May 25, 2024

కంభంపాటి కథలు – పొలమారిన జ్ఞాపకం

రచన: రవీంద్ర కంభంపాటి ఆ రోజు రాజమండ్రిలో లోవరాజు గాడి ఫ్రెండొకడి స్వీటు షాపు ఓపినింగంట ..ఉదయాన్నే బయల్దేరదీసేడు లోవరాజు గాడు. ‘నీ ఫ్రెండెవడో కూడా నాకు తెలీదు , మళ్ళీ నేనెందుకురా బాబూ’ అంటే , ‘ఏమో ..ఎవరు చెప్పొచ్చేరు .. దార్లో నీకు ఏదైనా కధ దొరుకుతుందేమో ‘ అంటూ నవ్వేసరికి , ఇంక తప్పక బయల్దేరేను. ఊరు దాటి హైవే ఎక్కగానే ఉన్న వీర్రాజు హోటలు దగ్గిర ఆడి బండి ఆపి , […]

ఇంతేలే ఈ జీవితం

రచన: వసంతశ్రీ కావేరీ ఇంటి పనమ్మాయి వాళ్ళ స్వంత ఊరు వెళ్ళిపోతున్నాదట. అందుకని పని మానేసింది. కొత్త పనిమనిషిని పెట్టుకోవడం అంటే పని తర్ఫీదు ఇవ్వడం చాలా కష్టమైన పని అని ప్రతి ఆడవారికి తెలుసు. కావేరీ పాత పనమ్మాయి లక్ష్మి పొందిగ్గా, నిదానంగా చేస్తూ ఉండడంతో సుఖంగానే ఇన్ని రోజులూ గడిచిపోయాయి. తీరా సత్యవతిని పనిలో పెట్టుకున్నాక కథ మొదటికి వచ్చినట్లయింది.ఏ పల్లెటూరి నుంచి వచ్చిందో కానీ కొత్తగా సిటీలో అడుగుపెట్టిన సత్యవతికి బొత్తిగా ఫ్లాట్ […]

ఎందుకంటే….

రచన:అనుపమ పిళ్ళారిసెట్టి. ఓ చిరాకు….. కంటబడితే చిన్నగా చేయి విసురు…వెళ్ళిపొమ్మని కళ్లెర్ర చేసి చూపు….పట్టుదలగా నిలబడితే వ్యధతో చిన్నగా తిట్టు…పంపించేయాలని… ఎందుకంటే….వాడు ఓ బికారి! రోతతో కూడిన చూపు….రాక ఆలస్యం అయినందుకు మెత్తని మందలింపు…. భయపెట్టేటందుకు అమరిక గా ఓ ఆజ్ఞ…. పని కానిచ్చేటందుకు నొప్పించే భాష్యం… స్థానంలో ఉంచాలని ఎందుకంటే…… అతను ఓ పనివాడు! ఓ విచారణ….. పనితనం గురించి ఓ కృత్రిమ దిద్దుబాటు…గౌరవం నిలుపుకోవాలని విధిగా ఒప్పందం….పనులు పూర్తి కానిమ్మని ఓ చిన్న మెచ్చుకోలు….ప్రోత్సాహ […]

అక్షరపరిమళమందించిన పూలమనసులు

రచన: సి. ఉమాదేవి నండూరి సుందరీ నాగమణి బ్యాంక్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తూనే అక్షరఆర్తి నింపిన స్ఫూరినందుకుని విభిన్న అంశాలతో నవలలు, కథలు మనకందించడం ముదావహం. శాస్త్రీయసంగీతంలో ప్రవేశం వీరికున్న సంగీతాభిలాషను మనకు విశదపరుస్తుంది. గడినుడి ప్రహేళికలు వీరందించిన ఆటవిడుపులే. పూలమనసులు కథాసంపుటి వైవిధ్యభరితమైన కథాంశాలతో సమస్యలను స్పృశిస్తూనే పరిష్కారాన్ని సూచించడం రచయిత్రి మనసులోనున్న సామాజిక అవగాహనను ప్రస్ఫుటం చేస్తుంది. పిల్లలు విదేశాలకు వెళ్లినప్పుడు తల్లిదండ్రులను రమ్మని వారికి ఆ దేశంలోని ప్రదేశాలను చూపించాలని ఆశిస్తారు. […]

పనివారూ మీకు జోహార్లు

రచన: ఉమాదేవి కల్వకోట ఉదయాన్నే ఇల్లంతా ఒకటే గందరగోళం. అందరిలో అసహనం,అశాంతి…అయోమయం. ఒకరిపై ఒకరు చిరాకులూ పరాకులు…మాటల యుద్ధాలు. పనమ్మాయి రాకపోవడమే దీనంతటికీ కారణం. రెండురోజులుగా ఆమెకి జ్వరం. కరోనా భయంతో ఉంచారామెను దూరం. సామాజిక దూరం పాటించండంటూ టీవీల్లో ఒకటే హెచ్చరికలు. అందుకే కష్టమైనా ఆమెను కొన్నాళ్ళు రానీయరాదనే నిర్ణయం. పర్యవసానమే ఈ గందరగోళం. బాగున్నప్పుడు ఆమెను పట్టించుకున్నదెవరనీ! ఈ సామాజిక దూరం పనివాళ్ళకి ఈనాటిదా.. వీరిపట్ల జరుగుతున్న సామాజిక అన్యాయం మనమెరుగనిదా? ఇది తరతరాలుగా […]

తపస్సు – కొన్ని ఖడ్గ ప్రహారాలు .. కొన్ని శిథిల శబ్దాలు

రచన: రామా చంద్రమౌళి గాయపడ్డ గాలి రెక్కలను చాచి వృక్షం నుంచి వృక్షానికి పునర్యానిస్తూ , స్ప్సర్శిస్తూ , సంభాషిస్తూ ఒళ్ళు విరుచుకుంటున్న ఆకాశంలోకి అభిక్రమిస్తున్నపుడు కాలమేమో మనుషుల కన్నీళ్ళను తుడుస్తూ తల్లిలా ద్రవకాలమై, ద్రవధ్వనై, ద్రవాత్మయి, చినుకులు చినుకులుగా సంగీత నక్షత్రాలను వర్షిస్తూ అరణ్యాలపై, ఎడారులపై, సముద్రాలపై, పాటలను కురుస్తూ వెళ్తూంటుంది .. తన కొంగు అంచులు జీరాడుతూండగా సెకన్‌లో మిలియన్‌ వంతు ఒక రసానుభూతి .. తన పూర్ణవెన్నెల రాత్రయి వికసిస్తూనే చకచకా శతాబ్దాల […]

ఓ పైశాచిక కరోనా!!!!!!

రచన: డి.ఉషారాణి స్వదేశమును విడిచి విదేశమునకు వెళ్లినoదుకే చావు కేకను అత్తరులా చల్లుకొని వచ్చారు స్వదేశమును వీడినoదుకు పాపములా వచ్చిందే పైశాచిక కరోనా విదేశీయుల పైశాచిక చేష్టలకు నిలువెత్తు సాక్ష్యం ఐతేనే మానవుల ప్రాణాలను బలిగొనే కరోనా ఆవిర్భవించింది మానవ మేధస్సుకు చిక్కని మహమ్మారి కరోన వైరస్ మానవ మేధస్సుకి సవాలును విసిరితేనే కళ్ళముందు మనిషి ప్రాణాలను హరిస్తున్నది చరిత్ర పుటల్లో మానవునికి ప్రశ్నగా నిలుస్తున్నదే కరోనా మనిషి మనిషికి అడ్డుగోడలా అనుమాన చిచ్చు రేపితేనే చిన్నిపాటి […]

సహజ కథలు – మితం – హితం

రచన: శైలజ విస్సంశెట్టి అనూహ్య ఆనంద్ అప్పటికి ఒక గంట నుంచి వాదించుకుంటూనే ఉన్నారు. ఎవరి ఆలోచన వారికే కరెక్ట్. ఎవరి వాదన వారికి సరైనదిగా తోచటం, ఇద్దరూ ఒక మాటమీదకి రావటం అనేది అసాధ్యంగా ఉంది. వీళ్ళు వాదించుకుంటున్న విషయం ఇవాళ్టిది కాదు. గత నెలరోజులుగా సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వాదనకు తెర లెగుస్తోంది. ఇంటిపని గురించో, ఆఫీస్ పనిగురించో, స్నేహితుల గురించో లేదా మీ అమ్మనాన్న ఇలాగా అంటే మీ అమ్మ నాన్న అలాగా […]

గడిలోదాగిన వైజ్ఞానిక నుడి – 5

డా.(శ్రీమతి) చాగంటికృష్ణ కుమారి సూచనలు : అడ్డము : 1. మనం అద్దంముందు నిలబడినప్పుడు మనపై పడిన కాంతి ప్రాయాణించి అద్దపు దళసరి గాజు గుండా లోని కి ప్రవేశించినపుడు అక్కడి వెండిపూత ఆ కాంతిని మరి లోనికి వెళ్ళనీయక వెనకకు మళ్లిస్తుంది. వెండి పూత మళ్ళించిన కాంతి కిరణం పేరు (9) 5. పూజ చేసేటప్పుడు మొదటగా చెప్పుకొనే కేశవ నామాల లో మూడవది (3) వెనకనుండి ముందుకి. 6. తెలుసుకునేవాడు (2) 7. తుపాను […]