February 23, 2024

తపస్సు – కొన్ని ఖడ్గ ప్రహారాలు .. కొన్ని శిథిల శబ్దాలు

రచన: రామా చంద్రమౌళి

గాయపడ్డ గాలి రెక్కలను చాచి
వృక్షం నుంచి వృక్షానికి పునర్యానిస్తూ , స్ప్సర్శిస్తూ , సంభాషిస్తూ
ఒళ్ళు విరుచుకుంటున్న ఆకాశంలోకి అభిక్రమిస్తున్నపుడు
కాలమేమో మనుషుల కన్నీళ్ళను తుడుస్తూ తల్లిలా
ద్రవకాలమై, ద్రవధ్వనై, ద్రవాత్మయి,
చినుకులు చినుకులుగా సంగీత నక్షత్రాలను వర్షిస్తూ
అరణ్యాలపై, ఎడారులపై, సముద్రాలపై, పాటలను కురుస్తూ
వెళ్తూంటుంది .. తన కొంగు అంచులు జీరాడుతూండగా
సెకన్‌లో మిలియన్‌ వంతు
ఒక రసానుభూతి .. తన పూర్ణవెన్నెల రాత్రయి వికసిస్తూనే
చకచకా శతాబ్దాల చరిత్ర పుటల్లోనుండి
పాదముద్రలనూ, కొన్ని ఖడ్గ ప్రహార శిథి శబ్దాలనూ ,
కొన్ని దుఃఖాశ్రువులనూ .. కొన్ని కోటగోడల్లోని మృత గతస్మృతులనూ
కోట్లకొద్ది గాజుగోళీల్లా .. ఒక వరదై ముంచుకొస్తుంది పైకి
ఇటు తెల్లవారేదాకా స్తబ్దరతిలో అలసిపోయిన నగరాలు
ఇక నగ్నదేహాన్ని జలతారు కిరణాలతో కప్పుకుంటూండగా
అక్కడొక సముద్రం అటువేపు ఒత్తిగిళ్ళుతూంటుంది –

ఏ దేశ నగర ప్రాంగణాల్లోనైనా
అద్భుత భవనాలూ, సుందర విగ్రహాలూ, ఆశ్చర్యకర నిర్మాణాలూ ఉంటాయి
వాటిని మనుషులు విగ్రహాలై చూస్తూంటారు
భూమిపైనున్న భవనంతో పాటు భూమిలోని పునాదులను స్పహిస్తూ
ఎక్కడా .. ఆ నిర్మాణాలకు రాళ్ళెత్తిన
కూలీ ఉనికి మాత్రం లిఖించబడి ఉండదు
కాలం చెమట సముద్రాలను ఎప్పుడో తన్నుకుపోయింది
మిగిలినవన్నీ చరిత్రావశేషాల సాలెగూళ్ళు
గతమంతా దాడులు .. ఉల్లంఘనలు .. మోహవివశతల్లో పాదతాడనలు
రథచక్రాల విమోహమోహ గర్జనలు
భూమికోసమో, రసోద్దీప్త స్త్రీకోసమో .. యుద్ధాలు –
ప్రపంచీకరణో, స్థానికీకరణో
అడవులనూ, భూగర్భాలనూ, నభోద్ధత శీర్షాలనూ
ఉత్తరిస్తూ, ఉద్గమిస్తూ, మనిషి
చేతిలో ఖడ్గంతో అవనతుడైన తర్వాత
ఒకే ఒక స్ఫురణ, ఒకే ఒక సజీవ దృశ్య జ్వలన
నగరాలు నగరాలన్నీ ప్రవహిస్తూ ప్రవహిస్తూ
గ్రామాలు గ్రామాలుగా పరివర్తిస్తూ
పల్లెలు పల్లెలుగా .. తిరోగమిస్తూ ప్రజ్వలితమౌతూన్నట్టు
అంతిమంగా .. పురోగమనం తిరోగమన రూపంలో కూడా ఉంటుంది
అస్తమయం ఉదయానికి ముగింపుకాదు.. ఉదయానికి మరో ఉదయబీజమే –

Translated by Mydavolu Venkata Sesha Sathyanarayana

Some Slashes of Swords,
a Few Debris Sounds

The wounded wind, stretching out it’s wings,
gliding from tree to tree, touching tender leaves,
chatting with everything on the way,
speeding into the yawning yonder blue,
and here the time runs
like a mother wiping off the tears,
as liquid time, as liquid sound and as liquid soul
drop after the drop, showering melodies,
drenching the woods, deserts, oceans
with spilling songs.

While her sari frills brush the floor,
she feels ecstatic but well for just a jiffy!
Again she becomes a full-moon night,
keeps deluging the world
with a few erased footprints
from the time-worn brittle chronicles.
Some trailing sounds of slashing swords,
a long dribble of tears of sorrow
and many dead reminiscences
hidden behind the ruined fortresses,
those gushing streams soon become
bright, pellucid balls and roll along
waking up the slumbering naked urbanscape
under the maroon veil of morning Sun.
In any country, there exist tall, fabulous buildings,
lovely sculptures, wondrous structures,
before them we stand watching awestruck!
But never we find anywhere engraved
the names of those umpteen labourers
who carried the lime and stone to raise those ultimate edifices.
The sweat of time had long ago swept away the seas.
The remnants are mere cobwebs over the dusty relics.
The past is all a deafening cacophony
of blatant breaches, wild blitzkriegs
the thundering sounds of trampling garrisons,
and the grinding growls of Chariot wheels
for land or for women,
wars, wars and wars.
Be it globalisation or localization,
the humans slash their swords
at every known and unknown enemy
went besieging the woods,
the earth and the mountain ranges.
Now there’s only one thought,
one burning oeuvre.
The cities turning into villages,
and in turn into nameless settlements,
in an infernal retrogression
and in the end we realize that sometimes
progression appears in fact like a fast recession!
Yes, the dusk is not the end of a dawn,
but only another brighter dawn
a new beginning!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *