటాము. మీ జాబ్ మీకుంటుంది.”అన్నాడు.
ఇంత భరోసా ఇస్తున్నప్పుడు మనకింకేమి కావాలి, నా ప్రయత్నం నేను చేస్తా. ఏమో ఒక్కోసారి సుడి తిరిగి నేను గెలవొచ్చు…అందివచ్చిన అవకాశం . మనవాళ్లకు సెంటిమెంట్లెక్కువ అందులోనూ ఆడవాళ్లు, మూడు నెలలు గడువు ఇంకేం ఈ ఆలోచన రాగానే సరే అని చెప్పి కేసు కు సంబంధించిన ఫైలు, టిక్కెట్లు అందుకొని ఇండియా బాట పట్టా పెళ్ళాం పిల్లలతో….
@ @ @ @ @ @ # @ @
చాల కాలం తర్వాత ఇండియా కు వచ్చాను కదా.కంపెనీ పర్మిషన్తో ఓ నాలుగు రోజులు కుటంబంతో గడపాలనుకున్నా. నాన్న లేరు కొన్నేళ్ల క్రితం పోయారు. అమ్మ అక్కయ్య దెగ్గరే ఉంటుంది. నామీద కొద్దిగా కోపం తనకి. అక్కయ్య, స్నేహితులు అందరిని ఒకసారి కలిసి, భార్య పిల్లల్ని అత్తారింట్లో దించేసి. ఇండ్లలో ఉంటే పని కాదని కంపెనీ నాకోసం బుక్ చేసిన తాజ్ బంజారాలో దిగిపోయా. ఇంక వచ్చిన పని మొదలు పెట్టాలి. నేను నా వృత్తికి నా భవిష్యత్తుకు చాలా విలువిస్తా. కేసు స్టడీ చేద్దామని ఫైలు ఓపెన్ చేశా. ఇంతలో ఫోను. నా PA ఆ సైంటిస్టుతో ఇవాళ సాయంత్రం మీటింగ్ అరెంజ్ చేసినట్టు చెప్పాడు. సరే ఎలాగు సాయంత్రం ఒక సారి కలుస్తాకదా అని ఫైల్ మూసి అలారం సెట్ చేసుకొని పడుకున్నా. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు.
@@@@@@@@@
ఊరికి చాలా దూరంలో చాల ప్రశాంతమైన వాతావరణం లో విశాలమైన ప్రాంగణంలో వుంది ఈ సీసీఎంబీ, సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఏదో దర్పం ఉంది ఈ ప్రాంగణానికి… కారు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు ఆగింది. కారులోనుంచి దిగగానే ఒకవిధమైన పరిమళం నన్ను చుట్టుకుంది. అది ఒక nostalgic ఫీల్. ఎందుకో తొట్రుపాటు. మనసు కుదురు గా లేదు. నాలో ఇలాంటి భావనలు!!! అర్థంకాక అలాగే నిలబడిపోయా.. లోపలి నడవకుండా నిల్చున్న నేను PA పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాను. ఇద్దరం కలిసి ఆ సైంటిస్ట్ కేబిన్ దగ్గరకు వెళ్ళాము. లోపల వేరెవరో వున్నారు కాస్త వెయిట్ చేయండని బయట వున్న బాయ్ చెప్పాడు. ఇంతవరకు ఆ సైంటిస్ట్ పేరుకూడా తెలీదు కదా అని అక్కడ వున్న నేమ్ బోర్డు చూసాను. పేరు అపర్ణ శ్రీనివాస్ hod మాలిక్యూలర్ బయాలజి. అపర్ణ!!! ఆ పేరు చదవగానే ఏవో జ్ఞాపకాలు చుట్టుముట్టసాగాయి. ఆ అపర్ణ, ఈవిడ ఒకటేనా లేక పేరు మాత్రమేనా అని ఆలోచిస్తున్నంతలో మేడమ్ రమ్మంటున్నారని పిలుపు. PA ను బయటే ఉండమని చెప్పి నేనొక్కడినే లోపలికెళ్లా.
ఎదురుగా అపర్ణ! తను రాసుకుంటున్నదల్లా నేను వచ్చిన అలికిడి విని తలెత్తి చూసింది. అప్రయత్నంగా తన సీట్ లోనుంచి లేచి “నువ్వా!”అంది. నాకు పొలమారింది ఇంతలో తను సర్దుకొని “మీరా! కూర్చోండి”. అని చెప్పి తను తన సీట్ లో కూర్చుంది. నేను కూచున్నాను. ఇద్దరిమధ్య భయంకరమైన మౌనం. నాకు ఒక్క మాటా పెగలటం లేదు. తనో మాట్లాడటం లేదు. తన ముఖం చూడటానికి కూడా ఇబ్బందిగా వుంది. మరి తను నన్ను చూస్తోందా లేక. కొన్ని క్షణాల మౌనం తర్వాత, తనే కుశల ప్రశ్నలు వేసింది. బదులుగా నేను తన కుశలం అడిగాను. తర్వాతేమి మాట్లాడాలో అర్థం కాక నేను మళ్ళి కలుస్తాను చెప్పి వచ్చేసాను.
ఇప్పుడర్థమయ్యిoది కంపెనీ ఈ పని నాకే ఎందుకు అప్పజెప్పిందో. అనుమానం వచ్చింది కానీ ఇది అని వూహించలేకపోయా. కార్పొరేట్లు ఎంతటి ఘానులంటే వారి కోసం గత ఏడుజన్మల విషయాన్ని కూడా తిరిగి తొడగలరు. మనసు అల్లకల్లోలంగా మారింది. ముగిసిపోయిందనుకున్న కథ మళ్ళీ ఇలా!. కలలో కూడా ఊహించలేదు ఇన్నేళ్ల తరువాత మళ్ళీ తనను కలుస్తానని. మరిచాను అనుకున్నా, కానీ నాలోని అఖిల్ నిద్ర లేచినప్పుడు ముళ్ళై గుచ్చుతూనేవుంటుంది. మనసు, హృదయాంతరాలలోకి తొంగిచూస్తోంది. నా చిన్న నాటి ఘటనలు ఒక్కొక్కటిగా మెదలసాగాయి.
@@@@@@@@
నేను పదో తరగతిలో ఉండగా మా ఇంటి పక్కనే కొత్తగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసారు రావు గారు. ఆయనకు ఒక్కటే కూతురు. వారు కొత్తగా చేరుతున్నారు కదా! అవసరాలేమన్నవున్నాయేమో కనుక్కోమని అమ్మ నన్ను వాళ్ళింటికి పంపింది. బెరుకు బెరుకు గానే లోపలి వెళ్లిన నేను ఒక అమ్మాయి పరికిణీలో ఎంత ముద్దుగా ఉందొ మళ్ళీ మళ్ళీ చూడాలనేట్టు నన్ను చూడగానే వాళ్ళమ్మకి కేకేసి కూర్చుమంటూ నాకు మర్యాద చేసింది. అదే మొదటిసారి నాకు మర్యాద జరగడం. మా ఇంట్లో నేను అక్క, ఎప్పుడు అది తెపోరా!ఇది తెపోరా ! అని నా పేరు కూడా పెట్టి పిలువరు. మొదటిసారి ఒకరు నన్ను మర్యాద చేసి కూర్చుపెడుతుంటే ఏదో ఆనందం. ఒక సింహాసనం మీద కుర్చున్నంత ఫీల్. ఈలోపు ఆ అమ్మాయి లోపలికెళ్ళి వాళ్ళమ్మను పంపింది. విషయం చెప్పి తను కనపడుతుందేమో అని ఒకసారిచూసా,తను కనపడలేదు, చిన్న నిరాశతో వెనుదిరిగా. పక్కిల్లే కదా అని ఓ ధీమా. ఒక రోజు స్కూల్ నుంచి రాగానే తనే మా ఇంట్లో అక్కతో మాట్లాడుతూ. అప్పుడు పరిచయాలు అయ్యాయి తనపేరు అపర్ణ అని మా స్కూల్లోనే తొమ్మిదో తరగతని. ఇలా మొదలైన పరిచయం స్నేహంగామారి కాలగమనంలో ప్రేమగా రూపాంతరం చెందింది. తనంటే మా అమ్మకు, అక్కకు చాలా ఇష్టం. మా ప్రేమ బలపడడానికి ఇదో పెద్ద కారణం.
నాకు ఐఐటీ లో సీట్ వచ్చిన సందర్బంగా నాన్న ఇంట్లో చిన్న పార్టీ ఏర్పాటు చేశారు. నాన్నో పెద్ద ఇంజనీరు. తన ఆఫీసువాళ్లను బందువులను అందరిని పిలిచాడు. ఆ రోజు మా ఇంట్లో సందడంతా తనదే. అమ్మ అయితే తనను అక్కను తనను చెరో పక్క నిలుపుకుంది. కానీ నాన్నకు ఎందుకో నచ్చటం లేదు. ఆ రోజు రాత్రి అమ్మ ఇల్లు సర్దుతూ “మన అఖిల్ చదువు పూర్తి కాగానే అప్పును ఇచ్చి పెళ్లి చేసేస్తా. ఎప్పుడెప్పుడా అప్పును ఇంటి కోడలు చేసుకుందామని వుంది ” అని యధాలాపంగా నాన్నతో అన్నది. అమ్మ మాటలు అప్పుడే యవ్వనం లోకి అడుగు పెడుతున్న నాలో గిలిగింతలు రేపాయి. నాన్న ఏమంటారు అని దొంగ చాటుగా వినసాగా.
“ఇప్పటినుంచే ఇలాంటి లెక్కలేమి వేసుకోకు.” అని కొంచం కర్కశంగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు నాన్న. అమ్మ నాన్న వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయింది. నాకూ! ఏమీ అర్థం కాలేదు. బూతద్దం వేసి వెతికినా తనలో పేరు పెట్టడానికి ఏమిలేదు. అందము, మంచి సంస్కారం చదువులో కూడా బాగుంది ఇంకేమో అర్థం కాలేదు. సరే ఈ గోల మనకెందుకు అనుకోని నేను వూరుకుండిపోయా.
మొత్తానికి ఢిల్లీ వెళ్లే రోజు రానే వచ్చింది. మొదటిసారి అందరిని ఒదిలి వెళ్తున్నాను. అమ్మ నాన్నలకంటే అప్పుకు దూరం వెళ్తున్నందుకు బాధేసింది. చూస్తుండగాని మొదటి ఏడాది గడచిపోయింది. నాకు అప్పుకు ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తూనేవున్నాయి. తనకు మెడిసిన్ లో సీట్ రాలేదు. వారి తండ్రికి ప్రవైట్ కాలేజీలో చదివించే స్తొమత లేదు అయన ఒక ప్రైవేట్ కంపెనీ లో మామూలు ఉద్యోగి. తను మైక్రో బయాలజీ కోర్స్ లో డిగ్రీ జాయిన్ ఇయ్యింది. పాపం తనకు మెడిసిన్ లో సీట్ రాకపోయేపాటికి చాల బాధ పడ్డది. రానందుకు ఒక భాధ నేను దూరమవుతానేమో అని మరో భాధ. పాపం వుండబట్టుకోలేక అదే అడిగింది. నాకు నీవంటే ఇష్టం, నీ చదువు కాదు అని చెప్పా. ఈ మాటకు ఆరోజు తను ఎంత సంతోషపడ్డదో ఇప్పటికి గుర్తు.
కానీ ఇదే నా జీవితాన్ని మలుపు తీసుకుంటుందని నాకు తెలీదు. నాన్నకు మొదటి నుండి వారి మీద చిన్న చూపు ఇప్పుడు మెడిసిన్ లో సీట్ రాకపోయేపాటికి అప్పు వాళ్ళ ఫామిలీ తనకు ఇంకా నచ్చలేదు. నేను అమ్మ అప్పుకు క్లోజ్ అన్న విషయం నాన్నకు అర్థం అయ్యింది. మాతో విభేదించకుండా మెల్లిగా నా మనస్సు మారేట్టు చేశారు. ఎప్పుడూ లేనివిధంగా ఈమధ్య నాతో చాలా క్లోజ్గా వుంటున్నారు.. ఎప్పుడు స్తొమత, వున్నత స్థాయి, కెరీర్, సంఘంలో గొప్ప పేరు ఇలా నాలో ఒక రకమైన కైపును నింపారు. పైగా నేను ఢిల్లీ లో ఉండేది. నాన్న చెప్పేది నిజం అన్నట్టు ఉండేది మా క్యాంపస్. ఇక్కడ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఏమాత్రం వుండవు. కెరీర్, పోసిషన్, కంపెనీ, శాలరీ ఇంతే. నాన్న ఎక్కించిన ఈ కైపులో అప్పు ప్రయారిటీ నుంచి ఆప్షన్ గా ఎప్పుడు మారిపోయిందో తెలీదు. వారానికో వుత్తరం రాసే నేను నెలకు, ఆతర్వాత ఎప్పుడో!!!. ..
నేను ఫైనల్ ఇయర్ ఉండగా తనకు యూనివర్సిటీ క్యాంపస్ లో MSc సీట్ వచ్చింది. నేను హాలిడేస్ కు వచ్చిన మరు రోజే తన తిరుపతి ప్రయాణం. నన్ను కల్సి నాతో మాట్లాడాలని చాల తాపత్రయపడ్డది. నాన్న కావాలనే ఆ రెండు రోజులు లీవ్ పెట్టి ఇంట్లో కూర్చున్నారు. అమ్మ ఇది కనిపెట్టిందేమో నాన్న ఫోనులో ఉండగా నన్ను వారింటికి పంపింది. నన్ను చూసి ఎంత సంబరపడ్డదో. వాళ్ళ అమ్మ నాన్న కూడా అంతే సంతోషించారు. ఉన్నట్టుండి అప్పుడు చెప్పింది తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పినట్టు, అందరూ ఆనందించినట్లు, అంతే కాదు ఈ విషయం మా ఇంట్లో కూడా అందరికి తెలిసిపోయింది. మంచిదేగా అనుకున్నా. తను తిరుపతి వెళ్ళిపోయింది. తను వెళ్ళాక కొద్దిగా వెలతీగా అనిపించింది. మొదటిసారి ఇల్లు బోర్ కొడ్తున్నట్టుగా అనిపించింది. నాన్న పసిగట్టాడు. ఫామిలీ టూర్ అని ఎప్పుడూ లేనిది అందరిని ఊటీ పిల్చుకేళ్లాడు. ఒక్క క్షణం నన్ను విడిచిపెట్టకుండా నన్ను అంటుకొని వున్నాడు. అప్పు ఆలోచనలను
విజయవంతంగా రానీయకుండా చేసాడు.
బీటెక్ అవ్వగానే అక్కడే ఎంటెక్ లో జాయిన్ అయ్యాను. తను MSc లో గోల్డెమెడల్ తెచ్చుకుంది. తర్వాత అక్కడే Phd జాయిన్ అయ్యింది. నా చదువు పూర్తి కావొస్తోంది అనగానే నాన్న హటాత్తు నిర్ణయం మకాం కడప నుంచి హైదరాబాదు ట్రాన్స్ఫర్ పేరుతొ. కోర్స్ ముగిసి ఈ సారి నేను హైదరాబాదే వచ్చాను. పాపం అప్పు నన్ను చూడడాని అంత దూరం నాకోసం హైద్రాబాదు వచ్చింది ఎప్పుడూలేనిది వాళ్ళ చుట్టాలింటికి. మా ఇంటికి వస్తుందని తెలియగానే నాన్న తెలివిగా నన్ను ఏమార్చి బయటకు పిల్చుకెళ్లారు. పాపం తను నాకోసం వేచి చూసి చూసి వెళ్ళిపోయింది. నాన్న నన్ను తననుంచి దూరం చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది కానీ నాన్న మాటలకు దూరంగా రాలేకున్నాను. నిజంగా తనను చాల ఇష్టపడ్డాను. ఎన్నిమంచి భావాలుండేవో తనలో. ఎప్పుడు సమాజ హితమే. ఇంత మంచిగా ఉంటే నిన్ను ఎవరైనా మోసం చేసేస్తారు అనేవాడిని. దానికి తను “నన్ను చూసుకోవడానికి నువ్వున్నావుగా ఇంకెందుకు నాకు భయం”అనేది. ఈ మాట గుర్తుకు వచ్చి చాల భాధేసింది వెంటనే ఫోన్ చేసి తనతో మాట్లాడాక మనసు కుదుటపడ్డది. రేపు నేనే వచ్చి కలుస్తాను అని చెప్పా. తన పేరెంట్స్ కూడా వచ్చారని అన్నది. అందరిని కలిసినట్టుంటుంది తప్పక వస్తానన్నాను. ఈ విషయం అమ్మకు చెప్పా!! తనెంతో సంతోషించింది.
అప్పు ఇంటికి బయలుదేరుతుండగా నాన్న నుంచి ఫోను. నోవాటేల్ లో ఏదో పార్టీ రావాలని. ఈ సారి నాన్న మాయలో పడకూడదు అని నాన్నకు గట్టిగ చెప్పా అప్పు ఇంటికెళ్తున్నట్టు. నాన్నేమంటారో అని భయపడ్డ. సరే అలాగే వెల్దువు అని, తన ఉద్యోగానికి తప్పని అవసరం కాబట్టి కాసేపు వచ్చి పరిచయాలయ్యాక నీ పాటికి వెళ్లిపో అని నన్ను ఒప్పించారు. సరే చేసేది ఏమి లేక అప్పుకు విషయం చెప్పి నోవాటేల్ కు వెళ్ళా.
నోవాటెల్ హోటల్ లో కన్వెన్షన్ హాల్. ఎంతో అందంగా అలంకరించబడింది. నాన్న గారు ఆ బిజినెస్ మాగ్నెట్ ను పరిచయం చేశారు. పెద్ద మనిషి నాకెంతో మర్యాద చేసాడు. నాకెందుకో ఎవరైనా బాగా మర్యాద చేస్తే పడిపోతా. ఆవేళ తన కూతురి పుట్టిన రోజు అందుకే ఈ పార్టీ. అయన నన్ను వాళ్లవాళ్ల అందరికి పరిచయం చేస్తుంటే నేను భూమిమీద లేను. ఈలోపు దేవకన్య అలంకరణలో వారి కూతురు నవీన, ఆమెను చూడగానే నా మతే పోయింది. ఆ అందం ఐశ్వర్యం దర్పం, నాలోని మగతనo చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి రాజభోగం అనిపించింది. పరిచయాలు అయ్యాక వెళ్లాలన్న నేను ఆ మాటే మరిచిపోయా,చివరి వరకు వున్నా. పార్టీ అయ్యాక వెళ్తున్నవాడినల్లా వాలెట్ పార్కింగ్ దగ్గర ఆమె వైభోగం మళ్లి కట్టిపడేసింది. నవీన నన్ను ఊపిరి తిప్పుకోనివ్వలేదు తన ఆలోచనలతోనే అప్పు ఇంటికి చేరా. అప్పు ఎంతో సాదరంగా ఆహ్వానించింది. తెలీకుండానే అప్పుకు నవీనాకు పోల్చింది మనసు. అప్పు నాకంటికి రంగు వెలసిన చీరలాగుంది. ఎక్కువసేపు వుండలేకపోయా. వచ్చేసా. అమ్మ అప్పు గురించి అడుగుతోంది నాకు నవీన తప్ప ఎవ్వరు కనిపించటం లేదు. మరుసటి రోజు అమ్మ పెళ్లి ప్రస్తావన తెచ్చింది. నేను నాన్న అమ్మ, అక్కకు పెళ్లై హైద్రాబాద్ లొనే ఉంటోంది తను కూడా అప్పుడే వచ్చింది. ఇంతలో నాన్న మీకంతా సర్ప్రైజ్ అంటూ నవీన తండ్రి నన్ను తమ అల్లుడుగా చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు. నా ఆనందానికి అవధులు లేవు. ఎగిరి గంతేయ్యడం ఒక్కటే తక్కువ. కానీ అమ్మ నాన్నతో పోట్లాటేసుకుంది “వాడికి అప్పు అంటే చాల ఇష్టం మనింటికి వాడికి అప్పునే సరి అయిన జోడి”అంది.
“అప్పు!! అప్పు!! ఏముంది ఆపిల్లలో, ఒక సాధారణ కుటుంబం. అదే వీళ్ళు చూడు ఒక హోదా ఒక దర్పం అన్ని వున్నాయి” అని నాన్న. వారిద్దరూ వాదించుకొని చివరకు నా నిర్ణయమేమిటని నన్ను అడిగారు . మనసులోకి తొంగి చూసా అప్పునే వుంది. భవిషత్తు చూస్తే నవీన వుంది. చివరకు భవిష్యత్తు గెలిచింది కాదు నాలోని మగవాడు గెలిచాడు. నవీనకే నా ఓటు వేసా. నాన్న ఆనందానికి అవధులు లేవు అమ్మ అక్క నా నిర్ణయంతో ఖంగుతిన్నారు. కూలబడిపోయారు. అమ్మ నమ్మలేనట్టు నా దగ్గరకు వచ్చి అప్పుకు నవీనాకు వున్నా తేడాను తనకు నేను ప్రేమిస్తున్నట్టు చెప్పిన మాటలు ఇంకా ఏవేవో చెబుతోంది. అవి నన్ను చేరలేదు. నేను ఇంకా నవీన హ్యాంగోవర్ నుంచి దిగలేదు. చివరగా అమ్మకు చెప్పా” కాలం మారిందమ్మా! నిజమే అప్పు మంచిపిల్ల. కానీ మంచి తనం మనల్ను సొసైటీ లో గొప్పగా నిలబెట్టావుకదా. నిజమే ప్రేమించాను. కానీ ఎప్పుడు చనువు తీసుకొని తనను వాడుకోలేదు. మనకు ఒప్షన్స్ వున్నప్పుడు ఏది గొప్పదో అదే తీసుకుంటాము, ఇందులో తప్పేముంది” అన్నాను.
నా ఈ మాటలతో అమ్మకు విపరీతంగా కోపం వచ్చి చెంప చెళ్లుమనిపించింది.”ఏరా పెళ్లి ఆప్షనా!పెళ్లి అంటే రెండు ఆత్మలు కలిసి ఒకటిగా జీవించేది. ఇంత మంచిగా ఉంటే ఎవరైనా మోసం చేస్తే ఎలా! అని నేను అన్నప్పుడల్లా! పాపం అది అఖిల్ ఉన్నాడుగా నాకేం భయం అనేదిరా. అలాంటిది నీవే దాన్ని మోసం చేస్తావనుకోలేదు” అని అమ్మ ఇంకా ఏదో చెప్పబోతున్నంతలో నాన్న అడ్డు తగిలి “నీ పాత చింతకాయ భావాలు, భావనలు అని వాడి తల తినకు. నా తల తిన్నది చాలు. నీవల్ల నా తోటి ఇంజినీర్లు కోట్లకు పడగలెత్తింటే నేను ఇదిగో ఇక్కడే వున్నాను. ఇప్పుడు నా కోడుకు నిర్ణయానికి ఎదురు చెప్తే ఒప్పుకునేది లేదు”అన్నాడు. నాన్న మాటలతో అమ్మ కుప్పకూలిపోయింది. “అఖిల్ అందరి మగవాళ్లలాగా నీవు కూడా ప్రేమ పేరుతొ మోసం చేస్తావను కోలేదు రా”అంది అక్క. ఈ మాటతో నాకు కోపం వచ్చింది. “నెనేమి మోసం చేయలేదు. చిన్ననాటి స్నేహం, ఆకర్షణను ప్రేమనుకున్నానేమో. కానీ ఇప్పుడు నా లైఫ్ కు అప్పు ఎంత మాత్రం సూట్ ఆవ్వదు. నేను నా ఫ్యూచర్ చూసుకోవాలికదా.”అన్నాను. బయట గేటు అలికిడైతే అటుగా చూసాము అందరూ. అప్పు తన తల్లి తండ్రులు వెళ్లిపోతున్నారు. అమ్మ పిలవడాని ప్రయత్నించింది, వద్దని అక్క వారించింది. అదిగో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అమ్మ నాతొ అవసరం అనిపిస్తే తప్ప మాట్లాడలేదు. ఏడాది తిరిగేలోపు అంగరంగ వైభవంగా పెండ్లి, అమెరికాలో మామగారు ఇచ్చిన ఇల్లు. కలలో కూడా ఊహించని వైభోగం. చూస్తుండగానే ఇద్దరు కొడుకులు. ఈ పరుగు పందెంలో వైభోగం లో మొదట్లో కనిపించలేదు కానీ నాలోని ఒక మధ్యతరగతి మనిషి బయటకు వచ్చినప్పుడు మాత్రం అమ్మ అక్క అప్పు గుర్తుకు వచ్చేవారు. ముఖ్యoగా హోటల్ కూడు తిని వెగటు వచ్చినప్పుడు. వంట వార్పూ అనేది అస్సలు లేదు. తనదో లోకం నాదో లోకం. మనసు శరీరం అలసిపోయినప్పుడు మాత్రం ఏదో కోల్పోయాను అనిపించేది. కానీ నా కెరీర్ ముందు ఇవేవీ పెద్దగా కనిపించేవి కావు. నాన్న బతికున్నన్నాళ్లు ఏడాదికి ఒకసారి అమెరికా వచ్చి వెళ్లేవారు. అమ్మ మాత్రం ఇప్పటివరకు ఎప్పుడూ రాలేదు. నవీన ఎప్పుడు ఇండియా వచ్చినా అమెరికా వెళ్లేరోజు మాత్రం ఇంటికి వచ్చేది. కోడలు రాలేదే అని అమ్మ ఎప్పుడూ అడిగేది కాదు.
మరిచిపోయాననుకున్న అప్పు మళ్లి ఇలా. ఇప్పుడేమి చేయాలో పాలుపోలేదు. అమ్మా వాళ్లకు అప్పుతో సంబంధాలు ఉన్నాయో లేవో గడిచిన ఈ పదిహేనేండ్లలో ఎప్పుడూ అడగలేదు. ఏమీ చేయాలో ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కాక అప్పు ఆలోచనలతో హోటల్లో ఉండలేక అలా నడుస్తూ రోడ్డు మీదికొచ్చా. వద్దన్నా తనతో గడిపిన రోజులు గుర్తుకొస్తున్నాయి. నాకే ఆశ్చర్యం వేసింది. అంటే నేను తనని మరచిపోలేదన్నమాట. గుండెలోతుల్లో తను ఇంకా వుంది. నేనే కెరీర్ ఒరవడిలో కొట్టుకోపోయాను.
అక్కకు కాల్ చేశా రేపు కలవగలవా అని, బాగా బతిమాలితే కానీ రావడానికి ఒప్పుకోలేదు. అక్కతో మాట్లాడక తెలిసింది ఏమిటంటే మా మాటలు విన్న అప్పు తండ్రి అది తట్టుకోలేక గుండెపోటుతో పోయారని, తర్వాత అప్పు PhD చేసి సీసీఎంబీ లో వుద్యోగం చేస్తూ తన తోటి సైంటిస్టునే పెళ్లిచేసుకొని హాయిగా ఉంటోందని తెలిసింది. అమ్మ నెలకొకసారైనా వెళ్లి కలుస్తూవుంటుందని తెలిపింది. ఇద్దరు కూతుర్లు. ముచ్చటైన సంసారం అని అక్క చెప్తే మనసులో ఎక్కడో చిన్న అసూయ, నామూలంగా తండ్రి పోయారన్న భాధ వేసాయి. అక్కకు నేను వచ్చిన పని చెప్పాను. ఇంటికెళ్లి ఒకసారి కలవమని సలహా ఇచ్చింది. తన భర్తకు నా గురించి తెలుసు. తెలిసే పెళ్లి చేసుకున్నాడు అని చెప్పింది. వెళ్తూ వెళ్తూ “ఏమైనా శ్రీనివాస్ గారు అదృష్టవంతుడు” అని నన్ను మెల్లిగా దెప్పిపొడిచి వెళ్ళింది.
ఏదైతే అదువుతుంది. పాతవి తలచుకుంటూ వుండలేము కదా. తనకు కావలసిన జీవితం తనకు నాకు ఇష్టమైన జీవితం నాకు దక్కాయి. . జీవితంలో కొన్ని కావలనుకున్నప్పుడు కొన్ని కోల్పోక తప్పదు. ఇప్పడు నా కర్తవ్యం ఆసియ కు రాజు కావడమే అని దృఢంగా నిశ్చయించుకొని, అపర్ణ ఇంటికి వెళ్ళాను. తన అభిరుచికి తగ్గట్టు,
ఇల్లు ఎంతో అందంగా ఉంది. నేను గేటు తీసుకొని రావడంతో ఇద్దరమ్మాయిలు పట్టులంగా తో మొదటిసారి అప్పును చూసినట్టుగా అప్పులానే!!! అదే మర్యాద.. నన్ను సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టి తల్లిని పిలవడానికెళ్లారు అలనాడు అప్పు లాగే. ఈలోపు వారి భర్త అనుకుంటా చాల బాగున్నారు. మా పరిచయాలు అయ్యాక అపర్ణ కాఫి కప్పులతో వచ్చింది. కాఫీ తాగాక పిల్లలిద్దరితో వాళ్ళాయన నాదగ్గర సెలవు తీసుకొని బయటకు వెళ్లిపోయారు.
మాటలు ఎలా ప్రారంభించాలో అర్థం కాలేదు. తనే చనువుగా కుశల ప్రశ్నలు వేసింది. ఎప్పుడు తనతో సూటిగా మాట్లాడే నేను ఇవాళ తన ముఖం లోకి చూడలేకపోయా. కాసేపటి మౌనం తర్వాత సూటిగా నే తనకు నచ్చచెప్పడానికి ప్రయత్నం చేశా. అప్పు! అని పిలవబోయే సర్దుకొని అపర్ణ అన్నాను. “చూడు ఈ అంతర్జాతీయ సంస్థలు మామూలువి కావు. వాళ్ళు అనుకున్నది సాధించేవరకు వాళ్ళు ఊరుకోరు ఎన్నో కల్తీలు జరుగుతున్నాయి. ఇది చిన్న విషయం అని అనను. కంపెనీ రాజీ కోస్తానంటోంది. ఇకపై ఇలాంటివి జరగకుండా చూస్తానంటోంది. ఉభయ కుసలోపరి. కాబట్టి నీవు ఈ కేసు వెనక్కు తీసుకుంటే మంచిది అని నా భావన” అని చెప్పటం ముగించి తనవైపు చూసాను. నే చెప్పిందంతా సాలోచనగా విన్న తను.”అఖిల్ నా ప్రాణాలు కావలా! ఇప్పుడే ఇచ్చేస్తాను”అన్నది స్థిరంగా నా కళ్ళొలోకి చూస్తూ. ఒక్క సారి తను నాకు ఏమీ చెప్తోందో అర్థం కాక పొలమారింది. నా చేతికి నీళ్ళందించి “చూడు అఖిల్ నీకు ఈ డీల్ సక్సెస్ అయితే ఓ పెద్ద ప్రమోషన్ లేకపోతె డబ్బు ఇస్తారు. కానీ ఈ లెడ్ మోతాదుకు మించి ఉండడం వల్ల భవిషత్తులో ముఖ్యoగా చిన్నపిల్లలను కాన్సర్ బారిన పడేట్టు చేస్తుంది. అందులో నీ పిల్లలు నా పిల్లలు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితానికి ప్రొసెస్డ్ ఫుడ్ అన్నది అనివార్యమైంది. అందులో మన వాళ్లకి ఫారెన్ సరుకు అంటే నిఖార్సైనది అని ఓ గుడ్డి నమ్మకo. కాబట్టీ ఇంతటి హానికారకమైన ఈ కేసును వెనక్కు తీసుకొనే సమస్యలేదు. అందుకు మూల్యం నా ప్రాణాలైనా సరే” అని ఖరాఖండిగా చెప్పింది.
“నువ్వు చెప్పింది నిజమే! మళ్లి ఈ తప్పు చేయనంటోందిగా కంపెనీ. కోర్టు లో అయితే వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటుంది కదా! అందుకని వాళ్ళు కోర్ట్ బయట సెటిల్మెంట్ అంటున్నారు . అంత పెద్ద కంపెనీ ఆ మాటిస్తున్నప్పు ఇంత బెట్టు అక్కర్లేదేమో”అన్నాను. తను చిన్నగా నవ్వి ” అఖిల్ ఈ మాట మీ కంపెనీ ఇదివరకే చెప్పింది. . మా పరీక్షల్లో లెడ్ మోతాదుకు మించి ఉంది అని తేలింది నిజం! కాబట్టే మీ కంపెనీ కాళ్లబేరానికి వచ్చింది. ప్రపంచంలో అందరు స్వార్థపరులు కాదు మంచి వాళ్ళు కూడా వున్నారు. మా ఈ రిపోర్ట్స్ ను మా సీసీఎంబీ చైర్మెన్ రాజ ముద్ర వేశారు అంటే తిరుగులేదని అర్థం. సీసీఎంబీ కి కొన్ని పరిమితులు ఉంటాయి. అందు వల్ల నేను కోర్టుకు వచ్చాను. ప్రభుత్వం కూడా మాతో వుంది. అందుకే వేరే దారిలేక కోర్ట్ బయట రాజీ అంది మీ కంపెనీ. నీ స్వార్థం కోసం ఆ రోజు నన్ను నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్లావు. నేను కనీసం ఒక్క సారి కూడా ఎందుకు ఇలా చేసావు అనడగలేదు. అది నీ జీవితం నీ హక్కు. కానీ ఇది నీ జీవితం నా జీవితం కాదు కొన్ని కోట్ల ప్రజల జీవితం. నీ కోసం వెనక్కు తగ్గేది లేదు”అని చాల కోపంగా సమాధానము ఇచ్చింది.
