February 22, 2024

తపస్సు – బొక్కెన

రచన: రామా చంద్రమౌళి

వృద్ధాశ్రమం కిటికీ అవతల వరండాలో కురిసే వెన్నెల
అక్కడక్కడా చెట్లు.. మౌనంగా .. నిశ్శబ్ద శృతి
తీగలు తెగిపోయిన తర్వాత రాగాలు చిట్లిపోయినట్టు
శబ్ద శకలాలు చిందరవందరగా
గోడపై మేకులకు వ్రేలాడ్తూ .. చిత్రపటాలౌతాయి
జ్ఞాపకాలూ , కన్నీళ్ళూ , ఎండుటాకుల సవ్వడులుగా
అన్నీ .. అడుగుజాడల వెంట
మట్టి చాళ్ళలో నీటి జలవలె జారుతూ. . పారుతూ
పిడికెడు గుండె వాకిట్లోకి
స ర్‌ ర్‌ ర్‌ ర్‌ న .. ఒక బొంగరాన్ని విసిరేస్తాయి
హృదయంపై ముల్లు గిరగిరా.. పొక్కిలి చేస్తూ
ఏదో మొన దిగుతూంటుంది లోపలికి తొలుచుకుంటూ
ఎర్రగా రక్తం .. ఏవీ .. రెండు బొట్ల కన్నీళ్ళు
గాలితుఫానులా తరుముకొస్తూండగా
ఆ రోజు రాత్రి . . మట్టి ప్రమిదల్లో మనం వెలిగించిన దీపాల పెనుగులాట
అటువేపేమో హోరుగాలి
ఇటువేపు .. నల్లని ఇంక్‌ లా .. కుమ్మరించబడ్తున్న చీకటి
నడుమ ఎర్రగా .. అప్పుడే జ్వలిస్తున్న గాయం
ఒక అగ్ని మొలక .. రక్తనేత్రం –
ఇంతకాలం .. దశాబ్దాలకు దశాబ్దాలుగా నడచివచ్చిన తర్వాత
వెంట ఎవరో ఉంటారనుకున్న భ్రమ .. ఒక తెగిన గాలిపటమై
ఒంటరి .. ఒంటరి అడుగు .. ఒంటరి ప్రయాణం .. ఒంటరి దుఃఖం
కమ్‌ .. హగ్‌ మీ
ఒక ఆర్ద్రమైన అగ్నిస్పర్శతో నన్ను దహిస్తూ దహిస్తూ హత్తుకో
కరిగి కరిగి .. కనలి కనలి
ఎర్రని నిప్పుకణికలపై కాలుతున్న మొక్కజొన్న కంకిలా
రోల్‌ .. రోల్‌ .. తిప్పబడి తిప్పబడి
లోపల ఉడికిపోతూ .. పైన అన్నీ నిప్పుమరకలు
హింసరా తండ్రీ .. జానెడు జాగా కోసం ,
రవ్వంత బంగారం కోసం .. బెత్తెడు మానం కోసం
స్తనాలపై విస్తరించాలని తపించే రెండు చేతుల దాహంకోసం
ఎన్ని ఖడ్గ ప్రహారాలో, ఎన్ని వ్యూహ విలాపాలో
గడీల్లో, కోటల్లో, దుర్గాల్లో , దుర్భేద్య శిలాప్రాంగణాల్లో
ఎలుగెత్తి ఎలుగెత్తి అరిచే ఆక్రందనలన్నీ
ఒట్టి .. మట్టిలో మరికొన్ని రేణువులే.. అశ్రుతుంపర
మనిషిలో దుమ్ములా.. దాగి దాగి దోబూచులాడే
ఒక శిశువు . . ఒక జంతువు . . ఒక దేవత
మనిషిలో వర్తులమై భ్రమించే ఋతుక్రీడ –
ఒక మోటబావినుండి తోలుతిత్తి గోళెంనీళ్ళను
మోసుకొస్తూ మోసుకొస్తూ .,
తాడు ఫటేళ్మని తెగిపోయిన తర్వాత
బావి ఎవరిదో.. మోట బొక్కెన ఎవరిదో.. నీరు ఎవరిదో
అసలు.. యుగయుగాలుగా అడుగును మోస్తున్న
ఈ భూమి ఎవరిదో –
*****
ఎదురుగా .. గిర గిరా తిరుగుతూ భూమిని తొలుస్తూ
బొంగరం ముల్లు,
ప్రక్కన తాడు .. నిశ్చలంగా .. నిసర్గంగా

A Pail

Translated by Indira Babbellapati

Beyond the window of
the old age home, showered
moonlight silently through
the trees scattered here and there.
As if the strings of the silent
Tanbura snapped after a
raga is rendered, the remnants
of silence hung on to
the nails on the walls in disarray
they become photos framed
to the rhythm of memories,
tears to the accompaniment
of falling-dry leaves, along
the footsteps they follow
like sliding water oozed
in muddy tracks. They
flow into the heart’s courtyard
and throw a top abruptly
on to the heart, a whirling
point penetrates into
the heart, burrowing it, blood!
Where? Two drops of tears
come racing like a hurricane,
the two wicks we
lighted in those clay-lamps
struggle against the violent winds,
one side is the wind and on
the other black-on-black night
in between is the redness of
the fresh wound like just sprouted fire.
Blood-shot eye, all these days,
for decade after decade, having walked
and walked, there overpowers an illusion
of an unknown entity, follows me.
Lonesome like a kite snapped,
taking steps all alone, a
solitary journey, solitary sorrow,
come, hug me!
Ignite me with your fiery touch of compassion,
let me melt and melt, roll me
as if I were a corncob placed on
live charcoals. I roast from within.
Visible marks of coal all over me,
can’t bear this torture, oh God,
for a bit of space, for a speck of gold,
for a palm-full of femininity
for the yearning of those two hands
to spread on her bosom to quench their thirst.
How many are the sorrowful
lamentations, strategies from those
inaccessible forts, gadis,
and the maze of circular structures!
Everything is mere dust,
particles of dust, drizzle of
tears. Like dust within, they
all remain hidden and play
hide and seek like a child.
Like an animal, an angel at
her sex-play. When a pail
drawing water from the well
snaps in the middle, the question is,
To whom the well belongs,
Whose pail is it?
Who owns the water?
Ultimately, to whom does
this earth belong enduring the onus
of endless footsteps for eons?
~ ~ ~
Right in front of me is
the violently revolving top
its point burrowing deeper and
deeper into the unfathomable
depths of the earth.
The rope lies steady and phlegmatic
beside me.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *