April 19, 2024

విశ్వపుత్రిక వీక్షణం – “విశ్వం పిలిచింది”

రచన: డా.విజయలక్ష్మీ పండిట్ చేతిమీద చల్లగ ఏదో స్పర్శ తగలడంతో కండ్లు తెరిచాడు అభిదీప్.ఆ స్పర్శలో ఎంతో స్వాంతన ..ఏదో మహత్తు వున్నట్టు తోచింది. లేచికూర్చుని ఎవరా అని చుట్టూ చూశాడు. తనపక్కన ఒక యువకుడు నిలుచుని వున్నాడు. అతనిలో ఏదో చెప్పవీలుకాని తేజస్సు .అతని ఒంటినుండి ఆహ్లాదంగా ప్రవహిస్తూ చల్లగా అభిదీప్ ను తాకుతూంది. “ఎవరు మీరు “ అంటూ ఆ అర్ధరాత్ర సమయంలో తన నిద్ర చెరిగిపోయినందుకు చీకాకుగా అడిగాడు చుట్టు చూస్తూ.., మిద్దెమీద […]

తరం – అనంతం

రచన : సోమ సుధేష్ణ హరిణి ఇంట్లోకి రాగానే సుజాత ఎదురుగా వెళ్లి మనవరాలిని గట్టిగా కౌగిలించుకుంది. హరిణి మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ఒక క్షణం చూసింది. మనవరాలి కళ్ళల్లోంచి కారుతున్న కన్నీటిని ప్రేమగా తుడుస్తూ భుజాలపై చేయివేసి లోపలికి తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి తాను పక్కనే కూర్చుంది. నిన్నంతా ఫోనులో జరిగిన తంతు గురించి చెప్పి గుండె లవిసి పోయేలా ఏడ్చే మనవరాలిని వెంటనే తన దగ్గరకు రమ్మని చెప్పింది. కారు డ్రైవ్ చేయడం మొదలు […]

కౌండిన్య కథలు – కిరణ్ కొట్టు

రచన: రమేశ్ కలవల “కిరణ్” అంటే మీరేనా? అని అడిగాడు నారాయణ. “కాదు” అంటూ ఆ షాపులో సర్దుతున్న వాడల్లా వెనక్కి తిరిగి “ఇక్కడ ఆ పేరుతో ఎవరూ లేరు” అన్నాడాయన. “మరీ ‘కిరణ్ కొట్టు’ అని రాసి ఉంది?” అని అడిగాడు సంశయిస్తూ. “ఇదిగో ఈ రాజు చేసిన పనే ఇది..” అంటూ ఆ షాపులో పనిచేసే కుర్రాడిలా ఉన్న వాడిని చూపిస్తూ. “చిదంబరం కిరాణా కొట్టు అని రాయడానికి పేయింటర్ పిలుచుకు రారా అంటే… […]

నేను సైతం

రచన: సుధ ఆత్రేయ జీవితమనేది గమ్యం కాదు గమనం మాత్రమే… నా పేరు అఖిల్ నేనో పెద్ద అంతర్జాతీయ ఫుడ్ బిజినెస్ కంపెనీకు ఒక డైరెక్టర్ను. సగటు భారతీయుడి కల అయిన అమెరికాలోని న్యూయార్క్ నగరంలో వాసము. పెద్ద హోదా మంచి జీతము. భార్య, ఇద్దరు పిల్లలు. నాకు కెరీర్ లో పై స్థాయికి చేరుకోవాలని చిన్నప్పటినుంచి కోరిక. అందుకు తగ్గట్టుగానే కష్టపడిచదివా. చదువంతా ఐఐటీ లోనే సాగింది. క్యాంపస్ లోనే జాబ్. కోరుకున్నట్టు గానే చాల […]

బ్రహ్మకమలాల పుట్టిల్లు వేలీ ఆఫ్ ఫ్లవర్స్ హేమకుంఢ్ సాహెబ్

రచన: కర్రా నాగలక్ష్మి ఉత్తరా ఖండ్ అంటేనే యెత్తైన కొండలు , గలగలలను ప్రవహించే సెలయేళ్లు , భగీరధిని చేరుకోవాలని పరుగులు పెడుతున్న అలకనంద అందాలు , తెల్లని మంచు కప్పబడ్డ పర్వతాలు గుర్తుకొస్తాయి . ఎత్తైన కొండల వెనుక యెన్నెన్నో అద్భుతాలు , యెన్ని సార్లు యీ కొండలలో తిరిగినా యింకా యెన్నో చూడవలసిన ప్రదేశాలు మిగిలే వుంటాయి . అలాంటిదే జోషిమఠ్ నుంచి బదరీనాధ్ వెళ్లే దారిలోవున్న ‘ వేలీ ఆఫ్ ఫ్లవర్స్ ‘ […]

తేనెలొలుకు తెలుగు – పద్యప్రేమ

రచన: తుమ్మూరి రామ్మోహనరావు     ఇటీవల కొన్ని ఫేస్బుక్ మరియు వాట్సప్ గ్రూపుల్లో పద్య ప్రక్రియ ప్రధానంగా చేసుకుని అనేకమంది పాల్గొనడం చూసిన తరువాత పద్యప్రక్రియపై కొన్ని భావాలు పంచుకోవాలనిపించింది. పద్యం తెలుగువారి ఒక ప్రత్యేక సాహిత్య సంప్రదాయం.పద్యవిద్య పట్ల మక్కువ గలిగిన వారు పద్య రచన చేయాలనుకునే ఔత్సాహికులైన వారి కోసం నాకు తెలిసిన కొన్ని విషయాలు  మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను ———- తెలుగు వారి సాహిత్య అస్తిత్వానికి మూలం పద్యమనేది నిర్వివాదాంశం. సంస్కృతం […]

తపస్సు – ఆఖరి మెట్టు పైనుండి..

రచన: రామా చంద్రమౌళి   ఇక్కడనుండి చూడు.. ఈ ఆఖరి మెట్టు పైనుండి ముషాయిరా.. రాత్రిని కాల్చేస్తూ కాల్చేస్తూ ఎలుగెత్తిన స్వరాలను మోసుకుంటూ గాలిలో .. ఒక దుఃఖజీర ప్రక్కనే నిరంతరమై ప్రవహిస్తూ.. నది.. నిశ్శబ్దంగా – ఔనూ.. శరీరంలోని ప్రాణం శబ్దిస్తుందా పాదాలు ఒక్కో మెట్టు ఎక్కుతున్నప్పుడు అందుకోవాలని అలలు పడే యాతన.. ఒక వియోగ జీవక్షోభ గజల్‌ గాయని  ఒక్కో వాక్యకణికను యజ్ఞంలోకి సమిధగా అర్పిస్తున్నపుడు అక్షరాలు.. అగ్నిబిందువులై తేలి వస్తూంటాయి గాలిలో సముద్ర […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 40

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య   శ్రీమహావిష్ణువు ఈ విశ్వానికంతటికీ ఆదిమూలం, భర్త, కర్త సర్వం తానే. ఆ విష్ణుమూర్తి రూపమైన శ్రీనివాసుని ఆర్తితో వేడుకుంటున్నాడు అన్నమయ్య. ఈ భవ బంధాలనుండి, ఈ లంపటాలనుండి నీ అభయ హస్తం చాచి మమ్ములను రక్షించు దేవా అని కీర్తిస్తున్నాడు అన్నమయ్య ఈ కీర్తనలో.   కీర్తన: పల్లవి: విభుడ వింతటికి వెరపుతో ననుగావు అభయహస్తముతోడి ఆదిమూలమా            || విభుడ ||   చ.1. పలులంపటాలచేత బాతువడి పాటువడి అలసితి గావవే […]

కర్ణాటక సంగీత విద్వాంసుడు జాన్ హిగ్గిన్స్ భాగవతార్ గారు

రచన:  శారదాప్రసాద్   జాన్.బి.హిగ్గిన్స్ ను భారతీయ సంగీత ప్రియులు జాన్ హిగ్గిన్స్ భాగవతార్ గా పిలుస్తుంటారు.అమెరికా దేశానికి చెందిన ఈ గాయకుడు అమెరికాలోని వెస్లే విశ్వవిద్యాలయంలో విద్యార్ధిగా మరియు వృత్తి నిపుణుడిగా పనిచేశారు.18-09 -1939 న అమెరికాలోని Andover లో పుట్టారు.ఫిలిప్స్ అకాడమీలో ప్రాధమిక విద్యను  అభ్యసించాడు.తండ్రి ఆంగ్లాన్ని బోధించాడు.తల్లి సంగీతాన్నిచాలా సంవత్సరాలు నేర్పింది.వెస్లే విశ్వవిద్యాలయం నుండి 1962 లోనే మూడు డిగ్రీలను తీసుకున్నారు. సంగీతంలో కూడా పట్టాను సంపాదించారు.వివిధ దేశాలకు చెందిన సంగీతాన్ని గురించి పరిశోధన […]