April 25, 2024

అక్షరాలే ఊపిరిగా రూపుదిద్దుకున్న కవితాస్ఫూర్తి

రచన: సి. ఉమాదేవి అక్షరమంటే ఉన్న ఆర్తిని, ఆప్యాయతను తన కవితలలో ప్రతి పదములోను ప్రతిఫలిస్తూ కవితలు, హైకూలు, రవీంద్రనాథ్ టాగూర్ గీతాంజలికి అనువాదంవంటి ఎన్నో రచనలు తనదైన శైలిలో రచించి మనకందించారు డా. పి. విజయలక్ష్మీ పండిట్. జపాన్ దేశంలో పురుడుపోసుకున్న హైకూలు నేడు ప్రపంచమంతా చక్కటి హైకూలుగా రచింపబడి అందరినీ అలరిస్తున్నాయి. విశ్వపుత్రిక హైకూలుగా రచింపబడిన సంపుటిలో సాంఘిక, సామాజిక అంశాలను తన హైకూలలో పొందుపరచి అనంతార్థాన్ని అందించడం ముదావహం. కళలు, కవితలు కవిహృదయాలను […]

శృంగేరి

రచన: నాగలక్ష్మి కర్రా ఈ వారం మనం శృంగేరీలో పర్యటిద్దాం, శృంగేరి అంటే తెలీని హిందువు వుండడనే నా అభిప్రాయం, వేదపాఠశాల అంటే ముందుగా శృంగేరీ వే జ్ఞాపకం వస్తుంది, మన దేశంలోనే కాదు విదేశాలలో కూడా మందిరాలలో పూజారులైనా, పౌరోహిత్యం చేసుకుంటున్నవారైనా శృంగేరీలోని వేదపాఠశాలలో చదువుకున్నవారే అయి వుంటారు. ఆది శంకరాచార్యులవారు స్థాపించిన శారదాపీఠం కూడా యిక్కడే వుందనీ మనకు తెలుసు. మిగతా వివరాలు తెలుసుకుందాం. శృంగేరీ కర్నాటకలోని ‘ చికమగళూరు‘ జిల్లాలో పడమటి కనుమలలో […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 47

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య మానవ జన్మ ప్రాముఖ్యాన్ని తెలియని వారుండరు. కానీ, అజ్ఞానం, అరిషడ్వర్గాలకు బానిసై అకృత్యాలు చేస్తుంటారు. పశ్చాత్తాపంతో తేరుకుని తెలుసుకున్నవారు చాలా తక్కువగానే ఉంటారు. ఆ విషయం తెలుసుకొని ఆచరణలో పెట్టే జనం ఇంకా తక్కువగా ఉంటారు. అలా ఆచరణలో పెట్టినవారు మాత్రమే కృతార్థులవుతారు. అన్నమయ్య సంకీర్తన ప్రాముఖ్యాని గ్రహించమంటున్నాడు. ఇకనైనా మేలుకోండి అంటున్నాడు. ఋగ్వేదంలో చెప్పబడిన “విష్ణోర్ముకం వీరాణి ప్రోవచాం” అనే శ్లోకమాధారంగా శ్రీనివాసుని స్తోత్రం చేత, సంకీర్తన చేత సేవించడమే వేదం […]

జ్ఞానజ్యోతి శ్రీమతి సూరి నాగమ్మ గారు

రచన: శారదాప్రసాద్ కష్టాలు, కన్నీళ్ళతో నిండిన జీవితానుభవాలు ఒక్కొక్కసారి జీవితాన్ని అనుకోని మంచి మలుపులు తిప్పుతాయి. శ్రీమతి సూరి నాగమ్మ గారి జీవితమే దీనికి నిదర్శనం. ఈ వ్యాసం చదివే వారిలో చాలామందికి శ్రీమతి సూరి నాగమ్మ గారు ‘సూరి నాగమ్మ గారి లేఖలు’ అనే ఆవిడ గ్రంధం ద్వారా సుపరిచితులు. ఈ లేఖలను ఆవిడ 1940 ప్రాంతంలో రమణ మహర్షి ఆశ్రమం నుండి తన సోదరునికి వ్రాసారు. 20 వ శతాబ్దానికి చెందిన ఒక దివ్య […]

గోదావరి అలలలో అమ్మపిలుపు వినిపిస్తోంది

రచన : శ్రీపాద శ్రీనివాస్ ఉదయాన్నే 5.30 కి లేవడం…అమ్మ నిద్ర లేచిందో లేదో చూసుకోవడం..బయటకి వెళ్ళి పాలు తెచ్చి వాటిని మరగబెట్టి అమ్మని నిద్ర లేపడం, తదుపరి ఇంటి పనుల్లో అమ్మకి సహాయపడుతూ దైనందిన జీవితానికి ఉపక్రమించడం….ఇది రోజువారి మోహనవంశీ జీవితం….!!!! ప్రతిరోజులాగే తనకి ఉదయం 5.30 కి నిద్ర నుండి మెలుకవ వచ్చింది..అవును బయటకి వెళ్ళి పాలుతేవాలి అనుకుంటూ ఆవలిస్తూ నిద్ర లేచాడు మోహనవంశీ..అమ్మ నిద్రలేచిందో లేదో చూద్దాం అనుకుంటూ ఒక్కసారి అమ్మ మంచం […]

కంచి కామాక్షి

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు . కంచి కాంచీపురం, కాంజీవరం, వంటి పేర్లతో పిలిచే ఈ నగరం చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన పవిత్ర నగరాల్లో ఒకటి , కంచి లోని కామాక్షి అమ్మవారి దేవాలయము అతి పురాతనమైనది ఎప్పటి నుంచి ఉన్నదో ఇదమిద్ధముగా తెలియదు..జగద్గురు అది శంకరాచార్య ఈ దేవాలయములో శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారు..ఆర్కియాలజీ వారి లెక్కల ప్రకారము ఈ దేవాలయము 1600 ఏళ్ళనాటిది. అది శంకరాచార్యులవారు ప్రతిష్టించిన శ్రీ చక్రము 5 బీసీఈ నుండి 8th […]

కవి పరిచయం..

రచన: లక్ష్మీ రాధిక పేరు..తాటిశెట్టి రాజు, నివాస స్థలం విశాఖపట్టణం. వృత్తిపరంగా అవుట్సోసింగ్ జాబ్ వర్క్స్ చేస్తూ ఉన్నా ప్రవృత్తి పరంగా కవిత్వాన్ని, సంగీతాన్ని సమంగా ఆస్వాదిస్తుంటారు. ప్రకృతి పట్ల, సమాజం పట్ల సమబాధ్యత వహిస్తూంటారు. “గోరంత గుండెచప్పుడు పదాలుగా మారితే ఆయన కవితైనట్టు..” చైత్రపు తొట్టితొలి పండుగ ఉగాది మొదలు మాఘమాసపు శివరాత్రి వరకూ ఏటా పన్నెండు పండుగలకో లెక్కుంటే, తను రాసే రెండు..రెండున్నర నెల్లాళ్ళూ పండుగే అభిమానులకి అంటే అతిశయోక్తి కాదు. “పెరిగీ తరిగేను […]

ఎదురుచూపు….

రచన: వి.ఎన్.మంజుల అవనిపై అడుగుడడానికి, అమ్మ గర్భాన నవమాసాలూ ఓపికపట్టలేదా… పుట్టిన నుండీ మాటలు పలికేదాకా, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూడలేదా… అక్షరాభ్యాసం నుండీ పట్టా పట్టేదాకా, బ్రతుకు సమరానికి సిధ్ధం కాలేదా… సంవత్సరం తరువాత వచ్చే పరీక్షా ఫలితాలకై, వందల రోజులు ఆసక్తిగా ఆగడంలేదా… కన్నకలల సాకారం కోసం, జీవితకాలం ప్రయత్నం చేయటంలేదా… బంధాలు ముడిపడి బాధ్యతలు పెరిగినా, చివరికంటా ఓపికగా మోయడంలేదా… విత్తునాటి, పంట చేతికొచ్చేదాకా, నెలలకొద్దీ ఆశగా వేచిచూడటంలేదా… సాధన చేసిన రంగంలో విజయపతాకానికై, […]