March 28, 2024

అతివలు అంత సులభమా…..

రచన: ఆర్. ఉమాదేవి   అదురుతున్న గుండెను అదిమిపట్టుకుంటూ.. ఒక్క ఉదుటున తన సీట్లోకి వచ్చి పడింది సుమన. ఒళ్ళంతా చెమటలు పట్టాయి ఆమెకి. టేబుల్ మీద ఉన్న వాటర్ బాటల్ తీసి గటగటా నీళ్ళు తాగింది. కాసేపటి తర్వాత గాని ఆమె స్థిమితపడ లేకపోయింది. గదిలో జరిగింది తలుచుకుంటూ ఉంటే మళ్ళీ గుండెలు గుబగుబలాడాయి. ***** సాయంత్రం ఆఫీస్ అవగానే ఇల్లు చేరింది సుమన. అన్యమనస్కంగానే వంట గదిలో పనులు చేస్తోంది. “సుమనా! కాస్త కాఫీ […]

ఆ బాల్యమే

రచన: మూలా వీరేశ్వరరావు   జ్ఞాపకాల లోయల్లో చిగురించే ఆ బాల్యమే ఇప్పటికి దిశా నిర్దేశం చేస్తోంది !   అసత్యానికి మనస్సు సమీపించి నప్పుడల్లా “హరిశ్చంద్ర” నాటకం కనుల కొలను లో నిండి పోతుంది !   అన్న దమ్ముల పై “వ్యాజ్యాని” కై బంధువులు ఆజ్యం పోసి నపుడు అమ్మ చెప్పిన రామాయణమే ఎదుట నిలిచింది !   నారి పీడన కై తలపడి నప్పుడు విడివడిన ఆ ద్రౌపది కేశమే వెంటాడింది !   లంచాని […]

అష్ట భైరవులు

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు కాశీ యాత్రకు కాలభైరవుని అనుమతి కావలి అందుచేత కాశీని దర్శించుకునేవారు తప్పని సరిగా క్షేత్ర పాలకుడైన కాలభైరవుని దర్శించుకోవాలి లేకపోతె కాశీయాత్ర ఫలితము దక్కదు అందుచేత ముందు కాలభైరవుని గురించి తెలుసుకుందాము. కాలభైరవుడు అంటే కాశీ నగరానికి కొత్వాల్ లాంటి వాడు అంటే శాంతి భద్రతలను రక్షించేవాడు సాధారణముగా అందరు కాశీ లో శివుడిని దర్శించుకొని వస్తారు అలాకాకుండా కాశీలోని కాల భైరవ ఆలయము అష్ట భైరవ ఆలయాలను దర్శించుకుంటే కాశీ […]

కౌండిన్య కథలు – మారని పాపారావు

రచన: రమేశ్ కలవల మాయ మాటలతో మభ్యపెట్టడం పాపారావుకు పుట్టుకతో అబ్బిన కళ. సిగరెట్టు బడ్డీకొట్టు దగ్గర మాటల గారడి చేసిడబ్బులు సంపాదించాడు పాపారావు. పట్నం నుండి హోల్ సేల్ లో కొత్త వెరైటీ లైటర్స్ తీసుకురమ్మని చెప్పాడుట ఆ బడ్డీకొట్టు ఓనర్. పాపారావు ఎలాంటి వాడో కొంచెం తెలిసింది కదా, తన గురించి మిగతాది తరువాత తెలిసుకుందాం, ఎందుకంటే ఆ డబ్బులు తీసుకొని అటు వెడుతుంటే పోస్ట్ మ్యాన్ ఓ టెలిగ్రాం అందచేసాడు. అందులో “తాత […]

గాంధీజీ గాయపడ్డారు

రచన: డా.లక్ష్మీ రాఘవ అది ఒక పురాతనమైన గుడి. ఆ రోజు గుడి తలుపులు ఇంకా తెరుచుకోలేదు. పూజారి రావడం ఆలస్యం అయ్యింది. అయినా గుడి వెలుపల హడావిడి రోజూ లాగే మొదలైంది. పక్కన పేర్చి వున్న రాళ్ళు వరసగా పెట్టుకుని పళ్ళ బుట్ట దాని మీద పెట్టింది కామాక్షి. ఎదురుగా వున్నా వరసలో మొదటిగా వచ్చే పూలమ్మి పుల్లక్క అప్పటికే వెదురు బుట్ట లో పూలు రంగులవారిగా పెట్టుకుని నీళ్ళు చల్ల్లుతూంది. నీళ్ళు చల్లినాక పల్చటి […]

కళ్యాణ వైభోగమే

రచన: రాము కోల “పెళ్ళి కుదిరింది అనుకోగానే సరిపోయిందా.. రూపాయి ఎంత త్వరగా ఖర్చు అవుతుందో కూడా లెక్కేసుకోవాలి.” “ఎమంటావు మావా!” అంటూ నోట్లో ఉన్న పుగాకు కాడ నవులుతు.. పక్కనే ఉన్న గొపయ్య. వైపు చూశాడు చిదానందం. “ఓసోసి! ఊరుకోవోయ్.. పెళ్లి కుదరటమే మా గొప్ప సంగతి. ఇక రూపాయంటావా? మనందరం లేమా ఏటి, తలా ఓ చెయ్య వేస్తే పిల్లకూడా ఓ ఇంటిది అయిపోద్ది. ” ” నువ్వు ఏటి దిగులు పడమాక” అంటూ […]

జలజం… మొహమాటం.

రచన: గిరిజా కలవల ఆ మధ్య జలజం ఓ బీరకాయపీచు చుట్టమింటికి వెళ్ళింది. బంధుప్రీతి ఎక్కువ కదా మన జలజానికి… ఎవరినీ వదలదు.. ఆ ప్రకారం గా.. ఆ బీరకాయ పీచు ఇంటికి వెళ్ళగా… వారు సాదరంగా ఆహ్వానించి సముచిత ఆసననంబుపై ఆశీనులుకమ్మని.. తదుపరి యోగక్షేమం విచారించి… తగు ఆతిధ్యమీయ ఆ బీరకాయపీచు… ఒక ప్లేటు నిండుగా ఉల్లి పకోడీలు తెచ్చి మన జలజానికి అందించెను. ఉల్లి వాసనకి ముక్కుపుటాలు అదిరి… నోట లాలాజలం రివ్వున ఎగసింది […]

గడిలోదాగిన వైజ్ఞానిక నుడి – 2

రచన: డా.చాగంటి కృష్ణకుమారి సూచనలు : అడ్డం: 1. ఫ్రియాన్‌లు( freons) వాతావరణంలో అధిక మొత్తంలో చేరుతూ అతిశయించిన — కి కారణమవుతున్నాయి(9) 6 . దేహమునుండి పుట్టినది (3) 7 . చాపము (2) 8. అదరు (2) 10. రెండు గాని అంతకంటే ఎక్కువ కాని సరళమైన రసాయనాలను చర్య పొందించడం ద్వారా క్లిష్ట మైన ఒక సరికొత్త రసాయన సమ్మేళనాన్ని పొందడం (5) 11 ఇగ్లీ షు లో Era ( ఇరా […]

తేనెలొలుకు తెలుగు –

రచన: తుమ్మూరి రామ్మోహనరావు పద్యప్రేమ-2 దాదాపుగా అన్ని భారతీయ భాషలకు మాతృస్థానంలో ఉన్న సంస్కృతం తెలుగు భాషలో పాలలో చక్కెరలా కలిసిపోయింది. ఎంత తెలుగులోనే మాట్లాడాలని పట్టుదల కలిగిన వారైనా, సంస్కృత భాషను ఇచ్చగించని వారైనా, సంస్కృతపదాలను వాడకుండా మాట్లాడటం కష్టమైనపని. అయితే తొలిదశలో అప్పుడప్పుడప్పుడే తెలుగు భాషకు ఒక లిఖితరూపం ఏర్పడే కాలంలో పద్యరచన సంస్కృత సమాసాలతోనే సాగింది. మచ్చుకి నన్నయ గారి పద్యం చూద్దాం. బహువనపాదపాబ్ధికులపర్వతపూర్ణసరస్సరస్వతీ సహితమహామహీభరమజస్ర సహస్ర ఫణాళిదాల్చిదు స్సహతరమూర్తికిన్ జలధిశాయికి బాయకశయ్యయైనయ […]

యాత్రా మాలిక – ఉత్తరాఖండ్ తీర్థయాత్రలు / విహార యాత్ర నైనితాల్

రచన: నాగలక్ష్మి కర్రా దేశరాజధానికి సుమారు 330 కిలో మీటర్ల దూరంలో ఉత్తరాఖంఢ్ రాష్ట్రం లో వుంది నైనితాల్ . దేశవిదేశాలలో పేరుపొందిన వేసవి విడిది . సుమారు 6,840 అడుగుల యెత్తులో వుంది . ఢిల్లీ నుంచి రైలుమార్గం ద్వారా ‘ కాఠ్ గోదాం ‘ వరకు  వుంది . నైనితాల్ వెళ్లదల్చుకున్నవారు ట్రైన్ లో కాఠ్ గోదాం ‘ వరకు వచ్చి అక్కడనుంచి రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న బస్సులలో కాని టాక్సీ లలో గాని […]