April 24, 2024

ఉత్తరాఖండ్ లోని సప్త్ తాల్

రచన: రమ శాండిల్య

Thal అంటే చెరువు అని అర్ధం.
అంటే ఉత్తరాఖండ్ లో ఉన్న చెరువులు వాటి చుట్టుపక్కల గుళ్ళు , చూస్తుంటే ఆధ్యాత్మికత వద్దు మాకు అని అనుకున్నా కూడా ప్రశాంతంగా ఉండి తెలియని శాంతి వస్తుంది అక్కడ. దానికి కారణం హిమాలయ పర్వాతానికి ఉత్తరాఖండ్ పాదాలుగా చెప్పుకోవచ్చు .
దూరంగా హిమాలయపర్వతాలు తెల్లగా సూర్యకిరణాలు పడుతుంటే బంగారు రంగులో కనిపిస్తుంటాయి . బద్రినాథ్ 250 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడినుంచి.
నైనతాల్ మనందరికీ తెలుసు. అక్కడ నైనాదేవి మందిర్ ఉంది. అక్కడికే అందరూ ఎక్కువగా వేడుతుంటారు .


కానీ మిగిలిన ఆరు తాల్స్ ఇంకా చాలా బావుంటాయి. అన్నిటి కంటే నాకు నవకుచియా తాల్ చాలా నచ్చింది . నవకుచియా అంటే 9 కోసులు వుండే చెరువు. 9 కొనలు ఉంటాయి. బోటింగ్ చేస్తుంటే చాలా బావుంటుంది .మొత్తం చెరువు అన్ని కొనలు తిరగడానికి 2 గంటలు పడుతుంది. చుట్టూ కొండలతో, చెట్లతో చల్లని వాతావరణం అద్భుతంగా ఉంటుంది.
ఇలా ఒక్కొక్క చోటు గురించి చెప్పాలంటే చాలా సమయం కావాలి .
హైద్రాబాద్ నుంచి ఢిల్లీ , అక్కడినుంచి కట్గోదాం వరకు వెళ్లి అక్కడినుంచి రాని కేత్ల్ మెయిన్ స్టే తీసుకొని రోజు ఉదయం వెళ్లి చుట్టూ ఉన్నవాన్ని చూసి మళ్ళీ రానికేత్ల్ కి వచ్చేసే వాళ్ళం .
శీతలామాత మందిరం, గోలుదేవతా మందిరం, ముక్తేశ్వర్ మహాదేవ్, జాగేశ్వర్, బాగేశ్వర్ ధామ్, చండికా మందిర్, మహావతార్ బాబాజి గుహ , కాలిమందిర్, వారాహి మందిర్ ఇంకా అనేక మందిరాలు ఇవి కాకుండా హిమాలయాల్లో ట్రెకింగ్ చేయడానికి అనువయిన విధ్య చెప్పే యూనివర్సిటీ , మ్యూజియం, జూ అన్ని కూడా 300 మెట్లు ఎక్కి దిగడమే, బాబాజి గుహ 15 కిమి కొండ ఎక్కి దిగాల్సిందే. అద్భుతమయిన శిల్ప సంపదతో ఉంటాయి.


బిమాతాల్, సప్త్ తాల్, నైనతాల్, జాగేశ్వర్ , కమళ్తాల్, నవకుచియా తాల్ మొత్తం ఒక నెల ఉంటే అన్ని చూసి రావచ్చు 4, 5 రోజుల్లో ముఖ్యమయినవి చూసి రాగలుగుతాము
దేముడి జన్మభూమి అంటే ఉత్తరాఖండ్ నుంచి మొదలవుతుంది. హిమాలయాలవరకు అలాగే ఉంటుంది. దేవ భూమి అనే మాటలు అతిశయోక్తులు కావు ఏమాత్రం.

1 thought on “ఉత్తరాఖండ్ లోని సప్త్ తాల్

Leave a Reply to మాలిక పత్రిక జూన్ 2020 సంచికకు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *