రచన: కన్నెగంటి అనసూయ అదసలే శీతాకాలం.. అప్పుడప్పుడే తెల్లార్తందేవో.. అంతా పొగమంచు నిండిపోయి బాగా దగ్గిరికంటా వత్తేగాని మడిసి మడిసికి ఆపడ్తాలేదు. అంతకు ముందే లేసి పొయ్యిలో బూడిది సేట్లోకెత్తి అవతల దొడ్లో కుండలో పోసొచ్చి రెండు మూడు పిడకల్ని పేర్సి, కాయితం ముక్క లోనకంటా కూరి అగ్గి పుల్ల గీసింది సరోజ్ని పిడకల్ని అంటిత్తాకి. కాయితాలక్కాయితాలయిపోతన్నాయ్ గానీ పిడక అంటుకుంటే ఒట్టు…. కూతురు కట్తం సూసి అక్కడే […]
Month: September 2019
జయ గణ నాయక
రచన: మాధురిదేవి సోమరాజు వందనమనరే గౌరీ పుత్రుడు గణనాథునికీ వదనమునుంచే జ్ఞానము పంచే మన ఘన నాథునికీ పర్వతరాజూ పౌత్రుండితడూ పశుపతి స్వామీ పుత్రుండితండూ పరాశక్తికీ తనయుడు ఇతడూ పళని వాసునీ సోదరుండూ గజవదనమ్ముతో గుణముల నేర్పెను శుక్లాంబరమ్ముతో శుభములనిచ్చును విఘ్ననాయకుడు విద్యను ఇచ్చువాడూ సిద్ధి బుద్ధులను సిరులను ఇచ్చువాడూ గరికను గూర్చి గమనికనిస్తే గమ్మత్తుగ నీ మన కోర్కెలు దీర్చూ ఉండ్రాళ్ళద్దీ మనం భక్తిని జూపితే ఉత్పాతములే తను తీసివేయునులే ద్విముఖుడమ్మా మన పార్వతి తనయా […]
వృక్షో రక్షతి రక్షితః
రచన: రాజశేఖర్ తటవర్తి.. కిరణ్ మేఘనాలది చూడ ముచ్చటైన జోడి. ఇద్దరికీ పుస్తకపఠనం అంటే మక్కువ. ఇక పాట హిందీ పాటలంటే చెవికోసుకుంటారు. మేఘనకి కిరణ్ గాత్రం అంటే బహుప్రీతి. అప్పుడప్పుడు సరదాగా సాయంత్రం బాల్కనీ లో కూర్చున్నపుడు “చౌదవి కా చాంద్ హో ” లేక “తేరే సూర్ ఆర్ మేరె గీత్” పాటపాడో ఆమెని మురిపించేవాడు. కిరణుకి సంగీతంలో లోతైన ప్రవేశంలేకపోయినా వివిధ రాగాలలో, నగరంలో జరిగే కచేరీలలో ఆసక్తి చూపించేవాడు. అది […]
మాలిక పత్రిక సెప్టెంబర్ 2019 సంచికకు స్వాగతం..
Jyothivalaboju Chief Editor and Content Head స్వాగతం.. సుస్వాగతం.. చిరుజల్లులు, జడివానలు కలిసి మనతో ఆటాడుకుంటున్నాయి కదా.. తప్పదు మరి. ఎండలెక్కువగా ఉంటే వానలు కావాలనుకుంటాం. వానలు కాస్త జోరు పెంచితే వామ్మో అంటాం. ప్రకృతితో అడ్జస్ట్ అవ్వక తప్పదు మరి. ఈ చిరుజల్లులతో జతగా సన్నజాజులు కూడా ఉంటే ఎంత బావుంటుంది కదా.. ఎండాకాలంకంటే మనోహరమైన ఈ కాలంలో సన్నజాజుల పరిమళాలు అద్భుతం.. మహాద్భుతం.. మాలిక పత్రిక రచయితలకు, మిత్రులకు, పాఠకులకు […]
దేవుళ్ళకూ తప్పలేదు!
రచన: పెయ్యేటి రంగారావు దేవుళ్ళయినా పరిస్థితులకి తలలు ఒగ్గవలసిందే! ఒక్కొక్కసారి అటక ఎక్కుతారు, ఒక్కొక్కసారి అల్మారాల్లో దాక్కుంటారు. ఒక్కొక్కసారి గట్టెక్కుతారు!! సీతమ్మగారి మనవడు గురుదత్త మహా గడుగ్గాయి. కొద్దిగా ఈ మధ్యనే నడక వచ్చింది. దాంతో ఇల్లు పీకి పందిరేస్తున్నాడు. పొద్దున్న లేవగానే సీతమ్మగారి కోడలు సీతాలక్ష్మి పొందికగా మంచం మీద దుప్పటి చక్కగా సరిచేస్తుంది. ఆవిడ స్నానం చేసి బొట్టు పెట్టుకోవడానికి పడకగదిలోకి వచ్చేసరికి మంచం మీద దుప్పటి నేల మీద పారాడుతూ వుంటుంది. తల […]
గోడమీద బొమ్మ
రచన: చెంగల్వల కామేశ్వరి సాయంత్రపు సముద్రం అలలు ఎగసిపడుతున్నాయి ఆకాశపు నీలాన్ని కాజేసినట్లుగా, నీలపురాశిలా మెరిపోతోంది. వేగంగా తెల్లని నురుగులుతో ఒడ్డుకి కెరటాలని తోస్తోంది. అంతే నెమ్మదిగా వెన్నక్కి వెళ్లిపోతోంది. ఇసకలో కాళ్లు కూరుకుపోతుంటే చేతుల్లో బరువయిన సంచీ అతికష్టం మీద మోసుకు వస్తూన్న పరమేశానికి ఆయాసం ఎగతన్నుతోంది. నడవలేక నడవలేక నడుస్తున్న పరమేశాన్ని చూసి పరుగులు తీస్తూ సముద్రం వైపు వెడుతున్న ఒక అబ్బాయి. “తాతా బ్యాగ్ బరువుగా ఉందా ఇలా ఇవ్వు నేను తెస్తా!” […]
కార్టూన్స్ – జెఎన్నెమ్
కార్టూనిస్ట్: జె.నరసింహమూర్తి
పాలమనసులు
రచన: కొత్తపల్లి ఉదయబాబు అది నగరంలోని ప్రసిద్ధమైన కార్పొరేట్ పాఠశాల మెయిన్ బ్రాంచ్. ఎలిమెంటరీ సెక్షన్స్ వన్ టు ఫైవ్ క్లాసెస్ ఉన్న బ్లాక్ లోని పేరెంట్ విజిటర్స్ రూంలో ప్రిన్సిపాల్ గారి కోసం నిరీక్షిస్తున్నాయి రెండు జంటలు తమ పిల్లలతో. ఒక పక్క ఆఫీసుకు టైం అవుతోంది. రఘువరన్ అసహనంగా భార్యకేసి చూసాడు. యూనిఫామ్ లో ఉన్న ఐశ్వర్య తల్లి చెయ్యి పట్టుకుని ధీమాగా కూర్చుంది. చరణ్ కూడా తనభార్య ప్రశాంతి తో అక్కడే కూర్చున్నాడు. […]
అమ్మమ్మ – 6
రచన: గిరిజ పీసపాటి నాగకి జ్వరం ఎక్కువగా ఉండడంతో తమ ఇంటిలోకి తీసుకుని వచ్చి పడుకోబెట్టాక తెల్లవార్లూ నాగను కనిపెట్టుకుని కూర్చున్నారు తాతయ్య, అమ్మమ్మ, పెద్దన్నయ్య, వాళ్ళ అమ్మగారు. గంట గంటకూ నాగకి జ్వరం పెరగసాగింది. తెల్లవారేసరికి నాగకి ఒళ్ళంతా కుంకుడు గింజల పరిమాణంలో కండలు పోసేసి పెద్దమ్మవారు పోసింది. నాలుక మీద, నాలుక కింద, ఆఖరికి కంట్లో కూడా కుండలు పోసాయి. వాటివల్ల విపరీతమైన దురదలు, మంట, జ్వరంతో నాలుగు సంవత్సరాల వయసు గల నాగ […]
ఎగురనీయండి. ఎదగనీయండి
రచన: మీరా సుబ్రహ్మణ్యం సరోజ నేను కలిసి చదువుకున్నాము. ఓకే వూళ్ళో వేరే సంస్థలలో ఉద్యోగం చేస్తున్నాము. నాకు తోబుట్టువులు లేని లోటు తీర్చింది సరొజ. ఈ పాతికేళ్ళ స్నేహంలో తన కుటుంబ సభ్యులూ నాకు ఆత్మీయులయ్యారు. గత పదిహేను సంవత్సరాలుగా జీవితంతో వొంటరి పోరాటం చేస్తొంది సరోజ. పెళ్ళైన నాలుగేళ్ళకే సరోజ భర్త రవి స్కూటర్ యాక్సిడెంట్ లో చనిపొయాడు. అప్పటికి మూడేళ్ళ పసివాడు సాయి. సాయి కోసమే తన బ్రతుకు అన్నట్టు తల్లి తండ్రి […]
ఇటీవలి వ్యాఖ్యలు