అతన్ని చూశాకే…

రచన: పారనంది శాంతకుమారి.

కబుర్లు చెప్పి కార్యాలను ఎలాసాధించుకోవచ్చో,
బులిపించి బుట్టలో ఎలా వేసుకోవచ్చో,
క్రిగంటి చూపుతోకవ్వించిఎలాకరిగించవచ్చో,
మమతలమైకంలో ముంచివేసి ఎలామరిగించవచ్చో,
దీనత్వంలోకి దించివేసి ఎలా దగాచేయవచ్చో,
కవ్వించి ఎలా కోటలోపాగా వేయవచ్చో,
సణుగుడుతో సాధించి ఎలా సాధించవచ్చో,
విపరీతమైనవెర్రితోఅర్ధరహితంగా ఎలావాదించవచ్చో,
మోమాటపడుతూనే ముగ్గులోకి ఎలా దించవచ్చో,
మౌనంతోనేమురిపిస్తూఎలా ముంచవచ్చో,
మాయచేసి ఎలా లోయలోకి త్రోయవచ్చో,
మనసు విరిచి ఎలా ఆశలను అంతం చేయవచ్చో,
జీవితమంటే ఉన్న ఆసక్తిని ఎలా నశింపచేయవచ్చో,
నిర్దయతో ఎలా విలయం సృష్టించవచ్చో,
ప్రకోపంతో ఎలా ప్రళయాన్నిప్రేరేపించవచ్చో,
అంతులేని విరక్తిని ఎలా స్పృశింపచేయవచ్చో,
అతన్ని చూశాకేఅర్ధమయ్యింది.

Leave a Comment