April 19, 2024

వ్యాపారాలే!…విపరీతాలే!

రచన: చందలూరి నారాయణరావు

రెండే రెండు పచ్చగా ఉండే
ఖరీదైన కాలక్షేపాలు.
* * *
ప్రతి ఒక్కరు
తారాజువ్వలా ఎగసిపడే హక్కులున్న చిక్కులివి.
* * *
ఒకటి సినీమా
రెండు రాజకీయం
* * *
ఏ వ్యక్తికి ఏ చోటుకు
అతీతం కాని ప్రీతికరాలు
* * *
వెండితెరపై హీరో నటనకు
కోట్లను కట్టబెట్టిన అభిమానమే
అసమానస్థాయికి చేర్చిన ఆరాధన.
అందమైన అంతస్తులో నిలబెట్టిన ఆదరణ “సినిమా”
* * *
తెలిసినా…
తెలియకపోయినా….
తెలిసీతెలియపోయినా…
ప్రజాస్వామ్యంలో ప్రాతినిధ్యాన్ని
కనగలిగిన లేదా కొనగలిగిన
అదృష్టం ప్రజాసేవ.
అవకాశం “రాజకీయం”.
* * *
గంటల కొద్దీ
రోజులు తరబడి
నెలల పాటు
సంవత్సరం పొడుగునా
తలపడినా
కలపడినా
* * *
తేలేది
మిగిలేది
ఒక్కటే
* * *
అంతా ….
“విలువలు” లేని వ్యాపారాలే!
అంతటా …..
“వలువలు” ఊడిన విపరీతాలే!
* * *

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *