June 19, 2024

మాలిక పత్రిక జూన్ 2020 సంచికకు స్వాగతం

    Jyothivalaboju Chief Editor and Content Head మాలిక పాఠకులకు, రచయితలకు నమస్కారం.. ఎలా ఉన్నారు అందరూ.. కరోనా భయం పోయి, దానితో సహజీవనం మొదలెట్టేసారా… తప్పదు కదా.. ఇక మెల్లిగా జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి కాని చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా..  ఇంకా  ప్రమాదం తప్పలేదు. మాలిక పత్రికలో మంచి మంచి వ్యాసాలు, కథలు, సీరియల్స్  అందిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మాలిక పత్రికను ఆదరిస్తున్న మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. […]

నన్నెచోడుడు – “జానుతెలుగు”

రచన: సంధ్య యెల్లాప్రగడ జాను తెలుగు అంటే అందమైన, స్వచ్ఛమైన తెలుగు అని నిఘంటువు అర్థము. ఆ మాటను 12 వ శతాబ్దాపు కవి నన్నెచోడుడు మొదటిసారి వాడాడు. శివాచార తత్పరుడై, జంగమ భక్తుడిగా, విలక్షణ శైలిలో రచనలు చేశాడు నన్నెచోడుడు. నన్నెచోడుడు గురించి, ఆయన రాసిన అపూర్వ గంథ్రం ‘కుమారసంభవము’ గురించి చాలా శతాబ్ధాలు తెలియదు తెలుగువారికి. 1909 లో శ్రీ మానపల్లి రామకృష్ణ కవి ప్రపంచానికి ఈ ‘కుమారసంభవ’మన్న అత్యద్భుత తెలుగు ప్రబంధము పరిచయము […]

కంభంపాటి కథలు – పెద్దమ్మాయిగారి కథ

రచన: కంభంపాటి రవీంద్ర ‘మధ్యాన్నం బోయనానికి ఇంటికొచ్చెయ్యి .. నిన్ననే దవిలేశ్వరం నుంచి పులసలు తెప్పించి పులుసు కాయించేను .. పైగా మా ఆవిడ ఇయ్యాల ఉదయం పెరుగావడలు చేసింది.. నిన్న ఎండబెట్టిన ఉసిరికాయ వడియాలు ఎండేయంట .. అవి కూడా టేస్టు చూద్దూగాని .. మళ్ళీ మీ హైద్రాబాదు వెళ్ళేవంటే ఇవన్నీ దొరకవు ‘ అంటూ ఉదయాన్నే లోవరాజు ఫోను ‘ఇవన్నీ ఏమో గానీ .. హైదరాబాద్ వెళ్ళేనంటే నీ కధలు మట్టుకు దొరకవు ‘ […]

గిలకమ్మ కతలు – “య్యే..నన్నంటే..నేనూరుకుంటానా?“

రచన: కన్నెగంటి అనసూయ “ ద్దా..ద్దా..గమ్మున్రా..! నీకోసవే సూత్నాను ఇందాకట్నించీని..!” మజ్జానం అన్నానికని బణ్ణించి ఇంటికొత్తా అప్పుడే గుమ్మాలోకొచ్చిన గిలకమ్మన్జూసి కంగారుకంగారుగా అంది సరోజ్ని. “య్యేటి? అమ్మిలా కంగారు పెట్టేత్తింది ఇంకా ఇంట్లోకి రాకుండానేని? ఏ వడియాల పిండన్నా రుబ్బిందా యేటి? లేపోతే ఏ పిండొడియాలన్నా పోత్తానికని పిండుడికిచ్చిందా ఏటని మనసులో అనుకుంటా సుట్టూ సూసింది గిలక. ఎటుకేసి సూసినా అలాటిదేదీ ఆపడాపోయేతలికి.. “ ఏటలా కంగారు పెట్టేత్నావేటే అమ్మా..! ఇప్పుడే గదా ఇంటికొత్తా? ఇదొరకంతా కాల్లు […]

ప్రజ్ఞ

రచన : సోమ సుధేష్ణ చెట్ల ఆకులతో దాగుడు మూతలు ఆడుతున్న లేత ఎండను చూస్తూ అర్జున్ పచార్లు చేస్తున్నాడు. ప్రతి రోజూ చూస్తున్నదే అయినా ఎప్పటికప్పుడు మొదటి సారి చూస్తున్నంతగా ఆనందిస్తుంటాడు. ప్రకృతిలో వచ్చే మార్పులు ఆయన మనసును తాకకుండా వెళ్ళలేవు. అర్జున్ ప్రకృతి ప్రియుడు. ప్రకృతిలోని ప్రతి జీవిని ప్రేమించే మనసు ఉంది. వాకింగు పూర్తి చేసుకొని పక్కనే ఉన్న ఇంట్లోకి వెళ్తూ ఎదురుగా వస్తున్న జగదీష్ గారిని చూసి నవ్వాడు. ఉదయం నాలుగింటికే […]

అమ్మ కడుపు చల్లగా

రచన: తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం పిట్స్ బర్గ్ లో విమానం దిగి బయటకు రాగానే వాళ్ళు ఎక్కవలసిన రైలు రావడంతో హడావిడిగా ఎక్కేసారు మంగమ్మగారు మంగపతి గారు. నిముషంలో కంపార్ట్ మెంట్ తలుపు యాంత్రికంగా మూసుకోవడం , రైలు వేగంగా ముందుకు దూసుకు పోవడం జరిగింది. కళ్ళు మూసి తెరిచేంతలో వాళ్ళు దిగవలసిన చోటు వచ్చేసింది. హాండ్ లగేజిగా తెచ్చుకున్న చిన్న సూట్కేసులు లాక్కుంటూ కరౌసిల్ దగ్గరకు వచ్చారు ఆ దంపతులు. వాళ్ళను చూసి గబ గబనడుస్తూ […]

తల్లిని మించి ఎవరు?

రచన: శింగరాజు శ్రీనివాసరావు మానస మనసు మనసులో లేదు. పదే పదే మధు మాటలే చెవిలో మారుమోగుతున్నాయి. “మానసా నా మాట విను. ఎంతకాలమిలా ఒంటరిగా జీవితాన్ని గడుపుతావు. నీకంటూ ఒక తోడు కావాలి. భగవంతుడు వేసిన శిక్ష అనుకునో, నా బ్రతుకింతే అనుకునో కష్టాన్ని అనుభవించే రోజులు పోయాయి. నీ ప్రతి బాధ్యతను నా బాధ్యతగా తీసుకుంటాను. నిన్ను నా భార్యగా జీవితమంతా నా గుండెల్లో దాచుకుంటాను.” అతని మాటల్లో నిజాయితి వుంది. కాని అది […]

రేపటి వట వృక్షాలు.

రచన: గిరిజారాణి కలవల మాదాపూర్ లో అదొక గేటెడ్ కమ్యూనిటీ…రో హౌసెస్.. అన్నీ ఒకేలా తీర్చిదిద్దినట్లుండే ఎనభై డ్యూ ప్లెక్స్ విల్లాలు అవి. అక్కడ నివసించే వారు బాగా ధనవంతులూ.. ఉన్నత స్థాయి కుటుంబాలవారే.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులూ, డాక్టర్లు, పెద్ద వ్యాపారస్ధులే. ఇంకా కొందరి పిల్లలు ఫారిన్ కంట్రీలలో స్ధిరపడిపోతే.. పేరెంట్స్ ఇక్కడ ఇళ్లు కొనుక్కుని ఉంటున్నారు. ఎక్కడక్కడ సెక్యూరిటీ గార్డులు ఉండడంతో సేఫ్టీగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఉంటున్నారు. ఈ ఇళ్ల లో వారందరూ […]

సరుడు

రచన: పద్మజ కుందుర్తి నానబెట్టి వడేసిన నూకల్ని రొట్లో వేసి అదరాబదరా దంచుతున్న కాసెమ్మని గోడమిదుగా చూసి,” ఏందొదినో! మంచి వుసిమీద వుండావూ ….ఏంది కత? ఈరోజు మాయన్నకు పలారం వొండి పెడతన్నవే ….ఏంది సంగతీ …” కుశాలగా అడిగింది, పక్కింటి లచ్చిమి. “పెద్ద పలారమేం గాదులే ..కూసింత పాలతాలికలు జేద్దామనప్పా! శానాదినాలాయె పాలతాలికలు జేసి, మీయన్న పొద్దస్తమానుం అడుగుతా నా పెయ్య దీస్తుంటే …ఇప్పటికి కుదిరింది మరి.” సమాధానం జెప్పింది కాసెమ్మ. “సర్లే తూర్పు పొలం […]

చంద్రోదయం – 4

రచన: మన్నెం శారద   అలా నిర్ణయం తీసుకున్న మరుక్షణం శేఖర్‌కి గాఢనిద్ర పట్టేసింది. “ఈ వెయ్యి రూపాయిలు ముందు యింటికి పంపించండి..” శేఖర్ అందిస్తోన్న డబ్బు వేపు విప్ఫారిత నేత్రాలతో చూశాడు సారధి. “వద్దండి. తీసుకోవటం తేలిక. తిరిగి తీర్చలేని దురదృష్టవంతుణ్ణి. మీ మంచితనాన్ని దుర్వినియోగపరచలేను” అన్నాడు సారధి సిగ్గుగా. సారధి మాటలకి శేఖర్ నవ్వేడు. “నేను మిమ్మల్ని ఇన్సల్టు చేయటానికి.. బరువులో దించటానికి మాత్రం యివ్వటం లేదు. ఈ డబ్బు మీరు తీసుకోనంత మాత్రాన […]