March 28, 2023

ముత్యాల సరాలు

రచన: ఎమ్.ఎస్.వి గంగరాజు ఆకాశపు టంచులు చూద్దాం సముద్రాల లోతులు చూద్దాం చుక్కలెన్నొ లెక్కలు వేద్దాం గ్రహములపై శోధన చేద్దాం! యాంత్రికమౌ బాటను విడిచీ విజ్ఞానపు వెలుగులు పరచీ విశ్వశాంతి భువిపై పంచే వేడుకకై తపనలు పడదాం! వేల కోట్ల పైకం ఉన్నా ఇంకా మరి కావాలంటూ గోల చేసి దోచుకు పోయే దగాకోర్ల భరతం పడదాం! సమతుల్యపు సద్భావనముల్ సమయోచిత సహకారములన్ జనములలో పెంపొందించే సద్భావన సాధ్యం చేద్దాం! సంకుచితమౌ స్వార్ధం విడిచీ సర్వ జనుల […]

అతన్ని చూశాకే…

రచన: పారనంది శాంతకుమారి. కబుర్లు చెప్పి కార్యాలను ఎలాసాధించుకోవచ్చో, బులిపించి బుట్టలో ఎలా వేసుకోవచ్చో, క్రిగంటి చూపుతోకవ్వించిఎలాకరిగించవచ్చో, మమతలమైకంలో ముంచివేసి ఎలామరిగించవచ్చో, దీనత్వంలోకి దించివేసి ఎలా దగాచేయవచ్చో, కవ్వించి ఎలా కోటలోపాగా వేయవచ్చో, సణుగుడుతో సాధించి ఎలా సాధించవచ్చో, విపరీతమైనవెర్రితోఅర్ధరహితంగా ఎలావాదించవచ్చో, మోమాటపడుతూనే ముగ్గులోకి ఎలా దించవచ్చో, మౌనంతోనేమురిపిస్తూఎలా ముంచవచ్చో, మాయచేసి ఎలా లోయలోకి త్రోయవచ్చో, మనసు విరిచి ఎలా ఆశలను అంతం చేయవచ్చో, జీవితమంటే ఉన్న ఆసక్తిని ఎలా నశింపచేయవచ్చో, నిర్దయతో ఎలా విలయం సృష్టించవచ్చో, […]

సంజయుడు

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు రాజ్యానికి రాజు ఎంత ముఖ్యమో ఆ రాజును నడిపించే మంత్రి అంత ముఖ్యము చాలా మంది రాజులు పేరు ప్రఖ్యాతులు వాళ్ళ మంత్రుల వల్లే వచ్చినాయి ఉదాహరణకు శ్రీ కృష్ణ దేవ రాయలు మంత్రి తిమ్మరుసు ప్రతాపరుద్రుడి మంత్రి యుగంధరుడు వంటి వారు. రాజులు యుద్దాలు చేసి రాజ్య విస్తరణలో ఉంటె మంత్రులు రాజులకు మంచి సలహాలు ఇస్తూ రాజ్యాన్ని సుభిక్షంగా రాజు పాలించటానికి సహకరించేవారు పాలనలో మంత్రి పాత్ర చాలా […]

కమనీయ నాట్యకళామూర్తి పసుమర్తి కృష్ణమూర్తి గారు

రచన: శారదాప్రసాద్ పసుమర్తి కృష్ణమూర్తి ప్రముఖ తెలుగు సినిమా నృత్య దర్శకులు. మానసోల్లాసం, ఆహ్లాదం, ఆనందం, హాయీ కలిగిస్తూ కనులపండువ కనిపించే కొన్ని నాట్యాలు తెర మీద చూస్తూవుంటే పసుమర్తి కృష్ణమూర్తి గారు గుర్తుకొస్తారు. ఆయన చిత్ర నృత్యాలలో అభినయం, ఆంగికం, ముఖభావాలూ అన్నీ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మల్లీశ్వరి (1951), పాతాళ భైరవి (1951) మిస్సమ్మ (1955), మాయాబజార్ (1957), శ్రీకృష్ణార్జున యుద్ధము (1963) వంటి సుప్రసిధ్ధ చిత్రాలలో మనం చూస్తున్న నృత్యాలకు రూపశిల్పి కృష్ణమూర్తి […]

తపస్సు – రహస్య స్థావరాలు.. వ్యూహ గృహాలు

రచన: రామా చంద్రమౌళి హరప్పా, మొహంజోదారో, నైలు.. నదుల తీరాలపై తరతరాల మనుషుల చరణముద్రలు.. శతాబ్దాలుగా మనిషి సమూహమౌతూ.. రాజ్యమౌతూ.. అధికారమౌతూ ప్రతి నాగరికతలోనూ జైలుగోడలు.. ఉరికొయ్యలే తనను తాను రక్తాక్షరాలతో లిఖించుకుంటూ యుగయుగాలుగా నిర్మాణమౌతున్న మానవ చరిత్ర పుటనిండా.. నేలమాళిగ, రహస్య స్థావరాల, వ్యూహ గృహాల గబ్బిలాల వాసనే గుర్రపు డెక్కల చప్పుళ్ళూ, రథ చక్రాల కర్కశ ధ్వనులూ ఖడ్గ ప్రహారాల లోహశబ్దాలూ తప్ప గగన తలంపై పావురాల రెక్కల చప్పుడే వినబడదు యుద్ధాలతో, కుతంత్రాలతో, […]

విశ్వపుత్రిక వీక్షణం – “వెన్నెలను తాగిన పిల్లనగ్రోవి”

రచన: విజయలక్ష్మి పండిట్ పచ్చని చెట్లను కౌగిలించుకుని పరవశంతో గలగల నవ్వుతూంది గాలి ఆ పచ్చని చిక్కని గాలి నవ్వులు అడవి గుండెలో ప్రతిధ్వనిస్తున్నాయి, నదిలో నీరు ఏరై పారుతూ పలవరించి పరితపిస్తూంది.., నలుగురి దాహం తీర్చకనే సముద్రుని పాలవుతున్నాని, ఆకాశంలో ఆ పక్షులు మాట్లాడుకుంటున్నాయి., మనిషి భాషకున్నట్టు మాటలకు చందస్సు వ్యాకరణము లేవు, మనసును తాకే శక్తియుక్తి వాటి సొంతం, ఆ సెలఏటి చల్లని తటంపై పిల్లనగ్రోవిని ఊదుతున్నాడెవడో.., వెన్నెలను తాగితాగి పిల్లనగ్రోవి మత్తుగా రాగాలు […]

స్వచ్ఛ భారతము

రచన: చల్లా పార్వతి స్వచ్ఛ భారతమును సాధించుదామని బాహ్య భారతమును శుద్ధి చేసినా మనుజుల లోపల పట్టిన మకిలిని శుభ్రపరచుట మన తరమగునా పంచభూతాలనుపయోగించి బాహ్య సమాజమును శుద్ధి చేయవచ్చు మన చేతలతో పంచభూతాలను కలుషితం చేస్తూ భావితరాల జీవనయానం కష్టతరం చేసే మనమే కామా భవిత పాటి శత్రువులం మన అంతః శుద్ధి చేయుట ఎవరి తరం ప్రకృతి విరుద్ధ ప్రయోగాలతో వనరులన్నీ నాశనం చేస్తుంటే ఎదుర్కొనక తప్పదు మానవాళికి వాటి పరిణామాలు ప్రకృతి ప్రకోపిస్తే […]

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

September 2019
M T W T F S S
« Aug   Oct »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30