March 28, 2024

కంచి కామాక్షి

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు .

కంచి కాంచీపురం, కాంజీవరం, వంటి పేర్లతో పిలిచే ఈ నగరం చారిత్రకంగా
ప్రసిద్ధి చెందిన పవిత్ర నగరాల్లో ఒకటి , కంచి లోని కామాక్షి అమ్మవారి
దేవాలయము అతి పురాతనమైనది ఎప్పటి నుంచి ఉన్నదో ఇదమిద్ధముగా
తెలియదు..జగద్గురు అది శంకరాచార్య ఈ దేవాలయములో శ్రీ చక్రాన్ని
ప్రతిష్టించారు..ఆర్కియాలజీ వారి లెక్కల ప్రకారము ఈ దేవాలయము 1600
ఏళ్ళనాటిది. అది శంకరాచార్యులవారు ప్రతిష్టించిన శ్రీ చక్రము 5 బీసీఈ
నుండి 8th బిసి మధ్యకాలం నాటిది అని చెప్పవచ్చు పల్లవ రాజులు ఈ
ప్రాంతాన్ని కాంచీపురం ను రాజధానిగా చేసుకొని పాలించారు.
“కామాక్షి” అనే పేరు మూడు పదాల కలయిక వల్ల ఏర్పడింది అవి కా,మా,అక్షి
అనే పదాలు కా అంటే సరస్వతి మా అంటే లక్ష్మి దేవి అక్షి అంటే కనులు.
కామాక్షి అమ్మవారి కనులు లక్ష్మి దేవి సరస్వతి .
దేవి కంచి లోని కామాక్షి అమ్మవారి దేవాలయము 51 శక్తి పీఠాలలో మహత్తు
కలిగినది సతీ దేవి శరీరము నుండి నాభి(శరీరానికి కేంద్ర బిందువు అయిన
బొడ్డు ) .పడిన చోటు కంచి. ఈ నాభిస్థానం భూమికి లేదా భూమి యొక్క తూర్పు
అర్ధభాగానికి కేంద్ర బిందువు వంటిది. .అమ్మవారు భండాసురుడు అనే
రాక్షసుడిని చంపటానికి ముందు ఈ దేవాలయములో కన్య రూపములో ఉన్నది ఈ
దేవాలయము లోని విగ్రహము ఎవరిచేత
ప్రతిష్టించబడలేదు అంటే స్వయంభూ అన్నమాట.
ఈ దేవాలయములో అమ్మవారు స్థూల ,సూక్ష్మ, శున్య అనే మూడు రూపాలలో ఉంటుంది.
పరమశివుని వివాహమాడటానికి కామాక్షి అమ్మవారు సూది మొనమీద ఒంటి కాలి మీద
నిలబడి తపస్సు చేసింది ఆవిడా తపస్సు ఫలించి శివుడిని ఫాల్గుణ మాసములో
ఉత్తర నక్షత్రములో వివాహ మాడింది. అందుచేతనే కామాక్షి అమ్మవారి బంగారు
ప్రతిమ ఉండేది ఆ బంగారు కామాక్షి ప్రతిమ తరువాతి కాలములో దాడుల ఫలితము గా
తంజావూరు మార్చబడింది. తంజావూరు లో ఇప్పటికి ఈ బంగారు ప్రతిమ ఉన్నది.
దూర్వాస మహాముని కంచిలో అమ్మవారి సన్నిధిలో తన శాప విమోచనకు తపస్సు
చేసాడు. అయన ఇక్కడ శ్రీ చక్రాన్ని ప్రతిష్టించాడు అక్కడే. అప్పుడు
సౌభాగ్య చింతామణి కల్ప స్తోత్రాన్ని రచించాడు. ఈ స్తోత్రాన్ని దుర్వాస
సంహిత అని కూడా అంటారు. ఈ స్త్రోత్రము లో కామాక్షి అమ్మవారిని పూజించే
విధి విధానాలను వివరించాడు. నేటికీ కామాక్షి అమ్మవారి పూజలు ఆ విధముగానే
జరుగు తున్నాయి. ఈ దేవాలయము లో 7 గోత్రాల వారు మాత్రమే పూజారులుగాఉంటారు.
వీరిని శాస్త్రి అంటారు ప్రస్తుతము 2 గోత్రాల వారు మాత్రమే కంచిలో
అమ్మవారి సేవలో ఉన్నారు. మిగిలిన వారు తంజావూరు కామాక్షి అమ్మవారి సేవలో
ఉన్నారు
మరొక కధనం ప్రకారము ఇక్కడి అమ్మవారు రౌద్ర అంటే కోపాన్ని ప్రదర్శించే
రూపము,ఆవిడ రౌద్రానికి ఫలితముగా గర్భ గుడి ఎప్పుడు వేడిగా ఉండేదిట..
తరువాతి కాలములో జద్గురు శంకరాచార్యుల వారు అమ్మవారిని శాంతింపజేశారు.
అప్పటినుండి అమ్మవారు కరుణామూర్తిగా దర్శనము ఇస్తున్నారు. ఈ
దేవాలయములోనే శంకరాచార్యులవారు అమ్మవారిని స్తుతిస్తూ సౌందర్య లహరిని
రచించారు. .మార్కండేయ పురాణము లో చెప్పబడినట్లుగా శ్రీరాముని తండ్రి అయిన
దశరధ మహారాజు ఇక్కడకు వచ్చి పుత్రకామేష్టి యజ్ఞము చేశాడని అంటారు ఈ
యజ్ఞము ఫలితముగానే ఆయనకు నలుగురు కుమారులు కలిగారు.
కామాక్షి అమ్మవారు ఇక్ష్వాకుల వంశానికి కులదేవత . ఆ నమ్మకంతోనే చాలా మంది
సంతానము లేనివారు ఇక్కడకు వచ్చి అమ్మవారిని ప్రార్ధిస్తారు. ఈ దేవాలయము
లో అమ్మవారు ఒక మూగవాడిని కరుణించి మాట్లాడేటట్లు చేసింది. ఆ మూగవాడు
మాటలు వచ్చిన వెంటనే
అమ్మవారిని స్తుతిస్తూ అసువుగాఁ 500 శ్లోకాలతో ఉన్నమూక పంచ శతి ని రచించాడు. .
ఈ దేవాలయములో కామాక్షి అమ్మవారి మూల విరాట్ గాయత్రి మండపము లో అమ్మవారి
విగ్రహము ,పద్మాసనము భంగిమలో కూర్చుని యోగ భంగిమలో ఉంటుంది. ఆవిడ
కూర్చున్న ఆసనము పంచ బ్రహ్మాసనము అంటారు. ఆవిడకు నాలుగు చేతులు ఉంటాయి,
క్రింద ఉన్న రెండు చేతులతో చెరకు గడ ఐదు పుష్పాల గుచ్చము ఉంటాయి.
పైనున్నచేతులలో పాశము, అంకుశము అనే ఆయుధాలు ఉంటాయి విగ్రహము దగ్గర చిలుక
అంటుంది. కానీ ఆ చిలుక సందర్శకులకు బాగా కనిపించదు.
అమ్మవారి విగ్రహము ఎల్లప్పుడూ మంచి ఖరీదైన పట్టు చీరలు నగలతో అలంకరింప
బడి ఉంటుంది.. గర్భగుడిలో వెండి తాపడము కలిగిన ఒక స్తంభము ఒక రంధ్రముతో
అమ్మవారి బొడ్డు కు గుర్తుగాఉంటుంది. అమ్మవారి విగ్రహానికి ఎదురుగా యోని
ఆకారములో రాతి చెక్కడము ఉంటుంది
దీనిలోపల శ్రీ చక్రము ఉంటుంది . ఈ శ్రీ చక్రానికి పూజలు జరుగుతాయి.
పురాణాల ప్రకారము శ్రీ చక్రము లోని కేంద్ర బిందువు పైన అమ్మవారు కూర్చుని
ఉంటారు.
శ్రీ చక్రము చుట్టూ 8 వాగ్దేవులు ఉంటారు. ఈ శ్రీ చక్రాన్ని చూడటము వీలు
కాదు, ఎందుకంటే ఎప్పుడు గులాబీ రంగు తాజా కలువ పూలతో కప్పబడి ఉంటుంది.
అది శంకరాచార్యుడు సౌందర్య లహరిని ఇక్కడే రచించాడు. అమ్మవారి పీఠము
చుట్టూ ఉండే నాలుగు గోడలు నాలుగు వేదాలకు ప్రతీక. అలాగే గాయత్రీ
మండపములోని 24 స్తంభాలు గాయత్రి మంత్రములోని 24 అక్షరాలను సూచిస్తాయి.
అమ్మవారి విగ్రహానికి ఎడమవైపు వారాహి, అరుపు లక్ష్మి విగ్రహాలు ఉంటాయి.
ప్రత్యేక పూజల సందర్భముగానే భక్తులను గర్భ గుడిలోకి అనుమతిస్తారు
భక్తులకు
అమ్మవారి కుంకుమ గాజులు ప్రసాదము ఇస్తారు. అమ్మవారి విగ్రహానికి
కుడివైపున శ్రీ లక్ష్మి సహిత విష్ణు మూర్తి విగ్రహము ఉంటుంది.
గర్భ గుడి ముఖ ద్వారాన్ని బిల్వద్వారము అంటారు.కామాక్షి అమ్మవారి గుడిలో
ఫాల్గుణ మాసము(ఫిబ్రవరి-మార్చ్)లో అమ్మ వారి కళ్యాణము పరమ శివుని తో
జరుగుతుంది. పెళ్లికాని ఆడపిల్లలు ఈ కల్యాణాన్నిచుస్తే వారికి త్వరగా
వివాహము అవుతుంది అని భక్తులవిశ్వాసము. కళ్యాణము తరువాత ఉత్సవ మూర్తులను
కోనేరులో తెప్పోత్సవం ఘనముగా నిర్వహిస్తారు. ఇతర అమ్మవారి దేవాలయాలలో
మాదిరిగానే చైత్ర మాసములో శరద్ నవరాత్రలు నిర్వహిస్తారు . ప్రతి పౌర్ణమి
నాడు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరము మాఘ
మాసములో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజూ ఉదయము సాయంత్రము అమ్మవారి ఊరేగింపు ఉంటుంది.
నాలగవ రోజు అమ్మవారు బంగారు సింహము వాహనము పై ఉరేగుతుంది. అలాగే 9
వరోజు వెండి రథముపై ఉరేగుతుంది 10వ రోజు అంటే బ్రహ్మోత్సవాల ముగింపు రోజు
(పొర్ణమిరోజు) భక్తులు అమ్మవారు కోనేరులో స్నానాలు చేస్తారు.
అన్నిదేవాలయాల మాదిరిగానే కంచిలో కామాక్షి అమ్మవారి రథయాత్ర బంగారు
రథములో కంచి
పురవీధులలో అంగరంగ వైభవముగా జరుగుతుంది . చాలామంది భక్తులు ఈ
ఉత్సవాన్నిచూడాలని ఉబలాట పడతారుకూడ. కంచి లోని కామాక్షి అమ్మవారి దేవాలయ
విశేషాలు.

3 thoughts on “కంచి కామాక్షి

  1. కామాక్షీదేవీ దర్శన విశేషాలు, పూజల పై చక్కటి వివరణ.

  2. మీ వ్యాసంలో కంచి విశేషాలన్నీ అద్భుతంగా వర్ణించారండీ! చాలా బాగుంది.

Leave a Reply to Gauthami Cancel reply

Your email address will not be published. Required fields are marked *