“ఇప్పుడు నీవే అంటున్నావు కదా! ప్రభత్వాలు మారాయి అని ఈ తప్పు పునరావృత్తం కాకుండా చూసుకుంటారు. నాకైతే ఇందులో అంత బెట్టు చేయాల్సిన అవసరం లేదనిపిస్తోంది. ఇక్కడ నా స్వార్థం ఏముంది. అవును నిజమే ఆ రోజు నిన్ను నా స్వార్థం కోసం వదిలేసాను. నీవు గుర్తొచ్చినప్పుడెల్ల నన్ను ఈవిషయం గుచ్చుతూనేవుంటుంది. దానికి కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు. ఇంకోసారి అలోచించి చూడు. నీకే అర్థమౌతుంది”.
“నీ స్వార్థం లేదా!. ఇంత స్పష్టంగా నీ స్వార్థం కనపడుతుంటే. ఎందరో అమాయకులు బలి అవుతారు అంటుంటే చీమ కుట్టినట్టు కూడా లేదు కదా. వారు సరుకును కూడా వెనక్కు తీసుకోరంట. ఇప్పటి సరుకు ఇలానే ఉంచి ఇకపై వచ్చే సరుకుల్లో లెడ్ ను సరిచేస్తారంట. నీకు తెలుసా ఇప్పుడున్న సరుకులో సగం చాలు భావి భారతం కాన్సర్ గ్రస్తం కావటానికి” చాలా ఆవేశంగా అంది
” నీవు మరీ ఎక్కువగా చెప్తున్నావు. నీవు చెప్పేదే నిజమైతే ప్రపంచదేశాలు వొప్పుకుంటాయా.”
“అందుకే కదా కాళ్లబేరం.”అంది
“ఇంకోసారి నింపాదిగా ఆలోచించు కావాలంటే మీ చైర్మన్ సార్ తో నేను మాట్లాడుతాను”
“నేను అన్ని విధాలుగా ఆధారాలు సేకరించి చాల మంది చేత కౌంటర్ చెక్ కూడా చేయిoచి కేసు వేసాను. ఇందులో ఏ ఒక్క పాయింట్ ను కూడా మీ కంపెనీ తప్పని ప్రూవ్ చేయలేదు.” అంది
“నిజమే నేను ఒప్పుకుంటాను. కానీ ఒక్కసారి కంపెనీ వారితో మాట్లాడి చూడు”అన్నాను
“ఇప్పుడు అదే గా చేస్తున్నాను.” అంది అంటే తను నన్ను పరాయి వాడిగా మాట్లాడుతోంది. నా అహం దెబ్బతింది నేను కోపం తో “అయితే తప్పుకోనంటావ్”
“తప్పనిసరి అంటాను” అంది అంతే కోపంగా..
“మొదటి నుంచి నీవు అంటే ఏ ఎదుగు బొదుగూ లేకుండా ఇక్కడే ఉండాలనుకుంటావు. సోసైటీ అది ఇది అని ఏదో పెద్ద సంఘ సంస్కర్త గా మాట్లాడుతావు. చూడు నీ జీవితం ఎక్కడుందో. నేనెక్కడున్నానో! అవకాశం అందిపుచ్చుకోవాలి. కెరీర్ లో ఎత్తుకు ఎదగాలి. కంపెనీ ని ఒక చిన్న విషయాన్నికి ఢీ కొట్టిడం పెద్ద గొప్ప కాదు. నీలాంటి వాళ్ళను ఎలా దారికి తెచ్చుకోవాలో వారికి తెలుసు. నీవు ఒప్పుకుంటే కోటి ప్యాకేజీతో వారు నీకు నీ భర్తకు మంచి జీవితం తో ఉద్యోగం ఇస్తారు. ఇది విజ్ఞత. వాళ్లేమీ తప్పును సరిచేసుకొము అనటంలేదు కదా. ఇంత వెర్రి పట్టు అవసరంలేదేమో”అని నేను గట్టిగా చెప్పా.
అంతే!!! తను ఒక్కసారి నన్ను చీత్కారంగా చూసింది. ఆ చూపు తట్టుకోవడం నిజానికి చాల కష్టం గా వుంది.
“నీవు స్వార్థపరుడివి అని తెలుసు కానీ ఇంత స్వార్థ పరుడివి అని తెలీదు. మనసులో ఇంకా ఎదో మూల నీవంటే అభిమానం అలానే ఉండేది ఈ క్షణం వరకు. కానీ ఆంటీ అదే మీ అమ్మ అన్నదే నిజం.” నీవు వట్టి స్వార్థ పరుడివి మీ నాన్నలాగా, నాకు సరిజోడు కాదు” అని మీ అమ్మ అంటుంటే నన్ను ఓదార్చడానికి అనుకున్నా . తల్లికి బిడ్డ గురించి తెలీదా. నిజమే ఇన్నాళ్ళు ఎక్కడో ఓ మూల నా ప్రేమ దక్కలేదు అని భాధ ఉండేది. కానీ ఇప్పుడు దేవుడు నా ప్రేమ నాకు దక్కకుండా చేసి మంచే చేసాడు అనిపిస్తోంది. చూడండి అఖిల్! ఇంక తేల్చుకోవడానికి ఏమిలేదు. మనం కోర్టులోనే కలుద్దాం. ఇది ప్రారంభించినప్పుడు నేను ఒక్కదాన్నే ఇప్పుడు ఎంతో మంది నాకు అండగా వున్నారు. మీ ప్రయత్నం మీరు చేసుకోండి. నా ప్రయత్నం నేను చేస్తా. నేను బ్రతికున్నతవరకు పోరాడతా. చివరిగా ఒక మాట. నీ చదువుకి ఎక్కడైనా నీకు వుద్యోగం వస్తుంది. కనీసం జీవితంలో ఒక్కసారైనా నీ స్వార్థం నుంచి బయటకురా. అంతమంది తల్లుల ఉసురు పోసుకోకు. ఆ తర్వాత నీ ఇష్టం”. అని చెప్పి ఇక చెప్పడానికి ఏమిలేనట్టు నన్ను బయటకు పొమ్మనలేక తను లోపలి వెళ్ళిపొయిoది.
నేను మెల్లిగా బయటకు నడిచాను. తను అన్న మాటలు , ముఖ్యoగా నా తల్లి! నా తల్లి దృష్టిలో నా విలువ అణువంతైనా లేదా. అమ్మకు కోపం అని తెలుసు కానీ నన్ను అసహ్యoచుకుంటోంది అని తెలీదు. ఇది తలుచుకున్నప్పటినుంచి నేను పాతాళం లోకి పడిపోతున్నట్టుంది. నేను సాధించినది ఏమిటి. నేను నిజంగా అంత స్వార్థపరుడినా. నేనంటే ప్రాణం ఇచ్చే నావాళ్ల హృదయంలో ఇప్పుడు నాకు అణువంత చోటుకూడా లేదా.
అంతర్మధనం!!! మనసు ఎదురుతిరిగి ప్రశ్నిస్తోంది. అద్దంలో నా ముఖం వికారంగా కనిపిస్తోంది. మనసంతా అల్లకల్లోలంగా మారింది. అంతరాలలో ఒకటే అలజడి. ఎన్నో విస్ఫోటనాలు మొదలయ్యాయి. నేను ఇంత వరకు ఏమి సాధించినట్టు. శూన్యం అని మనసు వెక్కరిస్తోంది. అవును నిజమే! నా స్థాయిని అందుకోవడం ఎవరికైనా పెద్ద కష్టం కాదు. ఎవరికో ఎందుకు, అపర్ణ కేసు వెనక్కు తీసుకుంటే నాకులాగే తనకు భారీ ఆఫర్ ఇస్తుంది కంపెనీ. మరి ఇందులో నా గొప్పేమిటి. నేనెక్కడ అప్పు ఎక్కడ. ఈ రోజు అపర్ణ ముందు నేను రంగు వెలసిన వాడిలావున్నాను. ఇప్పుడు కేసుగురించి చదవడం మొదలుపెట్టా! ఏదో ఒక రోజు నాకు అప్పు విలువ తెలుస్తుందని అమ్మ అన్నది నిజమే. తను నమ్ముకున్న సమాజ హితం కోసం ఒక పెద్ద కంపెనీని ఢీ కొట్టింది. ఎక్కడా అమ్ముడుపోలేదు, భయపడలేదు, కించిత్ స్వార్థం కూడాలేదు. ఎంత తృప్తి గా జీవిస్తోంది, ఎంత మంది అభిమానాన్ని అందుకుంది. ఎంతో విలువైనది సాధించింది. విలువలతోనే బ్రతుకుతోంది. మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం చేయాలనిపించింది. తన చేయిని ఒడిసిపట్టుకున్న ఆ శ్రీనివాస్ ఎంత పుణ్యాత్ముడో కదా అనిపించింది.
కోలుకోవడానికి మూడు రోజులు పట్టింది. మూడు రోజులు హోటల్ లోనే వున్నా! ఎలా వున్నావు అని అడిగే దిక్కేలేదు. తల్లి కి దగ్గరలోనే ఉన్నా ఫోను చేసినా కనీసం వచ్చి వెళ్ళమని కూడా అనలేదు. తల్లి అయియుండి హోటల్ భోజనం బాగోలేదంటే “అవునా!” అన్నది కానీ భోజనానికి రమ్మని కూడా పిలువలేదు. నా మీద నాకే అసహ్యం వేసింది. ఇక ఆలోచించటానికి ఏమి లేదనిపించింది. నా తప్పులను సరిద్దిడుకోవడానికి, నా స్వార్ధానికి ప్రాయశ్చిత్తంగా కంపెనీకి రాజీనామా చేసాను. నాకు ఎప్పుడూ నా భవిష్యత్తు ముఖ్యం అందుకే, నా పిల్లలు నా వారి పిల్లల భవిత కోసం, అప్పు పోరాటంలో భాగస్వామిని కావడానికి నిర్ణయం తీసుకున్నా. ఇక్కడా నా స్వార్థమే. కానీ ఇది మనసుకు తృప్తినిచ్చింది. మొదటిసారి నిర్మాణాత్మకమైన స్వార్థం వైపు అడుగు వేసాను.

1 thought on “నేను సైతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *