రచన: రాజేశ్వరి….

తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా,
అంతకంటే ఏం చేయలేము మనం,

ఫేస్బుక్ లో ఓ నల్ల చిత్రం,
పోస్టులో నాలుగు వరసల నల్ల సాహిత్యం,
అంతే, అంతకంటే ఏం చేయలేము మనం,

అయ్యో అని ఒక నిట్టూర్పు,
ఆగ్గితపు చర్చలు చూస్తూ రిమోట్ విసిరేయడం,
అంతే, అంతకంటే ఏం చేయలేము మనం

ప్రాణత్యాగానికి విలువ కట్టలేం
ప్రాణాన్ని కాపాడలేం,
అంతే మనం, ఏం చేయలేము,
అసువులు బాసిన అమరజీవుల, అనాధకుటుంబాలకు అపన్నహస్తం అందించి,
వారి త్యాగాలకు ఆయువు పోయాలేము మనం,

రాజకీయ రక్కసి కుర్చీ ఆటలో, వోటు వెయ్యికి అమ్ముకుని,
కుల, మత, బీద, గొప్ప ,భాష, వేషాల, ప్రాతిపదిన విడిపోయిన మనము ఏం చేయలేము,
ప్రశ్నించలేము, ప్రతిఘటించలేము,

కలిసినపుడే కదరా కండబలం, గుండెబలం,
పిడికిడి బిగించినపుడే శత్రువు శూన్యం,
అన్న నిజాన్ని గ్రహించలేం మనం,
అందుకే ఏం చేయలేము మనం,

సగటు భారతీయ బ్రతుకు మనది,
నల్ల చిత్రం ప్రదర్శన చిత్రంగా పెట్టుకోవడం,
నా లా నాలుగు నల్ల కవిత్వపు రాతలు రాయడం,
అంతే, అంతకంటె ఏం చేయలేము మనం.

By Editor

One thought on “ఏం చేయలేము మనం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వర్గాలు
భోషాణం
ఇటీవలి వ్యాఖ్యలు