April 20, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 42

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య కర్మ సిద్ధాంతం ప్రకారం మనం అనుభవించే  ఆగామి, సంచితము, ప్రారబ్ధము అనే మూడు కర్మలను ఉద్దేశించి “మీకిక పనిలేదు…వెళ్ళిపొండి” అంటున్నాడు. తను శ్రీవేంకటేశ్వరుని పరమ భక్తుడనని తెలుపుతూ తనని వదిలేయమని వాటిని కోరుతున్నాడు. కీర్తన: పల్లవి: ఉమ్మడికర్మములాల వుండఁ జోటు మీకు లేదు యిమ్ముల నెందైనాఁ బోరో యివి లేనిచోటికి    ॥పల్లవి॥   చ.1 పెట్టినది నుదుటను పెరుమాళ్ళ లాంఛనము దట్టమై భుజములందు దైవశిఖామణిముద్ర నెట్టన నాలుకవిూఁద నీలవర్ణునామమిదె అట్టె హరిదాసులకంటునా పాపములు         […]

గరిమెళ్ల సత్యనారాయణ గారు

రచన: శారదాప్రసాద్ స్వాతంత్య్రోద్యమ కవుల్లో గరిమెళ్ల సత్యనారాయణ గారిది విశిష్టమైన స్థానం. గరిమెళ్ల గేయాలు జాతీయ వీర రసంతో తొణికిసలాడుతూ పాఠక జనాన్ని ఉర్రూతలూ గించాయి. అతను వ్రాసిన ‘మా కొద్దీ తెల్ల దొరతనం’ పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించింది. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండంలోని ప్రియాగ్రహారంలో 1893 జూలై 15న జన్మించారు. బి. ఏ. డిగ్రీ పూర్తి చేశాక గంజాం కలెక్టర్ కార్యాలయంలో గుమస్తాగా కొంతకాలం పనిచేశాడు. ఆ తరువాత విజయనగరం ఉన్నత […]

ప్రేమవ్యధ…!!

రచన, చిత్రం: కృష్ణ అశోక్ పెనవేసుకున్న ప్రేమ పోగులు ఒక్కొక్కటి విడివడి తెగిపోవడం నా కంటిపాపకి కనిపిస్తుంది… గుండెలో రాసుకున్న ప్రేమాక్షర నక్షత్త్రాలు ఆకాశం నుండి ఉల్కల్లా నేలకు రాలడం నా మనసు కిటికీనుండి చూస్తూనే ఉంది… మైత్రి మమకారాలు మాట రాక గుండెగొంతులోనే కరుడు కట్టినట్టు మస్తిష్కపు కేన్వాసు వర్ణిస్తూనే ఉంది… సిరుల విరుల ఊసులన్నీ నీరుగారి నిన్నునన్ను ముంచేస్తున్న సునామీల్లా మనిద్దరినీ చెల్లాచెదురుగా చేయడం నా భవిష్యవాణి చెవిలో చెప్తున్నట్టు వినిపిస్తుంది… ఈ నిట్టూర్పుల […]

తపస్సు – స్వాగతం దొరా

రచన: రామా చంద్రమౌళి ఇప్పుడిక అతి గోపనీయమైన మన పడక గదుల్లో కూడా నీకు తెలియకుండా మల్టీ డైరెక్షనల్‌ సెటిలైట్‌ కంట్రోల్డ్‌ కెమెరాను అమర్చడానికి అనుమతి లభించింది రహస్యాలేవీ ఉండవిక.. అంతా బహిరంగమే మైమర్చి ‘ ట్రాంక్విలైజర్‌ ’ మత్తులో ఉనికినీ స్వస్పృహనూ కోల్పోతూ అగాథాల్లోకి కూలిపోవడం ఇక్కడి పౌర హక్కు ఇక సంస్కృతి పేరుతో, దేశప్రేమ పేరుతో, పుణ్యభూమి పేరుతో ఇన్నాళ్ళూ ఈ నేల గుండెలపై వ్రేలాడిన భద్ర ద్వారాలు ఇప్పుడు భళ్ళున తెరుచుకున్నాయి ఇక […]

విలువ

రచన: పారనంది శాంతకుమారి   నెగిటివ్ ఆలోచన వల్లే పాజిటివ్ ఆలోచనకు విలువ అమావాశ్యవల్లే పౌర్ణమికి విలువ. వేదనవల్లే వేడుకకు విలువ. మరుపువల్లే జ్ఞాపకానికి విలువ. రాత్రి వల్లే పగటికి విలువ. గరళం వల్లే సుధకు విలువ. ఓటమి వల్లే గెలుపుకు విలువ. పోకవల్లే రాకకు విలువ. అబద్ధం వల్లే నిజానికి విలువ. చెడువల్లే మంచికి విలువ. మృగతత్వం వల్లే మానవత్వానికి విలువ. ఒంటరితనంవల్లే జంటతనంకు విలువ. దు:ఖంవల్లే సుఖానికి విలువ. వేసవివల్లే వెన్నెలకు విలువ. కఠినత్వంవల్లే […]