April 19, 2024

ఆ బాల్యమే

రచన: మూలా వీరేశ్వరరావు

 

జ్ఞాపకాల లోయల్లో

చిగురించే ఆ బాల్యమే

ఇప్పటికి దిశా నిర్దేశం చేస్తోంది !

 

అసత్యానికి మనస్సు సమీపించి నప్పుడల్లా

హరిశ్చంద్ర” నాటకం కనుల కొలను లో

నిండి పోతుంది !

 

అన్న దమ్ముల పై “వ్యాజ్యాని” కై

బంధువులు ఆజ్యం పోసి నపుడు

అమ్మ చెప్పిన రామాయణమే

ఎదుట నిలిచింది !

 

నారి పీడన కై

తలపడి నప్పుడు

విడివడిన

ఆ ద్రౌపది కేశమే

వెంటాడింది !

 

లంచాని కై తల వంచి నపుడు

మాస్టారి బెత్తమే దర్శన మిచ్చింది

 

జీవిత చరమాంకాన్ని

వృద్ధాశ్రమానికి చేరుస్తుంటే

శ్రవణ కుమారుడే  ”

హిత బోధ

చేసాడు

అందుకే ఈ బాల్యం

అమూల్యం

అమృత తుల్యం !

 

 

1 thought on “ఆ బాల్యమే

Leave a Reply to మాలిక పత్రిక అక్టోబర్ 2019 సంచికకు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *