April 25, 2024

విశ్వపుత్రిక వీక్షణం – “ఆకాశం నీ సొంతం”

రచన: డా. విజయలక్ష్మీ పండిట్

ఓ ప్రకృతీ ..స్త్రీ..ఆకాశంలో సగమా..!
నీవు నీ ఇంట్లో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా
నీవు బాధ్యత నెరిగిన నిజమయిన
కూతురువి తల్లివి ఇల్లాలివి,

నీ పసి బిడ్డల ఆనందాన్ని నీవు
పూర్తిగా అనుభవించ లేకపోవచ్చు
నీ ఇంటిని అలంకరించలేక పోవచ్చు
కానీ నీ జీవితాన్ని గౌరవంగా అందంగా
మలుచుకుంటున్న నీవే నీ జీవితశిల్పివి,

ఆర్థికంగా నీకు నీవే నీ ఆలంబనై
నీ జీవిత భాగస్వామి ప్రియసఖివై
కాలంతో పాటు ఎరుకతో నడుస్తూ
నీ పిల్లలను చేయి పట్టి నడిపిస్తూన్న
నీవు ఎప్పుడూ ధీర వనితవే విజేతవే,

నీకు నీవే అధికారివి మార్గదర్శివి
స్వేఛ్చ ఒకరిస్తే వచ్చేదికాదు సుమా..!
నీకు నీవు స్వేచ్ఛా రెక్కలు తొడుక్కో
అవకాశాలను అంది పుచ్చుకో
ఇక ఆకాశమే నీ సొంతం కాదా?!

2 thoughts on “విశ్వపుత్రిక వీక్షణం – “ఆకాశం నీ సొంతం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *