April 20, 2024

మాలిక పత్రిక ఏప్రిల్ 2020 సంచికకు స్వాగతం

    Jyothivalaboju Chief Editor and Content Head పాఠక మిత్రులకు, రచయితలకు నమస్కారాలు. ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా మూలంగా తీవ్ర సంక్షోభంలో పడింది. పది రోజులుగా మనమంతా ఇంటికే పరిమితమయ్యాము. సాఫ్ట్ వేర్ వాళ్లు ఇంటినుండి వర్క్ చేసుకుంటున్నారు కాని ఇతర వ్యాపార, ఉద్యోగాల వాళ్లకు చాలా నష్టం… ఇక పిల్లలను గడప దాటకుండా కాపలా కాయడం, ఇంట్లోనివాళ్లకు అడిగినవి వండి పెట్టడం. పనిమనిషి డ్యూటీ అదనంగా ప్రతీ ఇల్లాలు చాలా తిప్పలు […]

చంద్రోదయం 2.

రచన: మన్నెం శారద సారధి ఎలమంచిలి నుంచి ఎంప్లాయిమెంటు కార్డు రెన్యూయల్‌కి వచ్చేడు. ఎంప్లాయిమెంటు ఎక్స్‌చేంజి సంతర్పన జరుగుతున్న ప్రదేశంలా వుంది. క్యూ కొల్లేటి చాంతాడులా వుంది. నిజానికి అక్కడ వుద్యోగాలు పంచి పెట్టడం లేదు. ఉద్యోగం రావడానికి యింకా అర్హతుందంటూ ఆశ పెడుతున్నారు. ఆ అర్హత కాపాడుకోడానికి దేశం నలుమూలలనుంచి యువతరం కదిలి వచ్చి కిటికీల దగ్గర పడిగాపులు పడుతున్నారు. సారధి పేరు సాయంత్రం దాకా వచ్చేట్టు లేదు. ఇంతలో ఆఫీసువారికి లంచ్ టైమైంది. కౌంటరు […]

రాజీపడిన బంధం .. 4

రచన: ఉమాభారతి ఇవాళ ఆదివారం అవడంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు.. పొద్దుటే సందడిగా ఇంటి వెనుకనున్న పోర్టికోలో స్టవ్ పెట్టించి దోసెలు వేసి వడ్డించారు అత్తమ్మ. తరువాత మార్కెట్టుకి వెళ్లి శ్యాం స్వయంగా తనకి కావాల్సిన కూరలవీ తెచ్చి దగ్గరుండి వండించారు. మధ్యాహ్నం భోజనం అయ్యాక అందరూ కాస్త నడుం వాల్చారు. బాబుని నిద్రపుచ్చాక వాడి గదిలోనే క్రిబ్బులో వేసి, ఎదురు గదిలో పేపర్ చదువుతున్న శ్యాం వద్దకు వెళ్లాను. “రాత్రంతా బాబు కడుపునొప్పితో బాధపడ్డాడు. ఇప్పుడే […]

అమ్మమ్మ – 12.

రచన: గిరిజ పీసపాటి స్పృహ తప్పిన తాతయ్యను అతి కష్టం మీద విజయవాడ నుండి టాక్సీలో తెనాలి తీసుకువచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉండడంతో ఒక్కసారిగా నిస్పృహగా అరుగు మీదే కూలబడిపోయారు పాతూరి రామకృష్ణ మూర్తి గారు. తరువాత తెలివి తెచ్చుకుని అమ్మమ్మ, నాగ ఎక్కడికి వెళ్ళారని ఆరా తీయగా ఊరిలోనే ఉంటున్న చుట్టాలింటికి వెళ్ళారని తెలిసి, పెద్దన్నయ్య ఆఫీసులో ఉండడంతో, వాళ్ళ అమ్మగారికి తాతయ్యను తను వచ్చేవరకు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి, వేరేవాళ్ళని డాక్టర్ నమశ్శివయ్య […]

జలజం.. కరోనా – “కరో”నా.. క”రోనా”

రచన: గిరిజారాణి కలవల ” జలజం.. ఏమోయ్. జలజం.. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయే. వంటింట్లోంచి చుయ్ చుయ్ లు వినపడ్డం లేదూ! ఇంకా వంట మొదలెట్టలేదా?” జలజాపతి పొట్ట నిమురుకుంటూ హాల్లో నుంచి బెడ్ రూమ్ లోకి వచ్చాడు. బెడ్ షీట్లు మారుస్తున్న జలజం. దుప్పటి అక్కడ విసిరికొట్టి ఒక్కసారిగా గయ్ మంది.” చుయ్ చుయ్ లు వినపడ్డం లేదా? ఇప్పుడు టైమింకా పదయిందంతే.. గంట కితమేగా పొట్ట నిండుగా కట్టుపొంగలి లాగించారు.. అప్పుడే ఎలకలు పరిగెడుతున్నాయా? […]

నథింగ్ బట్ స్పెషల్

రచన: లక్ష్మీ చామర్తి ” మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ”, “త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ”. పాట వస్తోంది టీవీలో. ఒకప్పుడు ఈ పాట వింటే ఆడ జన్మ ఎత్తినందుకు ఎంతో గర్వంగా అనిపించేది. ఈ రోజు ఎందుకో చాలా చిరాగ్గా ఉంది. టీవీ ఆఫ్ చేసి బాల్కనీలోకి వచ్చింది స్ఫూర్తి. ఉతకాల్సిన బట్టల్ని మిషన్లో వేసి బయటకు చూస్తూ నిల్చుంది. ఎదురింటి బోర్డు సుహాసిని ఎంఏ పిహెచ్ డి లెక్చరర్, పక్కనే […]

సంధ్యాదీపం

రచన: లక్ష్మీ పద్మజ ‘‘ఒసేయ్‌ రంగీ ఆ కాగులో నీళ్ళుపోసి అంటించవే… అమ్మాయి వచ్చి స్నానం చేస్తుంది. ‘‘ఒరేయ్‌ కొండా వాకిళ్ళంతా శుభ్రంగా వూడ్పించు. అమెరికా నుండి వస్తున్న నా మనవరాలికి అంతా నీట్‌గా ఉండాలిరా. ఎన్నో ఏళ్ళ తర్వాత వస్తొంది నా తల్లి నన్ను వెతుక్కుంటూ. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను… మళ్ళీ ఇన్నాళ్లకు అదృష్టం కలిగింది. ఆ తర్వాత పై మేడ మీద గది శుభ్రం చేయించు అక్కడ ఏ.సి. అన్నీ పని చేస్తున్నయా లేదో […]

మనసుకు చికిత్స

రచన: లక్ష్మీ రాఘవ అక్క భారతి వచ్చిందని చాలా సంతోష౦గా వుంది మూర్తికి. ఒక వయసు తరువాత చిన్ననాటి బాంధవ్యాలు గానీ జ్ఞాపకాలు కానీ తలుచుకుంటూ వుంటే చాలా అపురూపంగా వుంటాయి. రెండు రోజులు ఎన్నో జ్ఞాపకాలను గుర్తుచేసుకుని మరీ ఆనందపడిపోయారు ఇద్దరూ ఆ వయసులో. అక్కా, తమ్ముళ్ళ ముచ్చట్లు వింటూ మురిసింది మూర్తి భార్య రాధ కూడా. భారతి వున్న వూరికి దగ్గరగా ట్రాన్స్ఫర్ అవగానే వెళ్లి భారతిని చూసి వచ్చాడు మూర్తి. అక్క కోడలు […]

జీవనయానం

రచన: మణి గోవిందరాజుల “నాన్నా! అమ్మ వున్నన్నాళ్ళూ మాకు ఓపికలున్నాయి . అక్కడికి వచ్చి వుండలేమని రాలేదు. పోనిలే ఇద్దరూ ఒకళ్ళకి ఒకళ్ళు వున్నారు కదా అని నేను మాట్లాడలేదు. . మన దురదృష్టం అమ్మ వున్నదున్నట్లుగా మాయమయింది. ”కళ్ళు తుడుచుకున్నాడు అశ్విన్. “ఇప్పుడు అమ్మలేదు. ఒక్కడివి యెంత ఇబ్బంది పడుతున్నావో అని మాకు యెంత బెంగగా వుంటుందొ తెలుసా?” కంఠం రుద్దమయింది. “ఇప్పుడు నాకు నేను చేసుకునే ఓపిక వుందిరా. అది కూడా తగ్గాక వస్తాను. […]

తప్పంటారా ?

రచన: డాక్టర్. కె. మీరాబాయి సరోజ కథనం :- బి ఎ ఆఖరి సంవత్సరంలో వున్న నేను, ఇంటర్మీడియేట్ తప్పి, ఆటో నడుపుకుంటున్న సందీప్ ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని కలలో కూడా వూహించలేదు. అందుకేనేమో ప్రేమ గుడ్డిది అంటారు. మేము వుండే హౌసింగ్ బోర్డ్ కాలనీ కి నేను చదివే కాలేజీ చాల దూరం. నాకు మోపేడ్ నడపడం వచ్చినా మా నాన్నది బండి కొనివ్వలేని ఆర్థిక పరిస్థితి. నన్ను ఇంతవరకు చదివించడమే గొప్ప విషయం. […]