April 25, 2024

కంభంపాటి కథలు – ఇన్ డిపెండెంట్

రచన: కంభంపాటి రవీంద్ర క్యాంటీన్ లో లంచ్ తింటూంటే, ‘హలో ‘ అనే ఎవరో గట్టిగా అనేసరికి అదిరిపడి, పక్కకి చూసేసరికి నవ్వుతూ హైందవి కనిపించింది. ‘ఏమే.. ఎప్పట్లాగే వాళ్లనే చూస్తూ అలా అలా డ్రీమ్స్ లోకెళ్ళిపోయేవా ?’ అంటూంటే ‘నీ మొహం.. అయినా నాకేమైనా వినపడదా ? అంత గట్టిగా హలో అని అరిచేవు ‘ అన్నాను కోపంగా. ‘వీళ్ళిద్దర్నీ చూస్తూంటే ‘కలిసి ఉంటే కలదు సుఖమూ ‘ అనేది మార్చేసి ‘కలిసి భోంచేస్తే కలదు […]

చీకటి మూసిన ఏకాంతం – 5

రచన: మన్నెం శారద   “కృష్ణారావుగారబ్బాయి ఎం.డి. చేసి ఫారిన్ వెళ్తున్నాడట!” “మంచిది. వెళ్ళిరమ్మను” అన్నాడు నవనీతరావు పేపర్లోంచి దృష్టి తిప్పకుండానే. వసుంధర అతని వైపు కోపంగా చూసి “మీరు చెప్పలేదనే వెళ్ళడం లేదు.” అంది విసురుగా. నవనీతరావు తలెత్తి “నీకేదో కోపం వచ్చినట్లుంది. అసలేం చెప్పేవు నువ్వు!” అనడిగేడు అమాయకంగా. “నా ఖర్మ కాలిందని చెప్పేను.” “తప్పు. నేను బాగానే వున్నానుగా!” “బాగానే ఉన్నారు బండరాయిలా. ఎదిగిన కూతురు కళ్ళెమొదిలేసిన గుర్రంలా తిరుగుతోంది. దానికి పెళ్ళి […]

కౌండిన్య కథలు .. సిద్దయ్య మనసు

రచన:  రమేష్ కలవల   ఆకు పచ్చని లుంగీ మీద మల్లెపువ్వు లాంటి తెల్లటి లాల్చీ లోంచి బనియను కనపడుతోంది. మెడలో నల్లటి తాయత్తు, కళ్ళకు సుర్మా, ఎర్రగా పండిన నోరు, భుజం మీద వేసుకున్న సంచిలో నెమలి ఈకలతో పాటు సాంబ్రాణికి కావలసిన సామగ్రితో ప్రతిరోజూ ఆ వీధి లో దట్టమైన పొగలలో కనిపించే మస్తాన్ వలి అంటే అందరికీ పరిచయమే. మస్తాన్ వలి కంటే కూడా సాంబ్రాణి వలి గానే అతను అందరికీ తెలుసు. […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 41

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య   అన్నమయ్య శ్రీనివాసుని ఘనతను గురించి మనకు వివరిస్తున్నాడు. శ్రీమహావిష్ణువే అన్నిటికీ మూలము అని ఎలుగెత్తి చాటుతున్నాడు భక్త హృదయాలకు. ఆ వివరాలను ఈ కీర్తనలో చూద్దాం.   కీర్తన: పల్లవి: అన్నిటి మూలం బతఁడు వెన్నుని కంటెను వేల్పులు లేరు                         || అన్నిటి || చ.1. పంచభూతముల ప్రపంచ మూలము ముంచిన బ్రహ్మము మూలము పొంచిన జీవుల పుట్టుగు మూలము యెంచఁగ దైవము యితఁడే కాఁడా                           || […]

లేచింది మహిళ

రచన : సోమ సుధేష్ణ   భారతికి నిద్ర రావడం లేదు. మూగబోయిన మనసుకు ఊపిరి ఆడటం లేదు. మనసేనాడో  మొద్దు బారిపోయింది. శరీరం చలించడం మానేసి చాన్నాళ్ళయింది. భర్త చనిపోయాడని బాధా లేదు, సంతోషమూ లేదు. దట్టమైన అడవిలో నడుస్తూ బయట ప్రపంచాన్ని చూస్తానా ! చూడనా! అనుకుంటూ జీవితమంతా నడిచి, అలసి పోయి ఆశ వదులు కున్నప్పుడు వెలుతురు కనిపిస్తుంది. అలవాటులేని వెలుతురు- అలవాటైన చీకటి- దేవుణ్ణి తలుచుకోవడం కూడా మరిచి పోయింది. యాంత్రికంగా […]

క్షమయా ధరిత్రే కాని……

రచన:  మణి గోవిందరాజుల   విలేఖరుల చేతుల్లోని ఫ్లాష్ లైట్లు చక చకా వెలిగిపోతున్నాయి. అక్కడ అంతా హడావుడిగా వుంది. పోలీసులు జనాన్ని అదుపు చేయలేకపోతున్నారు. హంతకురాలిని చూడడానికి జనం విరగబడి పోతున్నారు. “చీ!చి!  . . అమ్మ అన్నపదానికే అవమానం తెచ్చింది” యెవరో చీదరించుకుంటున్నారు. “ అసలు కన్నకొడుకు కాదేమో. . అందుకే అలా చేయగలిగింది. ” “మన దేశం పరువు తీసింది కదా?ఇలాంటి వాళ్ళను వురి తీయాలి ఆలో చించకుండా” “ప్రపంచ దేశాల్లో మనం […]

‘ఉషోదయం’

రచన: నండూరి సుందరీ నాగమణి   “స్వాతంత్ర్యమె మా జన్మహక్కనీ చాటండీ!”రేడియో లో వినిపిస్తున్న ఘంటసాల వారి దేశభక్తి గేయాన్ని వింటూ మేను పులకించిపోతుండగా రెండు చేతులూ జోడించి కళ్ళుమూసుకుని ఒక ధ్యానంలో ఉండిపోయాడు గిరిధారి. “అంకుల్, అంకుల్!”తలుపు కొట్టటంతో ధ్యాన భంగమై లేచి తలుపు తీసాడు. ఎదురుగా ఎదురింటి వారి మనవరాలు కుముద.ఆ పిల్ల వెనకాలే మరో పిల్లవాడు… “మేమంతా ఆడుకుంటూ ఉంటే బంతి కిటికీలోంచిమీ ఇంట్లో పడింది…” అంది సోఫా క్రింద చూపిస్తూ. తీసుకోమన్నట్టు […]

గడిలోదాగిన వైజ్ఞానిక నుడి -1

కూర్పు: డా.(శ్రీమతి)చాగంటి కృష్ణకుమారి   ఆధారాలు: అడ్దం: 1.క్షారలోహాల ( alkali metals) కుటుంబానికి చెందిన దీనిని ఫొటొ సెల్ ల తయారీలోను , ( component of photocells) వాక్యూమ్ పంపులలో ఆక్సిజన్ ని తొలగించడానికి, ప్రత్యేక మైన రకానికి చెందిన గాజు తయారీలో ఉపయోగపడుతొంది. దీని పేరును గఢమైన ఎరుపు అనే అర్ధమున్నలాటిన్ పదంనుండి గ్రహించారు . ( 5) 4.గడ్డి జాతికి చెందిన దీని శాస్త్రీయనామం Bambusoideae( వెనకనుండిముందుకి (3) 6.చేపలు పట్టడానికి […]

జాగేశ్వర మహదేవ్ మందిరం

రచన: నాగలక్ష్మి కర్రా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగేశం గురించి వెతికితే మూడు రాష్ట్రాలలో అదే పేరుతో వున్నట్లు తెలిసింది. మొదటది మహారాష్ట్రలో వున్న ఔండ నాగనాధ్, ద్వారక దగ్గర వున్న నాగనాధ్ ఉత్తరాఖంఢ్ లో వున్న జాగేశ్వర్ లో వున్న నాగనాధ్. ఆయా రాష్ట్రాలవారు మాదే ఒరిజనల్ నాగనాధ్ అని అంటున్నారు, సరే మూడింటినీ చూసేస్తే పోలా అని జాగేశ్వర్ బయలుదేరేం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పర్వత ప్రాంతాన్ని ఘరేవాల్, కుమావు ప్రాంతాలుగా విభజించేరు. బదరినాధ్, కేదార్ […]

మనసు పలికిన ఆత్మీయతా తరంగం

సమీక్ష: సి.ఉమాదేవి     రచయిత్రి రజనీ సుబ్రహ్మణ్యం రచించిన అసమర్థురాలి అంతరంగం కథలు,  అనువాదాలు,  వ్యాసముల సమాహారం.  భిన్నత్వంలో ఏకత్వంవలె ప్రతి రచనలోను ప్రతిఫలించే అక్షరసుగంధం మనసంతా పరిమళభరితం కావిస్తుంది.  తాతగారు త్రిపురనేని రామస్వామిగారు, తండ్రిగారు గోపిచంద్ గారు పరచిన సాహితీబాటలో తనదైన శైలిలో రచనలు గావించినా,  వారి పెద్దలు పలికిన మాటలు అంతర్లీనంగా మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. ఓటమి కథ సాధారణంగా ఎన్నో కుటుంబాలలోని భార్యాభర్తల జీవనసరళిని పారదర్శకం చేస్తుంది.  తాను చెప్పిందే చేయాలని […]