June 25, 2024

తపస్సు – స్వప్న రహస్యం

రచన: రామా చంద్రమౌళి

బొగ్గు నిప్పుగా మారి..గాలితో సహచరిస్తూండగా
ఇనుమును ఎర్రగా కాల్చీ కాల్చీ.. ఆయుధంగా మార్చడం
ఒక రూపాంతరక్రియే.. ఐతే
రెండు చేతులూ..రవ్వంత నైపుణ్యం..పిడికెడు హృదయమూ కావాలి –
పరీక్షా సమయాలు ఎదురౌతూనే ఉంటాయి
పర్వతాన్ని ఎక్కుతున్నపుడు అది నిరోధిస్తూనే ఉంటుంది
ఐతే.. అది అందించే చెట్ల చేతులనూ,
రాతి వంకర్ల ‘ పట్టు ’ నూ స్పృహించాలి
నీడ ప్రక్కనే.. వెంటనే వెలుగుంటుందని గ్రహించాలి
ప్రయాణం ఆగదు
ప్రసవానికి ముందరా..తర్వాతా..అంతా భీకర వేదనే
ఎక్కడో దూరంగా..చలికాలపు సాయంత్రం
ఒక గ్రామం..సన్నని కట్టెల పొగలో తేలివస్తూ..చిన్నపిల్ల ఏడుపు
హృదయం..పెద్ద బాడ్శె కింద కొడిశె మొద్దు
ఫెళ్ళున ఒక పుచ్చె ఎగిరిపోతుంది..అరచేతి మందంలో
గాయం..ఎర్రగా..రక్తచందనం
శరీరమంతా గాయాలే..జీవితాంతం
వస్త్రాలకింద జాగ్రత్తగా,పదిలంగా దాయబడి
దాచినవన్నీ కనబడవా.?
కనబడనివన్నీ దాచినవేనా ?
కన్నీళ్ళెవరిచేత.. ఎక్కడ.. ఎప్పుడు దాయబడ్డాయి-
పాదాలను సంధించుకుని ..చూపులను యోజనాల దూరం సారించి
నడకను మొదలుపెట్టినవాడికి
ముళ్ళూ,రాళ్ళూ..కొన్ని నక్కల ఊళలూ లెక్కకాదు
గాలితో సంభాషిస్తూ..సహచరిస్తూ
ఆత్మప్రేరణతో అడుగులేస్తున్న యోధునికి
లోతు గురించీ, వైశాల్యం గురించే కాదు
ప్రవాహం గురించికూడా తెలుస్తుంది
ఊట పుట్టడానికీ,చెలిమె ఆవిర్భవించడానికీ
ఇసుకను తోడడం అవసరమనీ తెలుస్తుంది
తోడాలి.. తవ్వాలి
చెక్కాలి.. ఉత్తరించాలి.. గాయపర్చాలి.. తప్పదు
జడివానలో తడుస్తూ నిశ్చలంగా నిలబడ్డవానికి
చేతిలో ఆయుధాన్ని ధరించి పులకించిపోవడం తెలియాలి
భూమిలో సమాధై తడిచి తడిచి నానిన విత్తనం
అనివార్యమై మొలకెత్తడం గురించిన రహస్యం తెలియాలి

The Secret of a Dream

Translated by Indira Babbellapati

Blowing winds turning the coal into fire,
a piece of iron is shaped into a weapon after
burning it in the smithy, acts of conversion
which require two hands, a speck of skill and
a fistful of heart. Testing times are inevitable.
Doesn’t a mountain frustrate a hiker while climbing?
It’s for the hiker to take the support of hands the trees
extend or hold on to stones for the grip they provide.
Doesn’t light follow shadows? This journey never ends!
Pre-natal or post-natal, either condition is a grotesque agony.
On a winter evening from a remote corner, a child’s wailing
comes floating on the thin smoke of
firewood from a nondescript
hamlet, heart is a log of wood burning in a large hearth.
A wood-chip abruptly jumps out of
the flame causing an abrasion
as thick as the palm blood red,
nay red sanders injuries all over but
safely secure under the clothes for life! Are the hidden really
invisible? Is all that’s invisible concealed? Can you tell,
where, when and by whom are tears shrouded?

One who sets out extending his vision yonder, can’t avoid
thorny, gravel, stony paths or howling of foxes. A soldier,
who walks in self-motivation conversing with
wind is sure to know
of not only the depth, the expanse but also of the force
of the flow of a stream, where from
water generates and originates,
it’s imperative to dig the sand in the process, one has to draw
and dig the sand, need to chisel and chop. Can’t escape hurt,
can’t help it! One standing steady in spite of an incessant
downpour should know of the ecstasy in wielding a weapon.

The seed soaked and soaked buried deep in the earth should
also know the secret of the imminent sprouting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *