April 25, 2024

అమ్మకేదిగది?

రచన: ఉమాదేవి కల్వకోట అందమైన ఇల్లది…ఆడంబరంగా జరుగుతోందక్కడ గృహప్రవేశం. విచ్చేసారెందరో అభిమానంగా…ఆహ్వానిస్తున్నారు అతిథులనెంతో ఆదరంగా. అతిథుల కోలాహలం.. యజమానుల ముఖాల్లో ఉల్లాసం. ఇల్లంతా చూపిస్తున్నారందరికీ ఎంతో సంబరంగా. అతిథులు కూర్చునేందుకు ముందొక గది. ఇంటిల్లిపాదీ టీ.వీ.చూస్తూ, సరదాగా కబుర్లు చెప్పుకునేందుకొక పొడవైన గది. అందమైన బల్లతో, కుర్చీలతో అన్నాల గది. ఆధునిక సదుపాయాలతో అందమైన వంటగది. భార్యాభర్తలది పొందికైన పెద్ద పడకగది. ఎప్పుడయినావచ్చే చుట్టాలకొరకు అన్ని సదుపాయాలతో ఉన్న చుట్టాలగది. అయిదేళ్ళ పసిదానికీ ఉందొక ప్రత్యేకమైన గది. […]

మనసు

రచన: వై.కె.సంధ్యశర్మ ఏమయ్యిందో ఈ మనసుకు ఎంత పిలిచినా పలకడం లేదు రెక్కలొచ్చి ఎగిరే పక్షిలా… పచ్చని చేలకు పంటనవ్వాలని పసిపాపాయి నవ్వులా పాల నురుగలా తేలిపోతోంటుంది ఏమయ్యిందో ఈ మనసుకు ఎంత పిలిచినా పలకడం లేదు కనపడని కన్నీటి ధారకు అడ్డుపడాలని ఆశగా ఆశల నిచ్చెనను ఎరగా వేస్తూ బంధాల తాయిలాలను రుచి చూడమంటోంది! ఏమయిందో ఈ మనసుకు ఎంత పిలిచినా పలకడం లేదు ఆకాశపు పందిరిలోని మెరుపు గీతలను అక్కున చేర్చుకుని చీకటిని చిటికెలో […]

అతనెవడు?

రచన: పారనంది శాంతకుమారి అందంగా నువ్వు పెట్టుకున్నబొట్టును అర్ధాంతరంగా తుడిచివేయ మనటానికి అతనెవడు? అలంకరణకై నువ్వు తొడుక్కున్నగాజులను ఆ క్షణంనుంచి పగలగొట్టటానికి అతనెవడు? పెళ్ళిలోకట్టిన మంగళసూత్రాన్ని పెడమార్గంలో త్రెంచివేయటానికి అతనెవడు? అర్ధంలేని ఆచారాలను అతివపై బలవంతంగా రుద్దటానికి అతనెవడు? మగవాని మోదానికి మూలమైన మగువను మూల కూర్చోమనటానికి అతనెవడు? స్త్రీ ఆహారంపై,ఆహార్యంపై అతిశయంతో ఆంక్షలు పెట్టటానికి అతనెవడు? పడతి పద్దతిపై,ఉద్ధతిపై కరుణలేని కాంక్షలు తెలియచేయటానికి అతనెవడు? వనిత విధానాలపై అతనికున్న హక్కేమిటి? నెలత నినాదాలపై అతనికున్న టెక్కేమిటి? […]