April 25, 2024

తపస్సు – ఆఖరి మెట్టు పైనుండి..

రచన: రామా చంద్రమౌళి

 

ఇక్కడనుండి చూడు.. ఈ ఆఖరి మెట్టు పైనుండి

ముషాయిరా.. రాత్రిని కాల్చేస్తూ కాల్చేస్తూ

ఎలుగెత్తిన స్వరాలను మోసుకుంటూ గాలిలో .. ఒక దుఃఖజీర

ప్రక్కనే నిరంతరమై ప్రవహిస్తూ.. నది.. నిశ్శబ్దంగా –

ఔనూ.. శరీరంలోని ప్రాణం శబ్దిస్తుందా

పాదాలు ఒక్కో మెట్టు ఎక్కుతున్నప్పుడు

అందుకోవాలని అలలు పడే యాతన.. ఒక వియోగ జీవక్షోభ

గజల్‌ గాయని  ఒక్కో వాక్యకణికను

యజ్ఞంలోకి సమిధగా అర్పిస్తున్నపుడు

అక్షరాలు.. అగ్నిబిందువులై తేలి వస్తూంటాయి గాలిలో

సముద్ర జలాలపై లార్క్‌ పక్షుల్లా –

భూమిలో విత్తనమైనా, పిడికిట్లో నిప్పైనా

ఎన్నాళ్ళు దాగుంటుంది

మొలకెత్తడం.. దహించడం అనివార్యం కదా –

 

అర్థరాత్రి  దాటుతూంటుంది.. అంతా మత్తు.. స్వరమధురిమ మైకం

వజ్రాల హారాలేవో తెగిపోతున్నట్టు

దీపజ్వాలలేవో తీయగా కాలుస్తూ నిశ్శేషపరుస్తున్నట్టు

శరీరం ఉంటుంది

కాని ఉన్మత్తచిత్తయైన ఆత్మ ఉండదు

అడవివంటి అంతరంగం నిండా వందలవేల పక్షుల కలకలం

ఒక మనిషి  సున్నా ఔతుండగా..  మరొకరు ఒక ఒకటౌతారు

సున్నా ప్రక్కన ఒకటి.. ఒకటి ప్రక్కన సున్నా

విలువలు  విలోమానులోమాలై

వడ్రంగి పిట్టొకటి తాటిచెట్టును ముక్కుతో పొడుస్తున్న చప్పుడు

పెక్‌ పెక్‌ పెక్‌

తొర్ర ఎక్కడేర్పడ్తోందో తెలియదు

 

రాత్రి ముషాయిరాకు వస్తున్నపుడు

సందు మలుపు చీకటి నీడలో

వీధికుక్క అతనిలోని మరకను పసిగట్టి

మొరిగిన చప్పుడు .. ఫడేళ్మని తెగిన ఫిడేల్‌ తీగ

పశ్చాత్తాపం ఎప్పుడూ భళ్ళున పగిలిన పింగాణీ పాత్రే

ముక్కలెప్పుడూ తిరిగి అతకవు

కరిగించాలి.. అతకనివాటిని కరిగించాలి

విరుగుట.. పగులుట.. అతుకుట

జీవితమంతా ఆత్మరక్షణే-

ఆరిన దీపం చుట్టూ.. రెండు చేతుల దడి

చివరికి ముందర ఒక ఖాళీ పాత్ర

నిండడంకోసం ఎదురుచూపు

మాసిన గోడపై .. ఉమ్మేసిన పాన్‌ మరకలు

ఎక్కడిదో గాలిలో తేలివస్తూ

నిన్నటి ముషాయిరాలో పాడిన ఎంగిలిపాట ఖండిత వాక్యం

కన్నీళ్ళోడ్తూ-

 

ఇంకా త్లెవారక ముందే

నది ఒడ్డుపై ఎవరో.. జలహారతిస్తున్నారు

రెండు చేతుల్లో ఇత్తడి పళ్ళెం ధగధగా మెరుస్తూ .. ఎర్రగా మంట

ఆకాశం తగబడి పోతోంది –

 

 

 

 

 

 

 

 

From the Last Step

 

Translated by Indira Babbellapati

 

Hey, look from here,

standing at this last step,

the wind that carried the

vibrating notes that sprang forth

from the ashes of last night’s mushaira.

 

A sorrowing streak eternally flows beside

a river in a silent flow. Yes, tell me,

if life flows humming in the body?

The waves struggle to capture the feet

negotiating the stairs upward,  there

echoes a haunting melody of destitution.

When the ghazal singer offers each of

her lines as the chips to the holy fire,

the letters, like drops of fire, come

floating in the air like larks hovering

on the surface of the sea. How long

can the earth retain a seed in its womb?

How long can fire be held in one’s fist?

 

Germination or burning is inevitable.

 

Time lapses into the wee hours

Dopiness of music,  intoxicating!

A chain of diamonds abruptly snaps,

anon, the wicks in the lamp burn sweet

enough to reduce one into a zilch.

The body remains, the slumbering soul

sneaks away,  the agitated wings of birds

shake the private world of the forest.

One becomes a zero while another a numeral.

What if the numeral is placed before the zero?

or the zero after the numeral?

Values are proportionate inversions.

A woodpecker somewhere pecks at a palm

tik, pek, tik,

making a cavity somewhere!

 

 

Last night while going to the soiree,

in those dark shadows at the turn of

the street, a street dog smelt the blotch

in him and began to bark.

clunk, broke the violin string!

Repentance is always

a broken piece of porcelain,  the pieces

can’t be glued together.

 

We need to melt all that

which can’t be attached.

Break.

Scattered pieces.

and bind.

Whole life is geared towards self-preservation

two hands guarding the wick, and in front

is placed an empty container.

Just waiting to be filled.

 

Red stains of spat-out-paan

on the soiled walls. Spittle-song

from the last night’s mushaira

was left oozing tears.

Even before the dawn, someone’s

found offering a jal-haarti, flame

on a brass plate.

 

The sky’s set ablaze.

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *