March 4, 2024

విశ్వపుత్రిక వీక్షణం – ఇండియా నుండి న్యూయార్క్ 20 నిముషాలలో

రచన: డా.విజయలక్ష్మీ పండిట్

”తేజా ఇటురా ఈ వీడియోలో ఇండియా నుండి న్యూయార్క్‌ ఇరవై నిముషాలలో, అని వ్రాసుంది చూడు” ఇది కరెక్టేనా దాదాపు 24 గంటల అమెరికా ప్రయాణమంటే విసుగొస్తుంది. మరి ఈ వీడియోలో అలా ఉందేంటి.. వీడియో మొదటనుండి చూడలేదు. ఇప్పుడే ఐపాడ్‌ ఓపన్‌ చేశాను” అని లక్ష్మి మనవడు తేజస్‌ను పిలిచింది.
తనకు టైమ్‌ చిక్కినపుడు మంచి వీడియోలు డాక్యుమెంటరీస్‌, సినిమాలు సెలక్టివ్‌గా చూస్తుంటుంది లక్ష్మి. లక్ష్మి ఎమ్‌.ఎస్‌.సి చదివి బాటని లెక్చరర్‌గా పనిచేసి ప్రొఫెసర్‌గా రిటైర్డ్‌ అయింది నాలుగు సంవత్సరాల ముందు.
”అది ట్రాన్స్‌పోర్టేషన్‌ అదే బహుశ భవిష్యత్‌లో ప్రయాణాల గురించిన వీడియో అయ్యుంటుంది అమ్మమ్మ. ఇలాతే ఐపాడ్‌ అని తీసుకును చూసి ఇది World In 2100 అనే వీడియో, 2100లో ప్రపంచం ఎలా ఉంటుందనే ఊహా (ఫిక్షన్‌) వీడియో అమ్మమ్మ. ఈ వీడియో చూడు ఇంట్రెస్టింగుగా ఉంటుంది. అంటూ తేజస్‌ ఐపాడ్‌ వాళ్ళ అమ్మమ్మ చేతికిస్తూ…,
”అమ్మమ్మ అమెరికాకు అర్ధగంటలో ఫాల్‌కన్‌ 9 రాకెట్లో ప్రయాణం చేయడానికి 2100 వరకు ఆగాల్సిన అవసరంలేదు. ఆ సౌకర్యం దగ్గరలోనే ఉంది. నేను మిమ్మల్నిద్దరిని తీసుకెళతాను ఆ రాకెట్లో అమెరికాకు. 2017 సెప్టెంబర్‌లో ఇలాన్‌ మస్క్‌ (Elon Mosk) అనే Space X కంపెని C.E.O. City to City travel by Rocket right here on Earth in 30 minutes” అని Falcon 9 Rockets ద్వారా భూమిమీద వున్న ఏ సిటీ నుండైన వేరే సిటీకి దాదాపు 20/30 నిముషాలలో చేరవచ్చనే ఒక పవర్‌ పాయింట్ ప్రెజెంటేషన్‌ చేశాడు. పదహారు ఫాల్‌కన్‌9 రాకెట్స్ ను ప్రదర్శించాడు.
సిటీల దగ్గరి సముద్రంపై నిర్మించిన రాకెట్ లాంచింగు పాడ్‌ నుండి ఈ ఫాల్క్‌న్‌9 రాకెట్స్ ను లాంచ్‌ చేస్తారు. గంటకు దాదాపు 14,000 కి.మీ. వేగంతో ప్రయాణించి ప్రయాణికులను గమ్యం చేర్చుతాయి. ఈ రాకెట్ లు పదిహేను అంతస్తుల బిల్డింగుల నిలువు స్థంబంలా రాకెట్ ఆకారంలో ఉండి అత్యంత వేగంగా గమ్యాన్ని చేర్చుతుంది. ప్రయాణం కర్చులు కూడా దాదాపు విమానంలో ప్రయాణం చేసే కర్చుకు దగ్గర తేవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి”, అని., నేను కాలేజ్‌కి వెళుతున్నా అమ్మమ్మ వచ్చిన తరువాత డిస్కస్‌ చేసుకుందాము ఆ వీడియో గురించి అని వెళ్ళిపోయాడు 18 ఏండ్ల మనవడు తేజస్‌.
*****
ఆ రోజు లక్ష్మి, భర్త రామచంద్ర, మనవడు తేజస్‌ అమెరికాకు ఫాల్క్‌న్‌9 రాకెట్ లో ప్రయాణం. ముగ్గురు అన్ని సర్దుకున్నారు. మొదట హైదరాబాద్‌ నుండి బాంబే వెళ్ళారు. అక్కడ సముద్రంలో స్టీమ్‌ బోట్స్ లో సముద్రంలో వుండే లాంచింగు పాడ్‌ వద్దకు తీసుకెళ్ళారు. ఆ రాకెట్ నిలువుగా లాంచింగు పాడ్‌మీద నిరుగా నిలబడి వుంది. ఫాల్‌కన్‌9 రాకెట్ లోకి ఎలివేటర్స్‌ ద్వారా లక్ష్మి, రామ్‌, తేజస్‌ లోపలికి వెళ్ళారు.
”హైదరాబాద్‌ నుండి ముంబయికి విమానంలో రావడం ఒకటిన్నర గంట / రెండుగంటలు పడితే ముంబాయి నుండి అమెరికా వెళ్ళడం అర్ధగంటలో అంటే ఇప్పుడెంత సులువైంది కదండీ అమెరికా ప్రయాణం” అని సంతోషపడింది లక్ష్మి. రాకెట్స్ రాకముందు దాదాపు 24 గంటలు విమానంలో కూర్చొని అమెరికా ప్రయాణమంటే విసుగొచ్చెది. ”ఇపుడు ఇండియాలో వేరే దేశానికి రాకెట్స్ లో మహా అంటే అరగంట, గంటలో వెళ్ళిపోవడం ఎంతో ఆనందించదగ్గ విషయం కదండీ అంటూ” లోపలికెళ్ళి కూర్చున్నారు ముగ్గురు. లోపల ఎవరి సీట్స్ వద్దకు వాళ్ళు వెళ్లడానికి అన్ని ఆధునిక సదుపాయాలు వున్నాయి. ఎలివేటర్స్‌లో. ముగ్గురు సర్దుకుని కూర్చున్నాక ఎయిర్‌హోస్టెస్‌ అనౌన్స్‌మెంట్ స్టార్ట్‌ అయింది. ”ఎంత అందంగా వుందీ అమ్మాయి” అనుకుని మరలా ఎయిర్‌ హోస్టెస్‌ను అనుమానంతో పరికించి చూసింది. చేతులు తిప్పుతూ సైగలతో ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇస్తూంది ఒక ఆడరోబో. ఇంతలో ఇంకో మగరోబో వచ్చి ”మేడమ్‌ ప్లీస్‌ లాక్‌ ది బెల్ట్‌” అని చెప్పి వెళ్ళిపోయింది.
”అంతా రోబోలే నడుపుతున్నాయా రాకెట్ ప్రయాణాన్ని” అంది లక్ష్మి.”మేము మరల బ్రతికుండగా ఈ రాకెట్ ప్రయాణాలు చూస్తామనుకోలేదు తేజ. ఎంత ఫాస్ట్‌గా టెక్నాలజీలు ప్రపంచాన్ని మార్చేస్తున్నాయో కదా”.అంది లక్ష్మి.
”ఆ రోజు 2100 నాటికి ప్రపంచం ఎలా వుంటుందో ఆ వీడియో చూస్తే ఎంత ఆశ్చర్యమేసిందని” లక్ష్మి చెపుతుండగా రాకెట్ లాంచ్‌ అవుతుందని అనౌన్స్‌మెంట్ చేశారు. విమానంలో స్థిరంగా వున్నట్టే అంత వేగంలో రాకెట్లో కూడా ఏదో ఒక డ్రాయింగు రూమ్‌లో కూర్చున్నట్టు స్థిరంగా వుందని అనిపించింది లక్ష్మికి.
”రాకెట్ ఎంత స్పీడ్‌లో పోతుంది” అని అడిగింది లక్ష్మి. విమానాలలో లాగే ఎదురుగా వీడియోలో టైమ్‌.. టు డేస్టినేషన్‌, స్పీడ్‌, టైం ఎట్ ముంబయి, టైమ్‌ ఎట్ న్యూయార్క్‌ అని డిస్‌ప్లె అవడం చూసింది లక్ష్మి. గంటకు 14,000 కి.మీ వేగమా అంటూ గుండెమీద చేయివేసుకుని.
”మా తరం కంటే మీ తరమే ఈ అద్భుతాలను చూసి ఆనందించి అనుభవిస్తారు తేజ” అంది.
”అవును అమ్మమ్మ ఇంకా భవిష్యత్‌లో మనుషుల అవసరాల కనుగుణంగా ఎన్ని మార్పులుంటాయని. నీవు ఆ వీడియో చూశావా. కంప్లీట్ గా” అడిగాడు తేజ లక్ష్మిని. ”ఆ చూశాను తేజా.. ఊహించని ఎన్నో ఆశ్చర్యం గొలిపే పెను మార్పులు రానున్నాయి తేజా”.
”అవును అమ్మమ్మ.., ”అండర్‌ వాటర్‌ సిటీస్‌” అంటే సముద్రం నీటి అడుగున పట్టణాలు, సముద్రంలో ”ప్లోటింగు సిటీస్‌” తేలాడే పట్టణాలు, ఒక కిలోమీటర్‌ ఎత్తుండే స్కై స్కాపర్స్‌ ((Sky Scrapers)) వాటి రూప్స్‌ మీద పచ్చగా గార్డెన్స్‌. 2100 నాటి కంటే ముందే వెలుస్తాయట. ఆ కాలానికి ఆ మార్పులు రావడంలో ఏమి అనుమానం లేదు. ఎందుకంటే టెక్నాలజీ అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ”ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌” A1, 5G కమ్యూనికేషన్‌ టెక్నాలజి ఈ మార్పులను దోహదం చేస్తాయి.
” తేజా ఆ వీడియోలో చూపిన నాకు ఇంకా ఆశ్చర్యకరమైన మార్పు లేవంటే, ఎడారులను అడవులుగా మార్చడం. ఆర్క్‌టిక్‌ ద్రువ మంచుప్రాంతాలను నివాస యోగ్యంగా మార్చడం. చంద్రునిపై ”మూన్‌కాలనీలు” మానవ ఆవాసాలు ఏర్పడడం” నివాసయోగ్యం కాని ఆ ఏడారులను, మంచు ప్రాంతాలను, చంద్రుడు, మార్స్‌ను ”అరుణగ్రహం”లో మానవుల ఆవాసాలు వెలుస్తాయని, మనిషిని పూర్తిగా స్కానర్‌ మెషిన్‌లో నిలబెట్టి స్కాన్‌ చేసి ఒక నిమిషంలో ఏమి జబ్బులున్నాయో కనుక్కోవడం చూపారు. నిజమేనంటావా?”
” ఆ మార్పులు వచ్చే అవకాశాలు వున్నాయి అమ్మమ్మ. ఆ కాలంలో ఆ మార్పులను మనము చూడకపోవచ్చు. కాని మానవ మేధకు అది సాధ్యమే. మనిషి తలపెట్టే ప్రతిమార్పు ఎంతో జాగ్రత్తగా ఇప్పటి ప్రజలను రాబోయో తరాల మనుషుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా చేయాల్సి వుంటుంది. వాతావరణంలో కూడా పొల్యుషన్‌ తగ్గించే విధానాలు రాబోతున్నాయి”.
”తేజా మరి విద్య, వ్యవసాయ, వస్తువుల మార్కెట్ దాదాపు అన్ని క్షేత్రాలలో పనిని వేగవంతంగా చేయడానికి రోబోలను తయారు చేస్తున్నారు కదా, ప్రజలపై వాటి ప్రభావం ఎలాగుంటుందో, ఎక్కువ జనాభా వుండే మన దేశంలో మనుషులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయేమో కదా.”
”కొంతవరకు జాబ్స్‌కు అవకాశాలు తగ్గుతాయి అలాగని కొత్త టెక్నాలజీలను తీసుకొని రాకుండా వుండలేరు కదా. పరిశ్రమలలో పెట్టుబడిదారులు తక్కువ కర్చుతో ఎక్కువ లాభాలవైపు దృష్టి పెడతారు, ఈ స్ట్రెకులు, లేబర్‌ కర్చులు అనుకుంటూ రోబోలపై ఆధారపడవచ్చు. కొన్ని రంగాలలో నష్టాలు లేకపోలేదు రోబోలతో, విద్యారంగంలో పిల్లలు, యువకులు ఎక్కువ A1, రోబోలపై ఆధారపడితే వారి మెదడులు పని చేయడం తగ్గిపోయి, ఆర్టిఫిషియల్‌ ఇంలిజెన్స్‌ (A1), రోబోలు మనుషులను నియంత్రించే ప్రమాదకర పరిస్థితులు కూడా పొంచివున్నాయి. ఏ క్రొత్త టెక్నాలజిని వాడుకలోకి తెస్తున్నా భవిష్యత్‌పై ఆ టెక్నాలజి వల్ల ప్రోస్‌ అండ్‌ కాన్స్‌, (లాభనష్టాలను) బేరీజు వేసుకుని ఎంతో జాగ్రత్తతో మార్కెట్ లోకి తీసుకునిరావాల్సి వుంటుంది”. అన్నాడు తేజ. లక్ష్మికి ఆ ప్రక్క విండో సీట్ లో కూర్చున రామ్‌ నిద్ర నుండి మేల్కొని ”ఏంటి అమ్మమ్మ మనవడు పెద్ద చర్చలో మునిగిపోయారు ఏమి చర్చ” అన్నాడు.
”మేము భవిష్యత్‌లోకి 2100 సంవత్సరంలోకి ప్రయాణించి వచ్చాము తాతా” అన్నాడు తేజస్‌.
”మాటలలో, ఊహలలో ప్రయాణమా? నిజంగా అయితే ”టైమ్‌ ట్రావెల్‌’ చేయాలి కదా” అన్నాడు రామ్‌.
అంతలో ఐదు నిముషాలలో ఫాల్‌కెన్‌-9 రాకెట్ న్యూయార్క్‌ లాంచ్‌పాండ్‌పై దిగుతుందని సీటుబెల్ట్స్‌ను వేసుకోమని అనౌన్స్‌మెంట్ వినిపించింది.
”మొదిసారి ఫాల్‌కన్‌ 9 రాకెట్ లో అర్ధగంటలో ఇండియా నుండి అమెరికాలో.., న్యూయార్క్‌లో దిగడం అనేది ఊహించని పెనుమార్పు మా జీవితంలో తేజా”. అంటూ సీటు బెల్ట్స్‌ సరిచేసుకుని కూర్చుంది లక్ష్మి.

”ఎంత అద్భుతంగా ఉంది కదా తేజస్‌ ఫాల్‌కన్‌9 రాకెట్ లో ముప్పై నిముషాలలో మనం ఇండియా నుండి అమెరికా చేరడం” అంటూ నిద్రలో ఏదో పలవరిస్తున్న భార్య లక్ష్మిని తట్టి లేపాడు రామచంద్ర.
”ఏంటి లక్ష్మి ఫాల్‌కన్‌ రాకెట్… అమెరికా ముప్పై నిముషాలలో ప్రయాణమంటూ కలవరిస్తున్నావు. కలలో రాకెట్ లో అమెరికాకు వెళ్ళివచ్చావా ఏంటి అంటూండగా”… లక్ష్మి మేలుకుని లేచి కూర్చుంటూ.. ఎంత బాగుందండి. నా కలలో ఫాల్క్‌న్‌9 రాకెట్ లో ఇండియా నుండి అమెరికాకు అర్ధగంటలో ప్రయాణం. ఆ ప్రయాణంలో నేను తేజస్‌ 2100 సంవత్సరానికి ప్రపంచంలో రాబోయో అద్భుతమైన మార్పుల గురించి మ్లాడుకుంటూ”.. అని మంచం దిగింది లక్ష్మి.
”నేను రాలేదా ఆ రాకెట్ లో మీతో అమెరికాకు” అంటూ నవ్వుతూ అన్నాడు రామ్‌.
”మీరు కూడా వచ్చారు. కాని విండో సీట్ ప్రక్కన కూర్చొని హాయిగా నిద్రపోయారు” అంటూ నవ్వుతూ బాత్‌రూమ్‌వైపు నడిచింది లక్ష్మి.

2 thoughts on “విశ్వపుత్రిక వీక్షణం – ఇండియా నుండి న్యూయార్క్ 20 నిముషాలలో

  1. ఆరోజెంతో దూరం లేదు లెండి..ఇవాళో రేపో అన్బట్టే పిల్లలు ప్రణాళిక లు వేసేసుకుంటున్నారు. మీరేమో ఏకంగా ప్రయాణం చేయించేసారు…!

  2. భవిష్యత్తుని అలా కళ్ళముందుకు తెచ్చేసారండీ.. అద్భుతంగా వుంది. నిజంగా అలా జరిగినట్టే వుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *