June 24, 2024

గరుడ పురాణం

రచన: శారదాప్రసాద్ వేదవ్యాస మహర్షి రాసిన అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం కూడా ఒకటి. గరుడుడు(గరుత్మంతుడు)పక్షులకు రాజు. అంతేకాదు శ్రీ మహావిష్ణువు వాహనం కూడా!ఈ పురాణంలో అనేక కధలు కూడా ఉన్నాయి. ఇవి విష్ణువుకు, గరుడుడికి జరిగిన సంభాషణ రూపంలో ఉంటాయి. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతునికి ఒకసారి మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు? ఆ జీవుడికి ఏయే గతులు కలుగుతాయి. తదితర సందేహాలు కలిగాయట. వాటన్నింటికీ విష్ణువే సమాధానాలు చెప్పి, గరుడుని సందేహ నివృత్తి చేశాడట. గరుడుని […]

తేనెలొలుకు తెలుగు – తెలుగు అంతర్జాల పత్రికలు

రచన: తుమ్మూరి రామ్మోహనరావు గతనెల తెలుగు ముద్రిత పత్రికలను గురించి ముచ్చటించుకున్నాం. దానికి కొనసాగింపుగాఈ నెల అంతర్జాల పత్రికల గురించి నాకు తెలిసిన నాలుగు మాటలు. మా చిన్నతనంలో స్విచ్చు వేయగానే లైటు వెలగటమే ఓ గొప్ప కింద భావించేవాళ్లం. దాని తరవాత రేడియో. గ్రామ్ ఫోన్ రికార్డ్, మైకు, ట్రాన్సిస్టర్, టెలిఫోన్ ఇలా ఒకటొకటి చూస్తూ ఆశ్చర్యపడే రోజులు. ఆకాశంలో విమానం శబ్దం వినపడగానే బయటికి వచ్చి ఆకాశంలో చిన్నగా కనిపించే విమానాన్ని చూస్తూ సంబరపడే […]

మహా భారతము నుండి ఏమి నేర్చుకోవచ్చు ?

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు. మహాభారతమును పంచమ వేదము అంటారు. అంటే వేదాలు మనకు అనేక విషయాలను తెలియజేస్తాయి. చాలా విషయాలకు వేదాలలో చెప్పబడ్డవే ప్రామాణికంగా ఈ నాటికి నిలుస్తున్నాయి. అలాగే మహాభారతము దాయాదుల పోరు అయినప్పటికీ రాజనీతి అనేక ధర్మసూక్ష్మాలు, వేదాంత విషయాలు, యుద్ధ తంత్రాలు మొదలైన అనేక విషయాలు విపులముగా చర్చింపబడ్డాయి. విదురుడు, భీష్ముడు లాంటివారు అనేక రాజనీతి సూత్రాలు వివరిస్తారు. దురదృష్టము ఏమిటి అంటే దృతరాష్ట్రుడు దుర్యోధనుడు లాంటి వారు పెడచెవిన బెట్టి […]

అనగనగా అక్కడ

రచన: వసంత శ్రీ అదో అటవీప్రాంతం. సమయం మధ్యాహ్నం మూడు గంటలకే బాగా చీకటి పడి బాగా మబ్బు పట్టి ఉంది వాతావరణం. చీకటి పడేలోపునే ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళాలనుకుంటారు ఆ చుట్టుపక్కల ప్రాంతాలవారు. సుమారుగా నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రాంతంలో కార్ రిపేర్ రావడంతో చిక్కుకుపోయాడు ఆనందరావు. అతను చాలా పెద్ద పరిశ్రమ నడుపుతున్న పారిశ్రామికవేత్త. సమయం= సంపాదన అనేంత. ఏం చెయ్యాలి ఇప్పుడు? నిజానికి ఇలాటి ఖాళీ సమయాన్ని జీవితంలో మరిచిపోయాడతాను. సంపాదనలో […]

కౌండిన్య కథలు – బద్రి

రచన: కౌండిన్య (రమేష్ కలవల) ఆ ఊరులో సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి పండుగ జరుపకోవడం ఓ ఆనవాయితి. ఆ ఇంటి ముందు ఎద్దులబండి ఆపి ఒకాయన లోపలకు వెళ్ళాడు. పెరట్లో మంగయ్య గారు ఒళ్ళంతా నూనె రాయించుకుంటూ, అటూ ఆయన రావడం చూసి, ఆ ధాన్యం బస్తాలను జాగ్రత్తగా లోపల పెట్టించమని కసురుతున్నారు. లోపల నుండి వచ్చిన ఇల్లాలు అది చూసి, “ఇదిగో ఈ సంవత్సరం కూడా పందాలతో వీటిని మట్టి కలిపావంటేనా చూడు మరి” అంటూ ఆ […]

సర్దుబాటు

రచన-డా. లక్ష్మీ రాఘవ “శారదా అయ్యిందా ?? కారు వచ్చేస్తుంది” శ్రీహరి తాళంచెవి తీసుకుంటూ.. “ఒక్క నిముషం…జానీ కి అన్నం వేసి, నీళ్ళు పెట్టాలి అంతే ..”అంటూ జానీ అనే తమ కుక్కకి కావాల్సినవి ముందు వరెండా లో ఒక మూల పెట్టి వెళ్లి చేతులు కడుక్కుని, టిఫిన్ డబ్బా పట్టుకుని బయటకు వచ్చింది శారద. శ్రీహరి వెంటనే తలుపులు మోసి లాక్ చేశాడు. ఇద్దరూ గేట్ వరకూ నడవగానే కాబ్ వచ్చింది. జానీ కి ‘టా…టా” […]

ఆమె

రచన: డా. తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం ఆ రోజు గురువారం . సాయిబాబా గుడిలో రోజుకన్నా భక్తుల సంఖ్య ఎక్కువగా వుంది . అందులోనూ ఆడవాళ్ళే అధికంగా వున్నారు. సాయంకాలం హారతి జరుగుతోంది . అందరూ నిలబడి భక్తి శ్రద్ధలతో సామూహిక భజనలో గొంతు కలిపారు. హారతి పూర్తి కాగానే కళ్ళకు అద్దుకుని ఇంటికి వెళ్ళడానికి బయలుదేరింది ఆమె . “ ఇదిగో ప్రసాదం తీసుకోండి.” అంటూ తను తెచ్చిన పాలకోవాల డబ్బాను ఆవిడ ముందు వుంచింది సావిత్రి. […]

అమ్మజోల

రచన: నాగజ్యోతి రావిపాటి అద్ధరాత్రి 12 గం అవుతున్నా నిద్రపోకుండా ఏడుస్తున్న పిల్లాడిని విసుకుంటూ పక్కగదిలోకి వెళ్లి పడుకున్నాడు శేఖర్. అనితకు ఏమి చేయాలో పాలుపోక ఫోన్లో ఇంగ్లీష్ లల్లబై పెట్టింది. కొద్దిసేపటికి నెమ్మదించిన కొడుకుని చూసి హమ్మయ్య అనుకొని పడుకోబెట్టి . . పాటని అలవాటు చేసిన తల్లి జయంతిని విసుక్కుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు తీర్థయాత్రలకని వెళ్లిన తల్లి ఫోన్ చేయగానే పిల్లాడిని నిద్రపుచ్చడానికి తను పడిన అవస్థలు చెప్తూ ఇంకా […]

*అమ్మ తత్వం*

రచన: లక్ష్మీ రాజశేఖరుని అమ్మ గొంతులో ఉందో, పాటలో ఉందో ఆ మధురిమ, లీనమై పోతుంటాను విన్న ప్రతిసారి ఆ లాలి పాటలో. ఎప్పుడు నిద్రలోకి జారుకునే వాడనో తెలియదు. అదే లాలి పాట మళ్లీ ఇప్పుడు నా కొడుకు కోసం అమ్మ పాడుతోంది. నాకంటే వాడే అదృష్టవంతుడు అనిపించిందో క్షణం. ఆ జ్ఞాపకాలు ఒకటొకటిగా బాల్యపు తలుపులు తడుతుంటే అప్రయత్నంగానే చిన్నతనంలోకి పరిగెడుతోంది మనసు. ప్రతి కొడుక్కి అమ్మ దేవతలా కనిపిస్తుంది. కానీ మా అమ్మ […]