July 7, 2022

అమ్మమ్మ – 14

రచన: గిరిజ పీసపాటి     “నేను ఈ రోజు రాత్రి ఈ గుడిలో నిద్ర చేయాలని వచ్చాను. రేపటికి ముప్పై రోజులు ఆయన నాకు దూరమై. త్వరలోనే నాగని చూడడానికి వెళ్ళాలి. ఎక్కడా నిద్ర చెయ్యకుండా వియ్యాలవారింటికి ఎలా వెళ్తాను? అందుకే మీరు దయతలచి ఈ ఒక్క రాత్రి నన్ను గుడిలో ఉండనిస్తే రేపు ఉదయం వెళ్ళిపోతాను. కాదనకండి బాబూ!” అని వేడుకుంది అమ్మమ్మ. అమ్మమ్మ మాటలకు చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంటూ “మనుషులు ఆదరించకపోవడంతో భగవంతుని […]

కవి పరిచయం – రాజ్ రెడ్డి

పేరు..రాజ్ రెడ్డి. నివాస స్థలం బెంగళూరు. ప్రవృత్తి పరంగా కవిత్వాన్ని రాయడాన్ని ఎక్కువ ఇష్టపడతారు. సాహిత్యాన్ని ఔపాసన పడుతుంటారు. కొత్త ప్రదేశాలు చూడటం,అవసరమైనప్పుడల్లా మానవత్వంగా ప్రతిస్పందిస్తూంటారు. ఆశకీ శ్వాసకీ మధ్య సంబంధం తెలియాలంటే ఈయన కవిత్వం చదవాల్సిందే. మనసులు మాట్లాడుకునే ఊసులన్నీ కాగితాన్ని కౌగిలిస్తే వారు రాసినట్టే. “కన్మణీ” అంటూ కమ్మని గారాన్ని ఒలికిస్తూ చదువరులను ఇట్టే కట్టిపడేస్తారు. వసంతమంతా సన్నజాజులై పూసే అమృతహేల, మోహనరాగ పరిమళం మనసుని మీటే వేళ, కొమ్మారెమ్మా ఊహలు గుసగుసలాడినట్టే ఉంటుందీయన […]

జాబాలి

రచన: శారదాప్రసాద్ జాబాలి ముని దశరధ మహారాజు రాజ పురోహితులలో ఒకడు . ఆయన మంత్రి వర్గ సభ్యులలో కూడా ఒకడు. శ్రీరామచంద్రుడు అరణ్యవాసము నుండి తిరిగి ఎలాగైనా అయోధ్యకు తీసుకుని వచ్చి పట్టాభిషిక్తుని చేయాలని తలంపుతో భరతునితో కూడా వెళ్ళిన పరివారములో జాబాలి ఒకడు. జాబాలి ప్రసక్తి వాల్మీకి రామాయణం అయోధ్య కాండలో ఉంది . జాబాల అనే ఒక విప్ర స్త్రీకి కన్యత్వ దశలోనే దేవతా వరప్రసాదమున పుట్టిన వాడే ఈ జాబాలి. జాబాలికి […]

బర్బరీకుడు

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు మహాభారతములో మనకు అనేక పాత్రలు తారస పడతాయి, కానీ మనము చాలా తక్కువగా వినే పేరు “బర్బరీకుడు”. యుద్దము ప్రారంభము అవటానికి ముందు ప్రతి యోధుడిని యుద్దాన్ని ఎన్ని రోజులలో ముగించ గలవు అని శ్రీకృష్ణుడు ప్రశ్నిస్తే, భీష్ముడు 20 రోజులని, 25 రోజులని ద్రోణాచార్యుడు, 24 రోజులని కర్ణుడు, 28 రోజులని అర్జునుడు చెపుతారు. దూరముగా ఉండి ఇవన్నీ గమనిస్తున్న బర్బరీకుడుని శ్రీ కృష్ణుడు బ్రాహ్మణుని వేషములో దగ్గరకు వచ్చి”ఈ […]

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 48

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య అన్నమయ్య ఈ సంస్కృత కీర్తనలో మహావిష్ణువును కీర్తిస్తున్నాడు. కృష్ణావతారంలో చేసిన కృత్యాలను వివరిస్తూ బహుధా ఉల్లేఖిస్తూ… ఆ పరమాత్మను శరణువేడుకుంటున్నాడు. కీర్తన: పల్లవి: జడమతిరహం కర్మజంతురేకోఽహం జడధినిలయాయ నమో సారసాక్షాయ ॥పల్లవి॥ చ.1. పరమపురుషాయ నిజభక్తిజననసులభాయ దురితదూరాయ సింధరహితాయ నరకాంతకాయ శ్రీనారాయణాయ తే మురహరాయ నమో నమో నమో ॥జడ॥ చ.2. నగసముద్ధరణాయ నందగోపసుతాయ జగదంతిరాత్మాయ సగుణాయ మృగనరాంగాయ నిర్మితభవాండాయ ప- న్నగరాజశయనాయ నమో నమో ॥జడ॥ చ.3. దేవదేవేశాయ దివ్యచరితాయ బహు- […]

మనసును ఆలోచింపచేసే ఆత్మీయ తరంగాలు

రచన:సి. ఉమాదేవి డా. లక్ష్మిరాఘవ గారు సాహిత్యానికే కాదు తనలోని కళాభిరుచికి నైపుణ్యాన్ని జోడించి అందమైన కళాకృతులను రూపొందించి ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేస్తారు. వృధాగా పారెయ్యవలసిన వస్తువులను కళాత్మకంగా వినియోగించడంలోనే వీరి ప్రతిభ ఆవిష్కృతమవుతుంది. వనిత మహావిద్యాలయలో రీడర్ గా పదవీ విరమణ చేసాక తన సమయాన్ని సాహితీబాటలో విహరింపచేస్తున్నారు. చక్కని కథలతో ఆత్మీయులు అనే కథాసంపుటిని మనకందించారు. ఇరవైమూడు కథలున్న ఈ పుస్తకంలో ప్రతి కథ మనసును తట్టిలేపుతుంది. తద్వారా ఆలోచనకు పునాది పడుతుంది. […]

తపస్సు – స్వప్న రహస్యం

రచన: రామా చంద్రమౌళి బొగ్గు నిప్పుగా మారి..గాలితో సహచరిస్తూండగా ఇనుమును ఎర్రగా కాల్చీ కాల్చీ.. ఆయుధంగా మార్చడం ఒక రూపాంతరక్రియే.. ఐతే రెండు చేతులూ..రవ్వంత నైపుణ్యం..పిడికెడు హృదయమూ కావాలి – పరీక్షా సమయాలు ఎదురౌతూనే ఉంటాయి పర్వతాన్ని ఎక్కుతున్నపుడు అది నిరోధిస్తూనే ఉంటుంది ఐతే.. అది అందించే చెట్ల చేతులనూ, రాతి వంకర్ల ‘ పట్టు ’ నూ స్పృహించాలి నీడ ప్రక్కనే.. వెంటనే వెలుగుంటుందని గ్రహించాలి ప్రయాణం ఆగదు ప్రసవానికి ముందరా..తర్వాతా..అంతా భీకర వేదనే ఎక్కడో […]

సీతాదేవి పుట్టిన జనకపురి

  రచన: నాగలక్ష్మి కర్రా     రాముడు అయోధ్య లో పుట్టేడు సరే మరి సీతాదేవి ఎక్కడపుట్టింది అని ఆలోచిస్తే జనకమహారాజు పరిపాలించిన మిధిలానగరం ప్రస్తుతం యెక్కడ వుంది అని పరిశోధిస్తే నేపాలులో “జనకపురి” అని పిలువబడుతోందని తెలిసింది, ఎక్కడుందో తెలిసిందికదా, ఆలస్యమెందుకని టూరిజం వారిని కనుక్కొని యాత్ర బుక్ చేసుకున్నాం. ఆ యాత్రా వివరాలు మీక్కూడా తెలియజేస్తాను. ఢిల్లీనుంచి ఖాట్మండు వెళ్లేం, ఆరోజు పశుపతినాధుడిని దర్శించుకొని మరునాడు ఒంటిగంటకు మా జనకపూర్ ప్రయాణం. ఖాట్మండు […]

ఉత్తరాఖండ్ లోని సప్త్ తాల్

రచన: రమ శాండిల్య Thal అంటే చెరువు అని అర్ధం. అంటే ఉత్తరాఖండ్ లో ఉన్న చెరువులు వాటి చుట్టుపక్కల గుళ్ళు , చూస్తుంటే ఆధ్యాత్మికత వద్దు మాకు అని అనుకున్నా కూడా ప్రశాంతంగా ఉండి తెలియని శాంతి వస్తుంది అక్కడ. దానికి కారణం హిమాలయ పర్వాతానికి ఉత్తరాఖండ్ పాదాలుగా చెప్పుకోవచ్చు . దూరంగా హిమాలయపర్వతాలు తెల్లగా సూర్యకిరణాలు పడుతుంటే బంగారు రంగులో కనిపిస్తుంటాయి . బద్రినాథ్ 250 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడినుంచి. నైనతాల్ మనందరికీ […]

వ్యాపారాలే!…విపరీతాలే!

రచన: చందలూరి నారాయణరావు రెండే రెండు పచ్చగా ఉండే ఖరీదైన కాలక్షేపాలు. * * * ప్రతి ఒక్కరు తారాజువ్వలా ఎగసిపడే హక్కులున్న చిక్కులివి. * * * ఒకటి సినీమా రెండు రాజకీయం * * * ఏ వ్యక్తికి ఏ చోటుకు అతీతం కాని ప్రీతికరాలు * * * వెండితెరపై హీరో నటనకు కోట్లను కట్టబెట్టిన అభిమానమే అసమానస్థాయికి చేర్చిన ఆరాధన. అందమైన అంతస్తులో నిలబెట్టిన ఆదరణ “సినిమా” * * * […]