June 24, 2024

తపస్సు – రహస్య స్థావరాలు.. వ్యూహ గృహాలు

రచన: రామా చంద్రమౌళి

హరప్పా, మొహంజోదారో, నైలు.. నదుల తీరాలపై
తరతరాల మనుషుల చరణముద్రలు.. శతాబ్దాలుగా
మనిషి సమూహమౌతూ.. రాజ్యమౌతూ.. అధికారమౌతూ
ప్రతి నాగరికతలోనూ జైలుగోడలు.. ఉరికొయ్యలే
తనను తాను రక్తాక్షరాలతో లిఖించుకుంటూ
యుగయుగాలుగా నిర్మాణమౌతున్న మానవ చరిత్ర
పుటనిండా.. నేలమాళిగ, రహస్య స్థావరాల, వ్యూహ గృహాల
గబ్బిలాల వాసనే
గుర్రపు డెక్కల చప్పుళ్ళూ, రథ చక్రాల కర్కశ ధ్వనులూ
ఖడ్గ ప్రహారాల లోహశబ్దాలూ తప్ప
గగన తలంపై పావురాల రెక్కల చప్పుడే వినబడదు
యుద్ధాలతో, కుతంత్రాలతో, రక్త తర్పణాలతో
అంతా హింస.. వెచ్చగా ప్రవహించే నెత్తుటి మరకలు
ఎండిన జేవురు రంగు సాక్ష్యాలు
బాణాలు, ఫిరంగులూ, తుపాకీ గుండ్లూ.. ఏవైతేనేమి
ఎదుటి మనిషి గుండెను చీల్చేందుకే గదా –
తనలోకి ప్రవాహమై చేరే యుద్ధరక్తాన్ని చూచి దుఃఖించే
నదులు సింధో, గంగో, సట్లెజో
జలాయుధంతో నగరాలకు నగరాలను కబళించి
మహోగ్రతతో ‘ పాఠాన్ని ’ చెబుతూనే ఉన్నాయి అనాదిగా
ఐతే మనిషి ప్రధానంగా ఒక పశువుకదా
కళ్ళు మూసుకుని.. ఎప్పుడూ దండయాత్రనే స్వప్నిస్తాడు
స్త్రీనో, రాజ్యాన్నో, సంపదనో.. ఆక్రమించే వ్యూహంలోనే
జ్వాలలోకి దుమికే పురుగై
ఆత్మ హననమే దేశ చరిత్రలనిండా
మొండి గోడలలో.. రాతి శిథి దుర్గాలలో.. ఫిరంగు అవశేషాలలో
ఏవైనా.. గాలితో సంభాషిస్తూ
చరిత్రను నెమరేసుకుంటూ దుఃఖిస్తూనే ఉన్నాయి –
కాలాన్ని సాక్షిగా నిలబెట్టి సూర్యుడూ
జైలు ఊచల వెనుక గడ్డకట్టి నిలబడి చంద్రుడూ
అన్నీ గమనిస్తూ.. మూగ పరిశీలకులుగా .. దారానికి వ్రేలాడే కాగితపు జీవితాలై
చినుకు చినుకుగా
వసంత మేఘాల కళ్ళు మూసుకున్న ముఖంపై వర్షిస్తున్నప్పుడు
ఒక నాగరికతై, ఒక చరిత్రై, ఒక సందిగ్ధ సమయమై
వర్థిల్లుతూ వస్తున్న మనిషి
ద్రవిస్తూ.. ఘనీభవిస్తూ.. మళ్ళీ ద్రవిస్తూ.. మళ్ళీ మళ్ళీ ఘనీభవిస్తూ
వాకిట్లో గుంజకు తలుగుతో కట్టేయబడ్డ ఆవును చూస్తూ
తనను తాను ఒక ‘ బందీ ’ నని తెలుసుకుంటాడు.. జ్ఞానంతో
చక్రం తిరుగుతూనే ఉంటుంది ఎవరికోసమూ ఆగకుండా
పదే పదే.. మళ్ళీ మళ్ళీ
ఇంతకూ యుగయుగాల పర్యంత ఈ ‘ పురా మానవుడు ’ ఎవరు .?

Clandestine Terrains,
Strategic Homes

Translated by Indira Babbellapati

Harappa, Mohanjodaro, the Nile
Generations of human foot-prints on
the river banks for centuries, man,
a community, a kingdom and an authority.
‘Jail-walls,’ and ‘hanging-poles,’ are the hallmarks of
every civilization authoring history
of human race, documenting in red letters
from time to time to mention only the wealth destroyed by fire.
Underground-houses , hidden-caverns
in the pages of history stink of bats.

What else, history is but a trace
of violence, of the echo of horse-shoes,
the jarring clamour of chariot-wheels,
and the echo of metallic swords.
Why is it that the sound of softly
flapping pigeon wings is never heard?
History, an account of violence, of wars,
conspiracies, offerings of blood,
warm, dry blood stains on green leaves
stand as witness. Arrows, missiles, bullets,

whatever, meant only to gash man’s heart.
Blood flows in the rivers
Sindh, Ganga or Sutlej
or the Nile in lamentation. The ‘water-weapons’
have been flooding cities one after the other
since the earth’s origins in an attempt to impart
ruthless lessons to man.
But isn’t man primarily an animal?
He closes his eyes and dreams of nothing but invasions.
He forever locks himself in scheming strategies of
conquering either women or kingdoms
or at least seize wealth.
Like an insect that jumps into fire in fatal attraction,
the entire human race shares a common history
of self-immolation. Bare walls, ruins of impenetrable
forts and the remnants of weapons, all converse
with the air sorrowfully masticating human history.

Making Time as witness stands the Sun, behind the jail-bars
lies the solidified Moon absorbing all,
mute onlookers of lives hanging on to a thread.
When the Spring showers spray on the face with eyes closed,
man prospers as a civilization, a history, a Time of doubt to
liquefy and solidify, again liquefy and solidify, again and again.
Looking at the cow tied in the courtyard, man realizes that
he himself is a captive, the ‘wise-wheel’ keeps rotating
ceaselessly over and over again stopping for none.

By the way, who’s this ‘primitive man,’
sprawling on the earth through the eons?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *