April 19, 2024

గడిలో దాగిన వైజ్ఞానిక నుడి – 4

గడి కూర్పరి: చాగంటి కృష్ణకుమారి

wts

సూచనలు :
అడ్డం:
1. సూక్ష్మ దర్శిని కి ఇంగ్లీషు అటుదిటుగా (4)
3.మన ఎముకల ఆరోగ్యానికి ఈ రసాయన లోహము కీలకమైనది ( 4)
5. — వుంటే కలదు సుఖం
6. ఆత్రము ( 4 )
8. తెలుగు మహిళల కోసం గృహలక్ష్మి అనే పత్రికను ప్రోత్సహించిన్ కె. ఎన్. కేసరి గారి మునిమనవడు నేపధ్య గాయకునిగా , శాస్త్రీయ సంగీత గాయకునిగా బాగాప్రసిద్దుడు . ఇతని పేరులోని మొదటి రెండు అక్షరాల అల్లికతో ఓ శాలువాఅటుదిటుగా (2)
11. చెమ్మ చేరకుండా వుండడానికి మందుసీసాలలోని చిన్ని పొట్లాలలో ఈ రసాయనం వుంటుంది (3)
12. కర్నాటక సంగీతంలో ఒక రాగంపేరు ; వాసన లేకపోయినా పసుపు, ఎరుపు, ఆరంజ్ రంగుళ్లో దొరికే ఈ పూవును మల్లెల, జాజుల మాలికలలో చేరుస్తారు .(5)
13. సమూహము వెనక్కి తిరిగింది (3)
15. వర్షాకాలం, అపరిశుభ్రత, అధికారుల నిర్లక్ష్యం కారణంగా విష జ్వరాల తో మాపల్లె — పట్టింది (2)
17. 1780 లో ఫ్రంచ్ రసానికుడు నికొలస్ లూయీస్ వాక్యులిన్ ( Nicolas Louis Vauquelin ) పారిస్ లో దొరికిన సైబీరియన్ రెడ్ లేడ్ (‘Siberian red lead’) ఖనిజంలో కనుగొన్నాడు.ఈ ఖనిజాన్ని ఇప్పుడు క్రోకొసైట్ ( crocoite) అని అంటున్నాము. (4వెనకనుంచి)
18. కుర్కుమా;ఒక జాతి మొక్క,Zingiberaceae (అల్లం) కుటుంబానికి చెందిన ఇది పసుపు కొమ్ములనిస్తుంది (3)
19. వెలువరించబడడము. ఉదాహరణకి వాయువు, ఉష్ణశక్తి , కాంతి శక్తి , కాలుష్య కారకాలు మొదలైనవి పరిసరాలలోకి వెలువరించబడు ప్రక్రియ(4)
20. పాత తరానికి చెందిన రికార్డ్ ప్లేయర్ . (4)
నిలువు :
1. రెని థియోఫిల్ హయసింత్ లెనెక్ (Rene Theophile Hyacinthe Laennec) అనే ఫ్రెంచ్ వైద్యుడు 1819లో ఈవైద్య పరికరాన్ని కనుగొన్నాడు
2. లాహిరి (3)
3. కొద్దిగా (3)
4.ఈ లోహము ఆవర్తన పట్టికలో జింక్ కి కిందా,మెర్క్యురికి పైన వుటుంది ( కిందనుండి పైకి 4)
7. వృక్షకణం లో మాత్రమే కనబడే ఒక ప్రత్యేక భాగం. దృఢంగా వుండే ఇది కణానికి రక్షణను ఇస్తుంది (5)
9.వృక్ష శాస్త్రీయనామం Phyllanthus emblica,ఇండియన్ గూస్ బెర్రి అని అంటారు. ఈ చెట్టు కాసే కాయ పేరు (5)
10. అందర్నీనవ్వించే సూర్యకాంతంలో కొంత చూడగలం; ఒంటరితనం కాదుగా!(3)
13. అనువర్తిత విద్యుత్ క్షే త్రంద్వారా ఒక వాయువు గుండా తాత్కాలికంగానో లేదా అవిచ్చిన్నంగానో ఎలక్ట్రాన్ లు అయానులు విడుదలైనపుడు వాటి ప్రావాహాన్ని విద్యుత్ — అంటారు (4)
14.శ్రవణ సంకేతాలను విద్యుత్ సంకేతాలుగా మార్చే ఒక పరికరం. అనగా ఇది అకౌస్టిక్-టు-ఎలక్ట్రిక్ ట్రాన్స్‌డ్యూసర్ లేదా సెన్సార్. రేడియో, టెలివిజన్ ప్రసారాల వంటి అనేక సందర్భాలలో దీని వాడుక తప్పనిసరి. (4)
16. నాదము శరీరములోపలి నుండి వెడలునపుడు హృదయమునందు వుంటుంది.ఆ నాదస్థాయికి గుర్తుగా సంగీతశాస్త్రంలో ఆ స్వరం కింద చుక్కను వుంచి సూచిస్తారు.? ఆస్థాయిపేరు. (3)
17.వాయువ్యాపన వేగానికీ సాంద్రతకూ ఉన్న సంబంధాన్ని సూత్రీకరించిన శాస్త్రవేత్త (3) ( కిందనుండి పైకి)
***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *