April 19, 2024

అమ్మమ్మ – 7

రచన: గిరిజ పీసపాటి అన్నపూర్ణ శాస్త్రుల గారిని ఆశ్రయించిన అమ్మమ్మని వారు మెత్తగా చీవాట్లు పెట్టి ఒక మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్రాన్ని అక్షర లక్షలు జపించమనీ, ఎంత త్వరగా జపిస్తే అంత త్వరగా ఫలితం లభిస్తుందనీ, అలా జపించినట్లైతే సుబ్రహ్మణ్య స్వామి కంఠానికి కాటు ఇచ్చిన దానికి సమానమనీ చెప్పి పంపించారు. ఆ మంత్ర జపం త్వరగా పూర్తి చేయాలని, అహోరాత్రులు జపిస్తే కాని త్వరగా పూర్తవదని గ్రహించిన అమ్మమ్మ ఇంటికి రాగానే తాతయ్యకు, పెద్దన్నయ్యకి, […]

మాలిక పత్రిక అక్టోబర్ 2019 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head మిత్రులకు, రచయితలకు, పాఠకులకు, శ్రేయోభిలాషులందరికీ పూలపండగ, పటాకుల పండగ శుభాకాంక్షలు. ముందు రంగు రంగుల పూలతో సరాగాల పండగ , నవరాత్రులు రావణదహనంతో దసరా సంబరాలు, దీపాల వెలుగులు, హోరెత్తించే మతాబుల జోరులో దీపావళి పండగలు రాబోతున్నాయి. మీకందరికీ సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నాము.. ఇక ఈ నెల మాలిక పత్రికలో మీరు మెచ్చే ఎన్నో కథలు, కవితలు, సీరియళ్లు, ఆధ్యాత్మిక, ఉపయోగభరిత వ్యాసాలు, యాత్రా విశేషాలు, విజ్ఞానాత్మకమైన […]

ఖాజాబీబి

రచన: డా.కె . మీరాబాయి (. తంగిరాల. మీరాసుబ్రహ్మణ్యం ) చింత చిగురు అమ్మే ఖాజాబీబి చాన్నాళ్ళుగా కనబడడం లేదు. ” చిగురమ్మోయ్ ” అంటూ వణికే గొంతుతో ఖాజాబీబి కేక వినబడగానే కాలనీ లోని ఇల్లాళ్ళు హడావిడిగా నిద్ర లేచి గుమ్మం లోకి వస్తారు. పేరుకు చింతచిగురు ఖాజాబీబి అని అంటాముగానీ , ఆకు కూరలు, రేగి పళ్ళు, సీతా ఫలాలు, జామ పళ్ళు, ఏ కాలంలో దొరికేవి ఆ కాలంలో ఇంటి ముందుకు తీసుకు […]

విశ్వపుత్రిక వీక్షణం – అమ్మ. . విశాలాక్షి

రచన: డా.విజయలక్ష్మీ పండిట్. దివ్య తన రెండునెలల కూతురు విశాలాక్షికి పాలిస్తూ పాప చిరుపెదవులతో తనపాలు కుడుస్తున్నప్పటి ఆ మాతృత్వపు మాధుర్యాన్ని కళ్ళుమూసుకుని అనుభవిస్తూ ఆస్వాదిస్తూంది. ఆ మాతృత్వపు అనుభూతి దివ్యలో అలజడిని రేపుతూంది. తన మనోసంద్రంలో తాను తప్పుచేశానన్న పచ్ఛాతాప కెరటాలు లేచిపడుతున్నాయి. వాళ్ళ అమ్మ విశాలాక్షి జ్ఞాపకాలు చుట్టుముట్టాయి దివ్యను. “ఎంత నిర్లక్ష్యం చేసి ఎంత చులకనగా చూసిందితను అమ్మను” తలుచుకున్న దివ్యకు కంట్లో నీళ్ళుతిరిగి చెంపలపై కారాయి. హృదయం బరువెక్కింది అమ్మ జ్ఞాపకాలతో […]

ప్రేమ కానుకలు

రచన: సురేఖ దేవళ్ల   చిన్నగా పడుతున్న చిరుజల్లులను, మాకోసం మరింత తొందరగా మా దగ్గరకు చేరుకో అంటూ తమ కదలిక ద్వారా సంకేతాన్ని అందిస్తున్న అందమైన ఆకుపచ్చని మొక్కలతో, అప్పుడప్పడే విచ్చుకుంటూ తమ సోయగంతో పరిమళాలను వెదజల్లుతూ చూపరుల నయనాలనే కాకుండా మనసును కూడా వాటివైపు మరిలేలా చేస్తున్న సన్నజాజుల అల్లరితో ఆ సాయంత్రం చాలా అందంగా, ఆహ్లాదంగా ఉంది. ఆ సాయంత్రపు ప్రకృతి కంటే అందంగా సింగారించుకుని బంగారుబొమ్మలాంటి  కుందన తన భర్త  హేమంత్ […]

అది ఒక ఇదిలే…

రచన : సుధేష్ణ   అపార్ట్మెంటు అంతా శుభ్రం చేసి టేబుల్ పైన వేజ్లో పువ్వులు గుత్తిగా అమర్చి ఆ పక్క నిలబడి, ఈ పక్క నిలబడి చూసాడు. డైనింగ్ టేబుల్, దానిపైన వెజ్, అందులో పువ్వులు అన్నీఅందంగానే కనిపిస్తున్నా యని రూడీ చేసుకున్నాక తృప్తిగా ‘మేరి సప్నోంకి రాణి’ ఈల వేస్తూ వంటిన్ట్లో కేల్లాడు రోహన్. పెద్దగా ఏనాడూ వంట చేసినవాడు కాదు. ఐపాడు ముందు పెట్టుకుని ఘుమ ఘుమ లాడే వంట కాలు పొలావు, […]

చీకటి మూసిన ఏకాంతం 6

రచన: మన్నెం శారద   నిశాంత పెళ్ళి హితేంద్రతో నిరాడంబరంగా రిజిస్ట్రాఫీసులో జరిగిపోయింది. సాక్షి సంతకాలు సాగర్, అతని తరపున సినిమా రంగం తాలూకు ఇద్దరు వ్యక్తులు పెట్టేరు. పెళ్ళిరోజు వరకు నవనీతరావు భార్యకా సంగతి చెప్పలేదు. చెబితే ఎంత రాద్ధాంతమవుతుందో అతనికి తెలుసు. అందుకే మౌనం పాటించేడు. నిశాంత కూడ చివరి రోజు వరకు తల్లిదండ్రులతో ఆ సంగతి చర్చించలేదు. కారణం – సాగర్ ఆమెకు – ఆమె తండ్రి ఎంతమాత్రం ఈ పెళ్ళికి సుముఖంగా […]

ట్రాఫిక్ కంట్రోల్

రచన:  మణి గోవిందరాజుల…. కారు చాలా స్మూత్ గా వెళ్తున్నది రెండేళ్ళ తర్వాత విదేశాల నుండి వచ్చిన గౌరవ్ కిటికీ లో నుండి కనపడుతున్న సిటీ ని చూసి  చాలా ఆశ్చర్యపోయాడు.   “అరేయ్ ప్రకాశ్ నన్నొకసారి గిల్లరా? ఇది కలా నిజమా? ఇది హైదరాబాదేనా? లేక నేను ఇంకా యూయెస్ లోనే వున్నానా?” అడిగాడు “నువు హైదరాబాద్ వచ్చావు.   నేను నిన్ను తీసుకుని ఎయిర్పోర్ట్ నుండి ఇంటికెళ్తున్నాను.   ఇది నిజం.   ముమ్మాటికీ నిజం” హాస్యంగా చెప్పాడు ప్రకాశ్. […]

గిలకమ్మ కతలు – అనాపోతే?

రచన: కన్నెగంటి అనసూయ   “ ఏటి.. సట్టిలో  కందిపప్పు కడిగట్తే పెట్టేవు? నానిపోతల్లేదా?ఉప్పుటికే  ఉబ్బింతింతైంది  పప్పు బద్ద. పప్పునీ మట్ని వదిలేసి దేని కోసం సూత్తన్నా ఈధరుగు మీద కూకుని…” అప్పుడే ఊళ్ళో ఏలిడిసిన మేనమామ పెళ్లాం మంచం మీంచి పడిపోయిందని తెల్సి పలకరిత్తాకి ఎల్లొచ్చిందేవో..లోనకెల్లి కోక మార్సుకుని పాచ్చీర సుట్టబెట్టి పొయ్యికాడికొచ్చిందేవో.. ఎదురుగ్గా పప్పుగిన్ని. “ గిలకమ్మ టమాటలట్టుకొత్తాకెల్లింది ఈరెంకడి సేలోకి.  వత్తాదేవోనని సూత్తన్నా.. కూకున్నాను. ఏ జావయ్యిందో దాన్నంపి. ఎక్కడ పెత్తనాలు సేత్తందో […]

మనసు తడిపిన గోదారి కథలు

సమీక్ష:  సి.ఉమాదేవి విభిన్న కథాంశాలతో మనలో ఆలోచనలను రగిలించి పరిష్కారదిశగా మన మనసును మలుపు తిప్పుతారు  రచయిత్రి చెంగల్వల కామేశ్వరి.అటు సామాజిక సేవను ఇటు సాహితీ సేవను సమాంతరంగా నిర్వహించడమే కాక చక్కటి యాత్రానుభవాలను స్వంతం చేసుకున్నారు.స్నేహానికి,సంగీతానికి చక్కటి లయ పలుకుతుంది వారి మనసు. చెప్పుకుంటే కథలెన్నో,కాఫీ విత్ కామేశ్వరి మనకందిన వీరి పుస్తకాలు మనల్ని అలరించాయి.ఇప్పుడు వెలువడిన వీరి గుండెల్లో గోదారి కథాసంపుటం భిన్న కథాంశాల సమాహారం.నిర్మలంగా ప్రవహించే గోదారిలో సైతం, కనబడని సుడిగుండాలు కబళించినట్లు […]