March 28, 2024

మనసు తడిపిన గోదారి కథలు

సమీక్ష:  సి.ఉమాదేవి

విభిన్న కథాంశాలతో మనలో ఆలోచనలను రగిలించి పరిష్కారదిశగా మన మనసును మలుపు తిప్పుతారు  రచయిత్రి చెంగల్వల కామేశ్వరి.అటు సామాజిక సేవను ఇటు సాహితీ సేవను సమాంతరంగా నిర్వహించడమే కాక చక్కటి యాత్రానుభవాలను స్వంతం చేసుకున్నారు.స్నేహానికి,సంగీతానికి చక్కటి లయ పలుకుతుంది వారి మనసు.

చెప్పుకుంటే కథలెన్నో,కాఫీ విత్ కామేశ్వరి మనకందిన వీరి పుస్తకాలు మనల్ని అలరించాయి.ఇప్పుడు వెలువడిన వీరి గుండెల్లో గోదారి కథాసంపుటం భిన్న కథాంశాల సమాహారం.నిర్మలంగా ప్రవహించే గోదారిలో సైతం, కనబడని సుడిగుండాలు కబళించినట్లు కథలలో ప్రవేశించే పాత్రలు  విరుద్ధ అభిప్రాయాలతో కుటుంబజీవనాన్ని పట్టి కుదుపుతాయి.అయితే చదువరిలో తనదైన పరిష్కారదిశగా ఆలోచనలకు బీజం వేస్తారు.

ఋణానుబంధం కథ విశ్వాసానికి చిరునామా అనదగ్గ కుక్క ప్రవర్తన మనిషి ప్రవర్తనను సైతం మార్చగలదు అని చక్కగా వివరించిన కథ.జీవితమే నాటకమైతే కథ నాటకాన్ని నిలబెట్టే దిశగా సాగిన వైనం అభినందనీయం.మూఢనమ్మకాలు మనిషిలోని విజ్ఞతను మరుగుపరచి మాటలతూటాలను వెదజల్లే భర్త ధోరణిని మార్చేదిశగా సాగిన కథ స్నేహం.తీపి గురుతులు కథ కుటుంబజీవితాలను పారదర్శకం చేసిన చక్కని కథ.అమ్మ శాసనం నేటి జీవనవిధానానికి అద్ధంపట్టిన కథ.అనుబంధాలు మనిషి మనసును పెనవేసుకున్న వైనాన్ని తెలిపిన కథ కాలమిచ్చిన తీర్పు.అత్తలోని మరోకోణం కాంచిన కోడలు ఆమె మనసునర్థం చేసుకుని తన అభిప్రాయాన్ని మార్చుకుని మా అత్త బంగారం అని చెప్పడం మనకు ఊరటనిస్తుంది.

‘ కాలంతో కలసివచ్చిన అనుబంధాలు కాలరాస్తే కావాలనుకున్నప్పుడు కాలమివ్వని భగవంతుడి లీల ఇదే.కాలమిచ్చిన తీర్పు అదే.’అని కాలమిచ్చిన తీర్పు కథలో రచయిత్రి పలికిన పలుకులు కన్నీటి కడలికి తెరలేపుతాయి.తీపి గుర్తులు కథ మనిషి మస్తిష్కాన్ని పట్టి ఊపుతుంది.అనుబంధాలు ఎప్పుడూ పటిష్టమయినవే. పోయినవాళ్లని హృదయంలో  దాచుకోవాలి.ఉన్నవాళ్లతో  ప్రేమగా ఉన్నప్పుడే గడపాలి.అని రచయిత్రి చెప్పడం హృదయాన్ని మాటలకందని భావజాలంతో కట్టిపడేస్తుంది.మరో చక్కని కథ జీన్స్.వార్ధక్యం మనసును,శరీరాన్ని కృంగతీసే సమయంలో మనవరాలి చల్లని మాట చల్లని చలివేంద్రమే కదా.తన కలానికి పదునుపెట్టి మరిన్ని మంచి కథలను మనకందివ్వాలని కోరుతూ కామేశ్వరికి శుభాభినందనలు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

3 thoughts on “మనసు తడిపిన గోదారి కథలు

  1. ధాంక్స్ ఉమాదేవీ గారూ! నేను రాసిన “గుండెల్లో గోదారి” కథల సంపుటి ని మీ వంటి పెద్ద రచయిత్రి చక్కగా సమీక్షించడం చాలా ఆనందంగా ఉంది. మీకు నా ధన్యవాదాలు.

Leave a Reply to Kameswari chengalavala Cancel reply

Your email address will not be published. Required fields are marked *