June 24, 2024

తపస్సు – పిల్లల ఆటస్థలం

రచన: రామా చంద్రమౌళి

చెట్టుకింద సిమెంట్‌ బెంచీపై కూర్చోబోతున్నా
రివ్వున పరుగెత్తుకొచ్చింది బంతి
కాళ్ళలోకి జివ్వున సముద్రం ఉరికిచ్చి .. పట్టుకుంటూండగా
వచ్చాడు వాడు పరుగెత్తుకుని
ముఖంనిండా వెలుగు .. కళ్ళలో ఆకాశం
బంతిని అందించగానే .. తుఫానై వెళ్ళిపోయాడు –

పిల్లలు ఆడుతూనే ఉన్నారు
పదిమంది దాకా
ఆట ఒక్కటే .. మనుషులే వేర్వేరు
వెనక్కి బెంచీ అంచుపై చేతులను విప్పి చాపి కళ్ళు మూసుకుంటే
పొద్దంతా,
కొద్దిసేపు పులినై, మరికొద్దిసేపు పిల్లినై
అప్పుడప్పుడు చెక్కుకున్న మనిషి ముఖాన్ని తొడుక్కుని మృగాన్నై
చివరికి అన్నింటినీ తెంచుకుని ఒంటరిగా వచ్చి
పిల్లల ఆటస్థలం వద్ద
కూర్చోగానే .. ఎందుకో
ముక్కలైపోతా.. బండరాయిపై పింగాణీ పలకను కొట్టినట్టు
ప్రతి ముక్కా నేనే.,
ప్రతి ముక్కా నాలోని ఒక పిల్లాడు .. అనేకమై మళ్ళీ ఏకమౌతూ
కళ్ళు మూసుకోగానే
లోపల కొందరు పిల్లలు .. కొన్ని జంతువులు
ముడుచుకున్న రెక్కలను బలవంతంగా విప్పుకుంటూ కొన్ని పక్షులు
ఒక్కో దారం పురులు పురులుగా విప్పుకుంటూ
తెగిపోతూ అతుక్కుంటూ
అంతా ఒక చిక్కుపడ్తున్న దారపు ఉండ –

ఎవడో ఒకడు బంతిని బలంగా తన్నాడు
‘‘ గోల్‌ ’’ అని మూకుమ్మడి అరుపులు సంతోషంతో
గోల్‌ కావడం కాకపోవడం ఒక సంభావ్యతైతే
తన్నబడడంమాత్రం బంతికి అనివార్యత
చేదబావిలోకి బొక్కెనలా జార్తున్న ప్రతిసారీ
ఎవరిదో ఒక చేయికోసం వెదుకులాట
సూదీ తనదే .. దారమూ తనదే .. గాయపడ్డ ప్రతిసారీ
తననుతాను కుట్టుకోవడమే .. రక్తాలోడ్తూ –

చూస్తూ చూస్తూండగానే
భూమిలోంచి ఎగుస్తూ పల్చని చీకటి
పైన చింతచెట్టు నిండా పక్షుల రొద
ఆత్మనిండా రాళ్ళతట్టలా ఏదో బరువు

మళ్ళీ రివ్వున ఉరికొచ్చింది బంతి నావైపే
వెంట .. మరో పిల్లాడు పరుగెత్తుకొస్తూ
దొరుకలేదు బంతి
దూరంగా చెట్లలోకి దూసుకుపోయింది
ఆట ఆగిపోయింది చీకటి పడ్తూండగా
‘‘ రేపు తప్పక తెల్లవారుతుంది కదా ’’
అంటున్నాడొక పిల్లాడు .. మరొకడితో

Translated by Mydavolu Venkata Sesha Sathyanarayana

Kid’s Playground

I was about to sit on the cement bench,
below the happy swaying banyan tree. Suddenly,
a rubber ball came rolling down towards
my feet. I felt a swish of ocean wave
gushing through my two feet. With quick reflex
I couched to pick that little spherical toy.
but lo, there he’s, that boy came fast, oh like
a whirlwind delicate, grabbed it and ran away
as fast as he came, with brightened face.

About a dozen kids kept playing there
the same game but different people! I sighed
and stretched my hands along the long backrest
of bench and closed my eyes. I felt for once
a tiger wild in me, but soon a sly
feline, again I wore a wooden mask
to show the world, that I’m a human being!
But soon unshackled I, became alone
and reached that playing ground, and lo about
to sit, oh broke into a million shreds
as if a porcelain slate was banged against
a rock. Oh every piece was I, the child
in me, and well, those fragments glued to each
other and became one. When closed my eyes
again, I felt inside my core, some kids,
some brutes and many birds unfolding wings.
It’s like a long uncoiling thread tangling
again, again into a gossamer thick
again into a shapeless woolly ball.
Someone kicked the ball hard, and there uproar.
‘goal, goal!’ There were cheers and deafening hurrahs!
Well, well ye see the fate of the ball, whether
it reaches goal or not, it must endure
the brutal kicks.
While slipping down the well, the bucket poor,
sure looks around for benign hands that pull
her back from that abyssal water hole!
The thread is his and needle too. When tried
to sew, oh every time he found raw seams
on his own skin, exuding ruddy blood!
Before his eyes, piercing through earth, a thin
curtain of darkness, and there on tamarind boughs
an avian din and felt his soul heavy
as if laden with a ton of craggy stones!

When he opened his eyes, he found the ball
Approaching him fast. Some other boy
this time came hurtling behind that teasing globe.
This time the ball escaped into the thick
coppice. The game now stopped.
A boy was asking
‘Will there be dawn morrow!?’

1 thought on “తపస్సు – పిల్లల ఆటస్థలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *