March 28, 2023

గుర్తింపు

రచన: శైలజ విస్సంశెట్టి పిల్లలు రాసిన ఆన్సర్ షీట్స్ దిద్దటానికి ముందు వేసుకుని కూర్చున్న చరితకి మనసు వాటిపై లగ్నం కావటంలేదు. ఈమధ్య చాలాకాలంగా తన మనసులో సన్నగా రాజుకుంటున్న అసంతృప్తి ఇటీవల కాలంలో వటుడింతై అంతై అన్నట్లుగా పెరిగిపోయి ఏ పనిచేస్తున్నా అదే విషయం తన ఆలోచనలకు కేంద్రబిందువు కావటం చరితకి తెలుస్తూనే ఉంది. చేతిలో పెన్నుక్యాప్ మూసివేసి ప్రక్కకు పడేసి తాను కూర్చున్న హాలునంతా ఒక్కసారి పరికించి చూసింది. 8 సంవత్సరాల క్రితం తమ […]

తపస్సు – ఒక నువ్వు.. మరొక నేను

రచన: రామా చంద్రమౌళి నడచి వెళ్ళిన ప్రతిసారీ పాదముద్రలేమీ మిగలవు నడచి వచ్చిన దారి కూడా జ్ఞాపకముండదు చూపులన్నీ లక్ష్యాలపైనే ఉన్నపుడు ఇక వ్యూహాలే పన్నాగాలౌతాయి పాచికలు విసుర్తున్న ప్రతిసారీ అటు ఎదురుగా నీ ప్రత్యర్థీ.. ఇటు నీకు నువ్వే కనిపిస్తావు ఐతే.. కొన్ని విజయాలను అనుభవిస్తున్న దీర్ఘానుభవం తర్వాత కొన్ని ఓటములు విజయాలకన్నా మిన్నవని తోస్తుంది వెలుతురు కంటే చీకటి కూడా చాలా ముఖ్యమని నిద్రపోవాలనుకుంటున్నపుడు అర్థమౌతుంది ‘ లైట్లు ’ ఆర్పేయడం ఒక్కోసారి అనివార్య […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 43

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య స్వామీ! శ్రీవేంకటేశ్వరా! నాది కుక్కబతుకైపోయింది. కొన్నాళ్ళు లౌకిక విషయాలు, మరికొన్నాళ్ళు సంసార భవ బంధాలు అంటూ అటూ ఇటూ వెంపర్లాడుతూ, కాట్లాడుతూనే ఉన్నాను. పసరం లాగా జీవించాను ఇంతకాలం. మంచి చెడుల విచక్షణ లేనివాడనయ్యాను. నన్ను గాచి రక్షించవలసినది నీవే. అంతా నీదే భారం అంటూ వృధాగా గడచిపోయిన వ్యర్ధకాలాన్ని నిందిస్తూ వాపోతున్నాడు అన్నమయ్య ఈ కీర్తనలో. కీర్తన: పల్లవి: అటు గొన్నాళ్లందాఁక యిటు గొన్నాళ్లిందాఁక కటకటా శునకపుగతియాయఁ గావవే ॥పల్లవి॥ చ.1 […]

కాశీ లోని పాతాళ వారాహి అమ్మవారి దేవాలయము

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు… వారాహి అమ్మవారి దేవాలయము కాశీలో విశ్వనాధమందిరానికి దగ్గరలో త్రిపుర భైరవి ఘాట్ వద్ద ఉన్నది. ఈ దేవాలయానికి చాలా విశిష్టతలు ఉన్నాయి. వారాహి అమ్మవారు సప్తమాతలలో ఒకరు.  శ్రీ మహావిష్ణువు హిరాణ్యాక్షుడిని చంపి భూమిని కాపాడటానికి వరాహ అవతారము దాల్చినప్పుడు ఈ అమ్మవారు శక్తిని ఇచ్చింది. ఈ దేవాలయము ఉదయము ఐదు గంటలనుండి ఎనిమిది గంటలవరకే భక్తుల సందర్శనార్ధము తెరచి ఉంచుతారు అమ్మవారికి జరిపే పూజలు సూర్యోదయానికి ముందే  తలుపులు మూసి […]

గడిలోదాగిన వైజ్ఞానిక నుడి – 3

కూర్పరి: చాగంటి కృష్ణకుమారి సూచనలు : అడ్డం : 1. ఐన్ స్టీన్ కనుగొన్నది , 1921 లో అతనికి నోబెల్ తెచ్చిపెట్టినది . (9) 6. ఉత్తరాంధ్రా మాడలికంలో దీపాన్ని — అంటారు, దీపంపెట్టు అనడానికి – పెట్టు అంటారు. ఈ పదాన్ని వేటూరివారు ‘ యువ’ సినిమాపాటలో వాడారు ( వెనకనుండి ముందుకి) (2) 7 . రొట్టి—- నేతిలో పడింది (3) 8. వీడో పప్పుసుద్ద. కానీ, విశేషమేమిటంటె వీడిని సగానికి కోసి […]

యాత్రామాలిక – తుంగనాథ్ మహదేవ మందిరం

రచన: కర్రా నాగలక్ష్మి ఉత్తరాఖంఢ్ రాష్ట్రంలో వున్న పుణ్యక్షేత్రాలలో యీ తుంగనాథ్ వొకటి. ముఖ్యంగా ఉత్తరాఖంఢ్ లో వున్న బదరీనాథ్, కేదారనాథ్, గంగోత్రి, యమునోత్రి యాత్రలు టూర్ ఆపరేటర్ల పుణ్యమా అని యీ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యం పొందేయి. ఉత్తరాఖంఢ్ ని దేవభూమి అని అంటారు. కారణం యేమిటంటే యిక్కడ అడుగడుగునా పురాతనమైన మందిరాలు, అడవులు, పచ్చని మైదానాలు, వుష్ణ కుండాలు, మంచుతో కప్పబడ్డ యత్తైన పర్వతాలు చల్లని వాతావరణం మనస్సుని ఆహ్లాద పరుస్తూ దేవలోకం […]

యాత్రా మాలిక – నేపాల్ యాత్రా విశేషాలు

రచన: చెంగల్వల కామేశ్వరి అందరికీ నేపాల్ యాత్ర అనగానే గుర్తొచ్చేవి. పశుపతినాథ్, ముక్తినాథ్, మణి మహేష్ హిమాలయాలు ట్రెక్కింగ్ మౌంట్ కైలాష్ ఇంకా ముందుకెడితే మానససరోవరయాత్ర ఇలా ఎన్నో ప్రదేశాలు గుర్తొస్తాయి.కానీ అన్నీ తలొక మూలా ఉంటాయి. నేపాల్ వెళ్లాలంటే ముందుగా గోరక్ పూర్ కాని పాట్నా కాని రైలులోనో, విమానంలోనో, వెళ్లి అక్కడినుండి పోఖ్రా విమానంలో కాని, రోడ్ మార్గాన కాని వెళ్లొచ్చు. ఖాట్మండ్, లుంబిని, చిట్వాన్, మనోకామన, అన్నీ రోడ్ మార్గానా ప్రయాణం చేయొచ్చు. […]

ఏమైంది. ?????

రచన – శ్రీకాంత గుమ్ములూరి. బుడిబుడి నడకల బుజ్జి పాపాయి తడబడు అడుగుల బుల్లి బుజ్జాయి…. ఇల్లంతా …ఒకటే పరుగు … అడ్డూ ఆపూ లేకుండా… కాళ్ళకడ్డొచ్చిన వస్తువేదైనా…. చిన్నదైనా…పెద్దదైనా…లెక్కచేయక వాటిమీద అడుగులు వేస్తూ… వాటిని తప్పించు కుంటూ… అతి లాఘవంగా…. ఆనందంగా…. నెలవంక నవ్వుతో…. సిరి వెన్నెల మోముతో….. తాను చూచినది చేతితో తాకాలని… దానిని నోట్లో పెట్టుకొని రుచి చూడాలని…. అసలదేమిటో…దాని అంతు చూడాలని! గోడ మీద గండు చీమ …వడివడి గా పాకుతోంది. […]

శ్రీ రాజరాజేశ్వరీ దేవి అష్టకం

రచన: ఇరువంటి మాధురి దేవి అంబా శాంభవి శాంకరీ శార్వరీ పార్వతీ కాశీ ప్రాసాద నాయకీ శ్రీ క్రీం శుహదరీ సాయుజ్యామృత ప్రదాయినీ ప్రభావతీ భైరవీ ఛిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి || శ్రీ రాజరాజేశ్వరీ || అంబా మోక్ష స్వరూపిణీ మోహినీ భార్గవీ మాతా మలయాచల వాసినీ మాహిషాసుర మర్థినీ మూకాసురాంతకా ముదితామణీ మృణాళినీ ఛిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరి || శ్రీ రాజరాజేశ్వరీ || అంబా శారద శార్ంగధాదరా శ్రీ శివా […]

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

December 2019
M T W T F S S
« Oct   Jan »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031