గడిలోదాగిన వైజ్ఞానిక నుడి – 3

కూర్పరి: చాగంటి కృష్ణకుమారి

సూచనలు :
అడ్డం :
1. ఐన్ స్టీన్ కనుగొన్నది , 1921 లో అతనికి నోబెల్ తెచ్చిపెట్టినది . (9)
6. ఉత్తరాంధ్రా మాడలికంలో దీపాన్ని — అంటారు, దీపంపెట్టు అనడానికి – పెట్టు అంటారు. ఈ పదాన్ని వేటూరివారు ‘ యువ’ సినిమాపాటలో వాడారు ( వెనకనుండి ముందుకి) (2)
7 . రొట్టి—- నేతిలో పడింది (3)
8. వీడో పప్పుసుద్ద. కానీ, విశేషమేమిటంటె వీడిని సగానికి కోసి కాల్సైట్ ఖనిజాన్ని(calcite.) పొందపొవచ్చు  (2)
9 . తిరగబడిన  Eleusine coracana, or finger millet, (2)
11 . ఒరే ! నీకది న్యాయం కాదురా! (5)
12 . ఉత్తరాలు (2)
13 . ఓమము- వృక్ష శాస్త్రీయ నామం – Carum copticum (2)
14 . భోగి తరువాత ఇది వెనకకు తిరిగిన — సంక్రాంతి (3)
16 . కాస్ట్ ఐరన్ ని తెలుగులో — ఇనుము అంటారు (2)
17 . ప్లాటినమ్, అల్యూ మినియమ్ వంటి కొన్ని పదార్ధాలను అయస్కాంత క్షేత్రంలో వుంచితే బలహీనమైన అయస్కాంతతత్వాన్ని పొందుతయి. కాని, క్షేత్రాన్ని తొలగిస్తే ఆ తత్వాన్ని కోల్పోతాయి . అందువల్ల ఇవి —– ప్రదర్శిస్తాయని చెపుతాము (9 )
నిలువు:
1. సోలార పానల్ వంటి వాటిపై కాంతి పడినప్పుడు ఇవి విద్యుత్ ను ఉత్పత్తిచేస్తాయి. వీటిని ఫొటో సెల్స్ అనవచ్చు.  తెలుగులో వీటి పేరేమిటి?(9)
2. సిట్రస్ పండు రసాన్ని పాలలో వేసి పొయ్యి మీద పెట్టావ్! ఏమిటి పొందుదామని? (6)
3. ప్రకాశం (2)
4 . అక్షర మాల , Script (2)
5. సూర్యాస్థమయం లో ఆకాశపు రంగు తల క్రిందులుగా (9)
8 . పొటాషియం నైట్రేట్‌, పెట్లుప్పు, (5)
10. అవసరమయిన సమయములో ఆదుకోని చుట్టము తిరగబడ్డాడు (6)
15 .ఇక్కడ సంపద దిగువనుండీ ఎగువకి పోతున్నది (2)
16 తల క్రిందులుగా ఈ నందనుడు శ్రీ కృష్ణుడు (2)

One comment on “గడిలోదాగిన వైజ్ఞానిక నుడి – 3”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *