April 25, 2024

తపస్సు – స్వాగతం దొరా

రచన: రామా చంద్రమౌళి

ఇప్పుడిక అతి గోపనీయమైన మన పడక గదుల్లో కూడా
నీకు తెలియకుండా మల్టీ డైరెక్షనల్‌ సెటిలైట్‌ కంట్రోల్డ్‌ కెమెరాను
అమర్చడానికి అనుమతి లభించింది
రహస్యాలేవీ ఉండవిక.. అంతా బహిరంగమే
మైమర్చి ‘ ట్రాంక్విలైజర్‌ ’ మత్తులో
ఉనికినీ స్వస్పృహనూ కోల్పోతూ అగాథాల్లోకి కూలిపోవడం
ఇక్కడి పౌర హక్కు ఇక
సంస్కృతి పేరుతో, దేశప్రేమ పేరుతో, పుణ్యభూమి పేరుతో
ఇన్నాళ్ళూ ఈ నేల గుండెలపై వ్రేలాడిన భద్ర ద్వారాలు
ఇప్పుడు భళ్ళున తెరుచుకున్నాయి
ఇక విషసునామీ డాలర్ల రూపంలో ముంచుకొస్తుంది
పహరా హుషార్‌.. తలుపులు ‘ బార్లా’ తెరువబడ్డాయి
ఇన్నాళ్ళూ ప్రాకిన బొంత పురుగిప్పుడు సీతాకోక చిలుకై ఎగురుతోంది ఎదపై
సిద్ధంగా ఉండండిక
వరదల్లో పత్తా లేకుండా కొట్టుకుపోడానికి
నగ్న శరీరాలు మనవే కాని
మన వీపులపై వాతలు పెట్టేవాడు మాత్రం విదేశీ ధనిక వ్యాపారి
‘ హావ్స్‌ ’ అండ్‌ ‘ హావ్‌ నాట్స్‌ ’ గా వర్గీకరించబడ్డ వ్యవస్థలో
మేకిన్‌ ఇండియాలూ, మేడిన్‌ ఇండియాలూ
ఐ ఐ టి క్యాంపసుల్లోనుండి మేథోపరులూ
అమెరికా వీథుల్లో ‘ హర్రాజు ’ వేయబడ్తున్నపుడు
సభలు సభలుగా.. కన్వెన్షన్లు కన్వెన్షన్లుగా
‘ పెట్టుబడి’ ని దానం చేయండని
చేతుల్లో బొచ్చెను పట్టుకుని విశ్వ విపణిలో యాచన చేస్తున్నపుడు
అన్నీ ‘ మాతా భిక్షాందేహీ ’ లే
ఇక్కడి నేల.. ఇక్కడి ప్రజలు.. ఇక్కడి వనరులు .. ఇక్కడి పవిత్ర భూమి
అన్నీ ఒట్టి ట్రాష్‌.. అంతా హ్యూమన్‌ గార్బేజ్‌
ఎవడో ఒక విదేశీ ‘ పెట్టుబడిదారు ’ కావాలి
ప్రత్యక్ష విదేశీ పెట్టుబడిదారుల్లారా.. బాజాప్తా చొరబాటుదారులారా,
సుస్వాగతం మా ఎదపై పరిచిన ఎర్ర తివాచీ పైకి
రక్షణ రంగమైనా.. ఔషధ రంగమైనా.. ఆహార రంగమైనా
మా అత్యంత వ్యక్తిగత రహస్య రతిరంగమైనా
మీ నిరభ్యంతర ప్రవేశానికి సాదర స్వాగతం
రండి మా సౌఖ్యాలకోసం, మా సుఖాలకోసం
మా క్షణిక ‘ లగ్జరీ ’ కోసం ఈ దేశాన్నీ
మా అస్తిత్వాన్నీ, మా ఉనికినీ, మా ఆత్మగౌరవాన్నీ
మీ పాదాలముందు తాకట్టు పెట్టి
రాజ్యాంగం సాక్షిగా .. ‘ బానిసత్వాన్ని ’ స్వీకరిస్తాం
జీవితమంటేనే వ్యాపారమనీ , వ్యాపారమే జీవితమనీ
ఇక్కడ పాఠాలను నేర్పుతున్న, నేర్చుకుంటున్న మాకు
అసలు ‘ జీవితం ’ నిర్వచనమే తెలియడంలేదిప్పుడు
ప్లీజ్‌ ఈ పుణ్యభూమిపైకి నువ్వొచ్చి ‘ జీవితాన్ని‘ నిర్వచించవా
మా ఔషధ రంగాన్ని మా రక్షణ రంగాన్నీ ఆక్రమించబోతున్న విదేశీయుడా
చిటికెడు విషాన్ని లక్ష రూపాయలకు కొనుక్కొని
మా మెడలో మేమే ‘ సోల్డ్‌ అండ్‌ డెడ్‌ ’ ట్యాగ్‌ను ధరించబోతున్నాం-
రండి.. తళతళా మెరిసే మీ బూట్లను
మా ఎదపై టకటకలాడించుకుంటూ –
భారత్‌ టి వి లు.. అప్ట్రాన్‌ టి వి లు మరణించిన ఈ దేశాన్ని
అన్నీ సాంసంగ్‌ లూ, లెనోవా లే ఆక్రమిస్తున్నపుడు
మేమిక మా గోచీ గుడ్దపై
‘మేకిన్‌ ఇండియా ’ ముద్రను వెదుక్కుంటూ ఉంటాం
వెల్కం ప్లీజ్‌
విదేశీ పెట్టుబడిదారులారా బి బ్లెస్డ్‌ ఇన్‌ ఇండియా –

Translated by U. Atreya Sarma

Welcome, Me-lord!

There’s now permission in place
for the multi-directional satellite controlled cameras
to invade even in the privacy of our bedrooms,
unknown to us.
No privacy henceforth, everything being public.
Along with that comes the personal right
to lose oneself in the kick of ‘tranquilizers’
and slip into the depths of loss of self-consciousness.
The doors of privacy secure so far on the hearts of this land
to protect our culture, patriotism and holiness
are now suddenly flung open.
Beware of the poisonous tsunami
that’s going to strike us in the shape of dollars!
The bars on the vigilant doors are smashed
to pave the way for the open bars.
The caterpillar of our minds that has crawled so far
has now turned into a butterfly, buzzing over our hearts.
Let’s be prepared to be swept off traceless in the flood.
The bare bodies are our own, but branding on them
is the flush foreign trader.
When the ‘Make in India’ and ‘Made in India’ projects
together with the brains from our IIT campuses
are being auctioned off in the American streets
in the global society of ‘haves’ and ‘have not’s,’
and when conventions are held wholesale
to seek out capital and investments
holding a begging bowl in the hands
in the streets of the world market,
everything is nothing but blatant beggary.
And it highlights that our people and country,
and our sacred land are nothing but garbage.
We do want one or the other foreign investor.
You, the foreign direct investors cum outright robbers!
Welcome onto the red carpets laid out on our hearts!
Be it the field of defense or pharma or food
or even the private scenes of our personal sex,
a warm and open welcome awaits you.
Come, do come to pander to our pleasures,
comforts and fleeting luxuries.
Pledging our very identity, survival and
self-respect on the altar of your feet,
Swearing on the constitution and proclaiming
“We’ll yield to slavery,”
and teaching and learning that life itself is a business,
and business alone is life,
we have forgotten the very definition of life.
Please step onto our holy land and interpret ‘life’ for us.
You, the foreign dealer who are going to invade
our pharma and defense fields!
We are going to buy a pinch of poison from you
and hang a tag from our neck, reading “Sold & Dead.”
Come on, slipping into your dazzling boots
and clattering on the highway of our hearts.
In a country where the Bharat and Uptron TV sets had died,
and made way for the Samsung and Lenovo brands,
we will, from now on, look out for the “Make in India” sign
On our loin cloths.
Hearty welcome, dear foreign investors! Be blessed in India.
Written in response to the decision taken by the Government of India on 20 June 2016 granting liberalized permissions for the inflow of 100% foreign investment in key sectors like defense, pharma, food and tourism,

Poet’s note

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *