June 24, 2024

మాలిక పత్రిక ఫిబ్రవరి 2020 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head కొత్త సంవత్సరం వచ్చింది అప్పుడే నెల గడచిపోయింది. ఈ కాలానికి ఎందుకో అంత తొందర. ఇంత వేగంగా పరిగెడుతూ ఉంటుంది. కాలంతోపాటు మనమూ పరిగెత్తక తప్పదు మరి.. అప్పుడప్పుడు లైఫ్ బోర్ అనిపించినా ఏదో ఒక పని కాని, సంఘటన కాని, వ్యక్తి వల్ల కాని మళ్లీ జనజీవన స్రవంతిలో పడతాం. తప్పదు మరి.. ఈ నెలలో మన్నెం శారదగారి సీరియల్ చీకటి మూసిన ఏకాంతం ముగుస్తోంది. వచ్చేనెల […]

మనిషిలోని భిన్నస్వభావాలను బహిర్గతపరచిన కవితావల్లరి.

రచన: సి. ఉమాదేవి మనిషి అనగానే మానవత్వానికి చిరునామా అని అర్థం చేసుకోవాల్సిన సమాజంలో మనిషి దొంగ అని కవిత్వీకరించి మనుషులలోని భిన్న స్వభావాలను బహిర్గతపరచి మనసును ఆలోచనలతో కుదిపిన కవి మొవ్వ రామకృష్ణగారు. వంద కవితలు రచించిన కవి తన మనసుననున్న భావాలను అక్షరబద్ధం చేసి సమాజతీరును పారదర్శకం చేసారు. ఆశలపల్లకి కవితలో ప్రతివాడికి ఆశ ఉంటుంది అది అత్యాశ కాకూడదని ప్రతిక్షణం తపన మాత్రమే నాకు మిగిలింది అని చెప్తూ కల్మషంలేని మనసు ఏ […]

రాజీపడిన బంధం – 2

రచన: ఉమాభారతి కోసూరి యేడాది తరువాత… ఢిల్లీ మహానగరంలోని ‘రీగల్ లయన్స్ క్లబ్’ వారి ఆవరణ కిక్కిరిసి ఉంది. మిరుమిట్లు గొలిపే జిలుగుల వెలుగులతో నిండి ఉంది ఆడిటోరియం. ‘క్లబ్ వార్షికోత్సవం’ లో భాగంగా ‘ప్రేమికుల రోజు’ – వేలంటైన్స్ డే’ సందర్భంగా “అందాల జంట” కాంటెస్ట్ జరుగుతుంది. ఆఖరి అంశం కూడా ముగిసి, విశ్రాంతి సమయంలో మ్యూజిక్ ప్రోగ్రాం జరుగుతుంది. ప్రతిష్టాత్మకమైన ఆ పోటీలో మాతో పాటుగా పాల్గొన్న యువజంటలన్నీ పోటీ ఫలితాల ప్రకటన కోసం […]

చీకటి మూసిన ఏకాంతం – 10

రచన: మన్నెం శారద సుభద్రా నర్సింగ్ హోం ఏ హడావుడులూ లేకుండా అతి నిరాడంబరంగా చిన్న పూజా కార్యక్రమంతో తెరిచింది నిశాంత. ఆ విషయాన్ని తల్లిదండ్రులకి గాని- సాగర్ కి కాని తెలియజేయలేదు. ఉన్న డబ్బుతో కావాల్సినంత వరకే ఎక్విప్మెంటు కొని నడపడం ప్రారంభించింది. ఇల్లూ, హాస్పిటల్ ఒకటే కావడం వలన ఆమెకి తిరిగే శ్రమ కూడ తప్పింది. సాగర్ మాత్రం ఆమె నంబరు తెలుసుకొని ఫోను చేసేడు. “సారీ నిశాంతా! నీకు మొహం చూపించే శక్తి […]

తపస్సు – ఒక నువ్వు.. మరొక నేను

రచన: రామా చంద్రమౌళి నడచి వెళ్ళిన ప్రతిసారీ పాదముద్రలేమీ మిగవు నడచి వచ్చిన దారికూడా జ్ఞాపకముండదు చూపున్నీ లక్ష్యాలపైనే ఉన్నపుడు ఇక వ్యూహాలే పన్నాగాలౌతాయి పాచికలు విసుర్తున్న ప్రతిసారీ అటు ఎదురుగా నీ ప్రత్యర్థీ.. ఇటు నీకు నువ్వే కనిపిస్తావు ఐతే.. కొన్ని విజయాలను అనుభవిస్తున్న దీర్ఘానుభవం తర్వాత కొన్ని ఓటములు విజయాలకన్నా మిన్నవని తోస్తుంది వెలుతురుకంటే చీకటి కూడా చాలా ముఖ్యమని నిద్రపోవాలనుకుంటున్నపుడు అర్థమౌతుంది ‘ లైట్లు ’ ఆర్పేయడం ఒక్కోసారి అనివార్య క్రియ- మనుషులంకదా.. […]

లా అండ్ ఆర్డర్

రచన: ధనికొండ రవిప్రసాద్ “ఈ రోజు కొత్త కేసు లేమన్నా వొచ్చాయా? అన్నాడు “యస్.ఐ. “ఇడుగోండి సర్ ! ఈడు బీచ్ లో స్నానాని కొచ్చిన ఇంగ్లీష్ అమ్మాయి మీద చెయ్యేశాడు. ఆమె కంప్లైంట్ ఇచ్చింది.” అంటూ ఒకణ్ని కాలర్ పట్టుకుని యస్.ఐ. ముందుకి తోశాడు కాన్స్టెబుల్. “ఏరా ! ఒళ్లు కొవ్వెక్కిందా? అమ్మాయిని చూస్తే నీకు తిమ్మిరెక్కుతుం దనుకుంటా.” అంటూ వాణ్ని జుట్టు పట్టుకుని మూడూపు లూపి “అలా ఎందుకు చేశావ్?” అన్నాడు యస్.ఐ. వాడు […]

అమ్మమ్మ – 10

రచన: గిరిజ పీసపాటి సంవత్సర కాలం గడిచింది. నాగ పరికిణీ, ఓణీల్లోకి ఎదిగింది. పెద్దబావ, చిన్నబావ వారి టెన్త్ క్లాస్ పూర్తి చేసుకుని రాముడువలస వెళ్ళిపోయారు. పెద్దబావ చదువులో పెద్దగా రాణించకపోవడం, ఏడ‌వ తరగతి చదువుతున్న సమయంలో ఇస్నోఫిలియా రావడంతో తన తమ్ముడితో కలిసి టెన్త్ క్లాస్ పూర్తి చేసాడు. రాముడువలస వెళ్ళాక ఇద్దరూ పియుసి చదవసాగారు. రెండు కుటుంబాల మధ్యా రాకపోకలు యధావిధిగా కొనసాగాయి. ఐదవ తరగతి వేసవి సెలవుల్లో ఒక్కసారి మాత్రమే రాముడువలస వెళ్ళిన […]

అనుకున్నదొక్కటీ. అయినది ఒక్కటీ…

రచన: మణి గోవిందరాజుల. కాంతం మనసు చాలా తృప్తిగా ఉంది ఆ రోజు. ముందు రోజు రాత్రి వెళ్ళి డెప్యుటేషన్ మీద వచ్చే పనమ్మాయి కూతురికి కొడుకు పుడితే ఆ బుడ్డోడికి మంచి బాబా సూట్ కోటీలో కాకుండా పెద్ద షాప్ కి వెళ్ళి కొనుక్కొచ్చింది. దానికి కారణం ఈ మధ్య వైరల్ అయిన ఒక మెసేజ్… మామూలుగా కూడా కాంతం దగ్గర చేస్తున్న పనమ్మాయి అయిదేళ్ళ నుండి వీళ్ళను వదలకుండా వీళ్ళు ఆమెని వదలకుండా చేస్తోంది. […]

గరుడ పురాణం

రచన: శారదాప్రసాద్ వేదవ్యాస మహర్షి రాసిన అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం కూడా ఒకటి. గరుడుడు(గరుత్మంతుడు)పక్షులకు రాజు. అంతేకాదు శ్రీ మహావిష్ణువు వాహనం కూడా!ఈ పురాణంలో అనేక కధలు కూడా ఉన్నాయి. ఇవి విష్ణువుకు, గరుడుడికి జరిగిన సంభాషణ రూపంలో ఉంటాయి. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతునికి ఒకసారి మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు? ఆ జీవుడికి ఏయే గతులు కలుగుతాయి. తదితర సందేహాలు కలిగాయట. వాటన్నింటికీ విష్ణువే సమాధానాలు చెప్పి, గరుడుని సందేహ నివృత్తి చేశాడట. గరుడుని […]