May 29, 2022

ప్రయత్నం

రచన: రమ శేషు “మామయ్యా, మామయ్యా,” బైట నుండి పిలుస్తూ గేట్ తీసుకుని హాల్ లోకి వచ్చాడు హర్ష. “ఏంటిరా హడా‌వుడి, అమ్మ ఏమైనా కబురు చెప్పమందా!” అనడుగుతూ గది లోంచి హాల్ లోకి వచ్చాడు శేఖర్, హర్ష మామయ్య. “ఏమయ్యా, ఇదేనా రావడం, వదిన బాగుందా” అంటూ మంచినీళ్ళు ఇచ్చింది శేఖర్ భార్య లక్ష్మి. “బాగుంది అత్తయ్యా. మిమ్మల్నందరినీ అడిగానని చెప్పమంది.” అన్నాడు హర్ష మంచినీళ్ళు తాగుతూ. “కబుర్లకేం గానీ, కాఫీ పట్రా, ఎప్పుడు బైల్దేరాడో […]

ఆఖరి కోరిక

రచన: లక్ష్మీ రాజశేఖరుని తన బ్రతుకుకి మిగిలిన చివరి రాత్రి. తెల్లార కూడదని ప్రతిక్షణం తలచుకుంటూ బ్రతికిన రాత్రి. తెల్లారితే తన బ్రతుకు తెల్లారి పోయే రాత్రి. ఇంకా కొద్ది గంటలు మాత్రమే తనకు మిగిలి ఉన్నాయి. అమ్మ గుర్తొచ్చింది. పిచ్చిదానిలా ఎన్ని సంవత్సరాలు కోర్టుల చుట్టూ జైలు చుట్టూ తిరిగింది. కనీసం జైల్లో అయినా ప్రాణాలతో ఉంటే చాలు అనుకుంది. శిక్ష ఖరారు అయిన రోజు అందరి కాళ్ళు పట్టుకుని బతిమిలాడింది. ఛీ! ఎలాంటి అమ్మకి […]

మారిపోయెరా కాలం

డా. కె. మీరాబాయి ముందుగా ఒక మాటకూడా చెప్పకుండా సెలవు పెట్టి వచ్చిన కొడుకును చూసి ఆశ్చర్య పోయింది భారతి. పోయిన నెలలోనే బెంగుళూరు వెళ్ళి కొడుకు ఇంట్లో పదిహేను రోజులు వుండి వచ్చింది. ముప్ఫై అయిదేళ్ళు దాటుతున్నా పెళ్ళి కాని కొడుకు పరిస్థితి తలచుకుంటే భారతికి దిగులుగా వుంటుంది. ఒక అచ్చటా ముచ్చటా లేదు…..పండుగా పబ్బమూ లేదు. పొద్దున్నే ఆ ఎం ఎన్ సి కంపెనీకి పోవడం రాత్రికి వరకు పనిచేసి గూడు చేరడం గానుగెద్దు […]

అమ్మమ్మ అనుభవం

రచన: యశస్వీ రచన “అమ్మా జానకీ !!! నువ్వు, అల్లుడుగారు పిల్లాడిని రాష్ట్రం దాటించి చదివించాలని అనుకుంటున్నారట, , మీ నాన్నగారు అన్నారు. , నిజమేనా!?” అని ఆయాసంగా తన కూతురుని అడిగింది రత్నమాల. “అమ్మా!! ముందు నువ్వు ఆ కర్రల సంచి నా చేతికి ఇచ్చి, ఇలా సోఫాలో కూర్చో!! ” అంటూ జానకి ఆ సంచి తీసుకుని పక్కన పెట్టి, వంట గది నుండి చల్లటి కడవ నీళ్లు తీసుకువచ్చి తల్లి చేతిలో పెడుతూ. […]

నా బంగారు తల్లి

రచన : సోమ సుధేష్ణ “అమ్మకు వంట్లో బాగాలేదు, నిన్ను చూడాలంటుంది. ఒకసారి వచ్చి వెళ్ళు.” బెంగుళూరు నుండి తండ్రి ఫోనులో చెప్పినప్పుడు సుజన మనసులో అలజడి అనిపించింది. “ఏమయింది? అసలు ప్రాబ్లమేమిటి? డాక్టరు చూసాడా?” “రఘువర్మ చూస్తున్నాడు. ఒవేరియన్ కేన్సర్ అని డయగ్నోజ్ చేసారు. ట్రీట్ మెంటు ఇస్తున్నాడు.” “ఎప్పుడు తెలిసింది? రఘువర్మ అంకుల్ బెస్ట్ కేన్సర్ స్పెషలిస్టు.” “నువ్వు ప్రేగ్నెంటు అని చెప్పినపుడు నీకు సాయం అవుతుందని తను అమెరికాకు రావాలనుకుంది. వచ్చే ముందు […]

తెలంగాణా జిల్లాలోని శ్రీరంగం యాత్ర

రచన: రమా భాగి దీపావళి ఐనవెంటనే ఆ హడావిడికి కొంచెం విశ్రాంతిగా , కార్తీక దామోదరుడికి పెట్టె దీపాలకోసం ఈ సారి భగవంతుడి దర్శనానికి ఏదైనా చూడని ప్రదేశాన్ని చూడాలి అనుకుని ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను. మా పెద్దాడపడచు కోడలు నేను కలిసి కార్తీక వన విహారంగా పెంబర్తి దగ్గరున్న శ్రీ రంగాపూర్లో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాధుడి దర్శనం చేసుకున్నాము. గుడి పరిసరాలు అద్భుతంగా ఉన్నాయి చుట్టూ పెద్ద పెద్ద చెరువులు , […]

తేనెలొలుకు తెలుగు

తెలుగులో కొన్ని ప్రసిద్ధ వాక్యాలు భాష ఒక సముద్రం. దూరం నుంచి చూస్తే అది ఒక జలాశయమనిపించినా తరచి చూసిన కొలది అపార నిధులు కనిపిస్తాయి. అది విశాలమైనది, లోతైనది, గంభీరమైనది కూడా. మనకు మన పురాణాల్లో లక్ష్మి, చంద్రుడు, కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, ఉచ్ఛైశ్రవము, రత్నమాణిక్యాలు, ముత్యాలు, పగడాలు ఆఖరుకు అమృతం కూడా సముద్రం నుండి లభించినట్లుగానే చదువుకున్నాం. కనుక భాష అనే సముద్రం నుండి కూడా తరచి చూచిన కొద్దీ అనేక విషయాలు తెలుస్తాయి. […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 45

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య జీవుడి ప్రాణాన్ని ఒక పక్షిలా..చిలుకలా..హంసలా భావించి తత్త్వాలు చెప్పడం మనకు చాలా కాలంగా ఉన్న ఆచారమే! ఇది ఒక తత్త్వప్రబోధకమైన కీర్తన. వీటిని తెలుగుదేశంలో తత్త్వాలు అని పొట్టిపేరు గట్టిగా ప్రచారంలో ఉంది. ఐతే ఇప్పటి యువతరానికి ఆమాటకొస్తే జనబాహుళ్యానికి తత్త్వము అంటే అర్ధం తెలియదు తత్త్వాలు అంటే అంతకంటే తెలియదు. అన్నమయ్య ఆత్మ పరమాత్మల గురించి “చిలుక” అనే భావంతో మనకు తత్త్వబోధ చేస్తున్నాడు. కీర్తనలోని యధాతధ అర్ధంకన్నా గూడార్ధాలే ఇందులో […]

తపస్సు – బొక్కెన

రచన: రామా చంద్రమౌళి వృద్ధాశ్రమం కిటికీ అవతల వరండాలో కురిసే వెన్నెల అక్కడక్కడా చెట్లు.. మౌనంగా .. నిశ్శబ్ద శృతి తీగలు తెగిపోయిన తర్వాత రాగాలు చిట్లిపోయినట్టు శబ్ద శకలాలు చిందరవందరగా గోడపై మేకులకు వ్రేలాడ్తూ .. చిత్రపటాలౌతాయి జ్ఞాపకాలూ , కన్నీళ్ళూ , ఎండుటాకుల సవ్వడులుగా అన్నీ .. అడుగుజాడల వెంట మట్టి చాళ్ళలో నీటి జలవలె జారుతూ. . పారుతూ పిడికెడు గుండె వాకిట్లోకి స ర్‌ ర్‌ ర్‌ ర్‌ న .. […]