March 29, 2024

ఓ పైశాచిక కరోనా!!!!!!

రచన: డి.ఉషారాణి

స్వదేశమును విడిచి విదేశమునకు వెళ్లినoదుకే
చావు కేకను అత్తరులా చల్లుకొని వచ్చారు
స్వదేశమును వీడినoదుకు పాపములా వచ్చిందే పైశాచిక కరోనా

విదేశీయుల పైశాచిక చేష్టలకు నిలువెత్తు సాక్ష్యం ఐతేనే
మానవుల ప్రాణాలను బలిగొనే కరోనా ఆవిర్భవించింది
మానవ మేధస్సుకు చిక్కని మహమ్మారి కరోన వైరస్

మానవ మేధస్సుకి సవాలును విసిరితేనే
కళ్ళముందు మనిషి ప్రాణాలను హరిస్తున్నది
చరిత్ర పుటల్లో మానవునికి ప్రశ్నగా నిలుస్తున్నదే కరోనా

మనిషి మనిషికి అడ్డుగోడలా అనుమాన చిచ్చు రేపితేనే
చిన్నిపాటి నిర్లక్ష్యం కుటుంబాన్ని మరణఛాయాల్లో నెట్టుతున్నది
మనిషి ఉనికిని స్మశానము వైపు తీసుకెళుతున్నదే కరోనా రక్కసి

మనిషిని మరణము వైపు నడిపే యమపాశం ఐతేనే
సమస్త మానవాళి మరణము వాకిట్లో రగిలిపోతున్నది
మనిషి స్వీయగృహనిర్భoదమే కరోనాను నాశనం చేసే ఆయుధం

ఆరోగ్య సూత్రాలతో అందరూ యుద్ధమును ప్రకటిస్తేనే
కూకటివేళ్ళతో కరోనా రక్కసీ వసివాడిపోయేది
శాస్త్రీయతను మదించే మందును కనుక్కున్నపుడే నశించును కరోనా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *