April 20, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 46

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య ఈ కీర్తనలో “త్రికరణశుద్దిగా చేసిన పనులకు..దేవుడు మెచ్చును లోకము మెచ్చును” అని హెచ్చరిస్తున్నాడు అన్నమాచార్యుడు. అసలు త్రికరణశుద్ధి అంటే ఏమిటి? త్రికరణాలు అంటే ఏమిటి? అవి 1.మనసా (మన ఆలోచన, సంకల్పం) 2.వాచా (వాక్కు ద్వారా, చెప్పినటువంటిది) 3.కర్మణా (కర్మ, చేతల ద్వారా) మనలో చాలామందికి మనస్సులో ఒక సంకల్పం ఉంటుంది. అది ఎదుటివారి మెప్పు కోసమో, లేక మన సంకల్పం బయల్పరచడం ఇష్టం లేకో, లేదా మరొక కారణం చేత అనుకున్నది […]

చేయదలచిన పనులు, చేయవలసిన పనులు

రచన: శారదాప్రసాద్ పూజ్యులు శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యుల గారిని గురించి ఆధ్యాత్మిక అభిరుచి ఉన్నవారికి పరిచేయనవసరం లేదనుకుంటాను. వారు నా చిన్నతనంలో గుంటూరు హిందూ కళాశాలలో ఆంద్ర, సంస్కృత అధ్యాపకులుగా పనిచేసారు. పిల్లలతో పిల్లవాడిగా చాలా సరదాగా ఉండేవారు. వారితో కలిసి నేను ‘మాయాబజార్’ సినిమా రాత్రి రెండో ఆటను చూడటం జరిగింది. ప్రతిసారీ ఆ సినిమాలోని ఏదో ఒక గొప్ప విషయం గురించి చెప్పేవారు. వారు హోమియో వైద్య నిపుణులు. వారి ఆధ్యాత్మిక ప్రసంగాలు విన […]

నాచారం నరసింహస్వామి గుడి

రచన: రమా శాండిల్య ఇవాళ ఉదయం లేస్తూనే ఏదైనా గుడికెళ్లాలనే కోరిక కానీ పిల్లలకు బోలెడన్ని పనులు .ఇద్దరికి వారి వారి కుటుంబాలతో పనులు నాకేమో ఎప్పటినుండో ( దగ్గర దగ్గర 8 సంవత్సరాల నుండి ) నాచారం నరసింహస్వామి గుట్ట అని వినడమే కానీ వెళ్ళడానికి అవలేదు . ఇవాళ్టి మూడ్ ఎలా అయినా గుడికెళ్లాలనుంది, నాతో పాటు ఎప్పుడైనా అడిగితే గుడికొచ్చే పంజాబీ స్నేహితురాలు ఉంది, తనకు ఫోన్ చేసాను . వెంటనే వస్తానని […]

తేనెలొలికే తెలుగు

రచన: తుమ్మూరి రామ్మోహనరావు ఏదైనా ఒక భాష రావాలంటే కేవలం వస్తువుల పేర్లో స్థలాల పేర్లో తెలిస్తే సరిపోదు. పేర్లనేవి కేవలం నామవాచకాల కిందికి వస్తాయి. పదాలు వాక్యరూపమయినప్పుడే మనం ఎదుటి వారికి మనం చెప్పదలచుకున్న విషయం చేరవేయగలం. సర్వసాధారణంగా వాక్యంలో కర్త కర్మ క్రియ అనేవి ఉంటాయి. ఉదాహరణ అందరు చెప్పే ప్రసిద్ధ వాక్యమే నేనూ చెప్తాను. రాముడు రావణుని చంపెను. ఇది అందరికీ బాగా తెలిసిన వాక్యం. ఇందులో రాముడు కర్త అనీ, రావణుడు […]

అర్జునుడు

రచన: శ్యామసుందరరావు మహాభారతం లోని అతిరధ మహారధులలో బాగా పేరు ప్రఖ్యాతులు గడించినవాడు కురుక్షేత్ర సంగ్రామములో కీలక పాత్ర వహించి సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుని ద్వారా గీతోపదేశము పొందినవాడు అర్జునుడు కుంతికి ఇంద్రుని వరము వల్ల జన్మించిన వాడు అర్జునుడు శ్రీకృష్ణుని సాంగ్యత ము వలన ఇద్దరి జోడి నర నారాయణులుగా ప్రసిద్ధి చెందింది అర్జునికి గురువు మార్గదర్శి నిర్దేశకుడు అన్ని శ్రీ కృష్ణ భగవానుడే అందుచేతనే కురుక్షేత్ర సంగ్రామానికి ముండు శ్రీ కృష్ణుడు అస్త్ర […]