ముత్యాల సరాలు

రచన: ఎమ్.ఎస్.వి గంగరాజు

ఆకాశపు టంచులు చూద్దాం
సముద్రాల లోతులు చూద్దాం
చుక్కలెన్నొ లెక్కలు వేద్దాం
గ్రహములపై శోధన చేద్దాం!

యాంత్రికమౌ బాటను విడిచీ
విజ్ఞానపు వెలుగులు పరచీ
విశ్వశాంతి భువిపై పంచే
వేడుకకై తపనలు పడదాం!

వేల కోట్ల పైకం ఉన్నా
ఇంకా మరి కావాలంటూ
గోల చేసి దోచుకు పోయే
దగాకోర్ల భరతం పడదాం!

సమతుల్యపు సద్భావనముల్
సమయోచిత సహకారములన్
జనములలో పెంపొందించే
సద్భావన సాధ్యం చేద్దాం!

సంకుచితమౌ స్వార్ధం విడిచీ
సర్వ జనుల సౌఖ్యం తలచీ
ఘనతరమౌ యోచన కిపుడే
సుస్వాగత నినాద మిద్దాం!

Leave a Comment