December 1, 2022

జయ గణ నాయక

రచన: మాధురిదేవి సోమరాజు వందనమనరే గౌరీ పుత్రుడు గణనాథునికీ వదనమునుంచే జ్ఞానము పంచే మన ఘన నాథునికీ పర్వతరాజూ పౌత్రుండితడూ పశుపతి స్వామీ పుత్రుండితండూ పరాశక్తికీ తనయుడు ఇతడూ పళని వాసునీ సోదరుండూ గజవదనమ్ముతో గుణముల నేర్పెను శుక్లాంబరమ్ముతో శుభములనిచ్చును విఘ్ననాయకుడు విద్యను ఇచ్చువాడూ సిద్ధి బుద్ధులను సిరులను ఇచ్చువాడూ గరికను గూర్చి గమనికనిస్తే గమ్మత్తుగ నీ మన కోర్కెలు దీర్చూ ఉండ్రాళ్ళద్దీ మనం భక్తిని జూపితే ఉత్పాతములే తను తీసివేయునులే ద్విముఖుడమ్మా మన పార్వతి తనయా […]