June 24, 2024

తపస్సు – అరాచక స్వగతం ఒకటి

రచన: రామా చంద్రమౌళి

ఫిల్టర్‌ కాగితంలోనుండి
చిక్కని తైలద్రవం ఒకటి .. ఎంతకూ జారదు , స్థిరంగా నిలవదు
కల .. ఒక ఎండాకాలపు ఎడారి ఉప్పెన
అవినీతి వ్రేళ్లను వెదుక్కుంటూ .. తవ్వుకుంటూ తవ్వుకుంటూ
ఎక్కడో భూగర్భాంతరాళాల్లోకి అభిక్రమిస్తున్నపుడు
అన్నీ సుప్రీం కోర్ట్‌ ‘ సైలెన్స్‌ సైలెన్స్‌ ’ కర్రసుత్తి రోదనూ ,
విజిల్‌ బ్లోయర్స్‌ .. శబ్ద విస్ఫోటనలే
ఈ దేశపు ప్రథమ పౌరుని గురించి సరేగాని
అసలు ‘ అథమ ’ పౌరుడు ఎవరు అన్న అన్వేషణ.. ఒకటి
ముంబై జోంప్డీ పట్టీలో .. మురికిలో కూర్చుని మురికిని కడుక్కుంటున్న
ఆమె .. ఎవరో .. ఎర్రని ‘ లైఫ్‌ బాయ్‌ ’ కూలీ ( లైఫ్‌ గర్ల్‌ కాదు )
ఎర్రని ఘాటు.. ఎర్రని రక్తం .. ఎర్రని ప్రేమ .. ఎర్రని మరణం
అయ్యో రాత్రంతా వికారమైన కల
ఒంటిమీద అసలు బట్టలే లేకుండా .. నగరపు రోడ్లపై నడిరాత్రి
‘ స్ట్రీకింగ్‌ ’ .. న్యూడ్‌ ఈస్‌ ద బ్యూటీ.. న్యూడ్‌ ఈజ్‌ ద మార్కెట్‌
దృశ్యాలే నగ్నమౌతాయో .. నగ్నాలే దృశ్యాలౌతాయో కాని
కోర్ట్‌ ఎదుట .. వీడియో సాక్ష్యాలూ, స్వర నిరూపణలన్నీ
మార్ఫింగ్‌ లనీ, ‘ మార్పింగ్‌ ’ నీ రోతిరి వాదనలు
అన్నీ సిరమిక్‌ పెదవులు, అక్రిలిక్‌ పిరుదులే ఐనప్పుడు
కళ్లముందే కనిపిస్తున్నా ‘ సూర్యుడు ’ ఒక గ్రాఫిక్‌ అని వాదన
ఐతే రాత్రి జరిగిన ‘ రతిక్రియ ’ అంతా ఒట్టి భ్రాంతేనా –
తండ్రీ
రిజర్వాయర్‌ రెటైనింగ్‌ గోడకు తలలు బాదుకుంటున్న జల అలలు
ఎన్నటికైనా విముక్తి పొందుతాయా
ఒట్టి స్వాప్నికునివై
దృశ్యాలను వింటూ, శబ్దాలను కంటూ.,
అర్థరాత్రి నగరాల విగత రోడ్లపై.. ‘ పహరా హుషార్‌ ’ కర్ర చప్పుళ్ళ మధ్య
గాఢ నిద్రలో పార్లమెంట్‌ గోడలనిండా
రక్తాశ్రువు కారుతూంటే.. చేతులు అర్రులు చాచి
స్వాతంత్య్రానికీ విశృంఖలత్వానికీ మధ్య దూరమెంత అని ఒక ప్రశ్న
కాలము- దూరము , ఘాతాంకము న్యాయము .. ఒక విచికిత్స
కల్పవికల్పముల మీమాంస.. నేరమూ శిక్షా వేర్వేరు
‘ నేరస్తుందరూ శిక్షించబడరు ’ అని రాజ్యాంగ ఘోష
హలలూయా.. హలలూయా
‘ పాపులు క్షమించబడుదురు .. పాపులు రక్షించబడుదురు ’
చీడ పట్టిన పైరుకు క్రిమిసంహారక మందులు ఎంత అవసరమో
మోనోక్రోటాపాస్‌ ఘాటుగా, వెగటుగా .. విషతుల్యముగా ఉండునన్నది సత్యం
కాని ఈ తరానికి అగ్నిచికిత్స అత్యవసరం.. సుఁయ్‌ .. సుఁయ్‌ …
విలువలనూ, నీతినియమాలనూ, నైతికతనూ, పౌరస్పృహనూ కోల్పోతున్న
ఈ దేశ కోట్లకొలది చరిత్రహీన ప్రజలను
ఆరోగ్యపరిచే అసలు మందేది ..
భయమూ ప్రేమా లేని
ఈ తరం పిర్రపై వాతపెట్టగలిగే ఎర్రని కర్రేది –

 

 

An Anarchic Soliloquy

Translated by Indira Babbellapati

Thick greasy liquid in filter paper
neither flows nor stays stable.
A dream, a simoom in a summer desert,
the dream digging deeper and deeper,
yet the origins of corruption are found in vain!
As the dream enters the depths of
the earth’s womb, all we hear there are
the screams of the wooden hammer:
‘Silence, silence!’ Yes, that’s the supreme
Court of Law, along the screams are
the sound of explosions from the whistle-blowers.
Leave aside the first citizen, does anyone ever
attempt to explore who the inessential citizen might be?
Ah, who’s that coolie woman in that joparpatti in Mumbai?
She sits in muck surrounded by filth and washes herself
with red cake of Lifebuoy! Her surroundings are filled
with an acerbic red smell. Red blood crimson love and
blood-red death. Ah, this creepy dream through the night,
not a thread of clothing on the body, streaking across
the nightly streets of the city. Isn’t there beauty in nudity?
Nude are the markets too! Wonder if at all what we see
gets denuded or nudity dominates our vision? Further,
the Court area echoes with morphed voices of the witnesses.
Only ceramic lips and acrylic hips! After arguments and
counter arguments, the blazing sun is proved as
mere graphic! Is last night’s pleasure
of lovemaking mere illusion? Will the currents that bang their
heads against the retaining wall of the reservoir ever get liberated?
Hey, you’re a useless dreamer, loitering the lifeless midnight
roads of the city listening to the scenes around and gazing at the sounds
amid the pahara hushaar of vigorous batons in the deepest slumber.
Tears of blood stream down the walls of the Parliament, stretching
your hands in greed you ask, ‘What’s the distance between liberty
and lewdness?’ Time and distance, theory of indices, all a dilemma!
Crime and punishment are two different entities though the Constitution
may state loud and clear that,
All culprits will be punished!
Halleluiah! Halleluiah!
The sinners will be pardoned!
The sinners will be rescued!
An infected plant needs pesticide however toxic, pungent
and nauseating Monocrotophas might be. Similar is the need of
this generation, ‘fire-treatment’ is its dire need. The scorching fire
may burn the skin. The billions of the country’s population devoid of Values, ethical discipline, moral behaviour, responsibilities of being
a citizen, populace deprived of a history are in an emergency.
They need an urgent medical aid,
but where’s the right medicine?
The need of this generation is a hot iron rod to spank them!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *