April 17, 2024

గిలకమ్మ కతలు – బక్కసిక్కిన రేగొడేలు

  రచన: కన్నెగంటి అనసూయ           అదసలే  శీతాకాలం.. అప్పుడప్పుడే తెల్లార్తందేవో..  అంతా పొగమంచు నిండిపోయి బాగా దగ్గిరికంటా వత్తేగాని మడిసి మడిసికి ఆపడ్తాలేదు.         అంతకు ముందే లేసి పొయ్యిలో బూడిది సేట్లోకెత్తి అవతల దొడ్లో కుండలో పోసొచ్చి రెండు మూడు పిడకల్ని పేర్సి, కాయితం ముక్క లోనకంటా  కూరి  అగ్గి పుల్ల గీసింది సరోజ్ని పిడకల్ని అంటిత్తాకి.     కాయితాలక్కాయితాలయిపోతన్నాయ్ గానీ పిడక అంటుకుంటే ఒట్టు….    కూతురు కట్తం సూసి అక్కడే […]