రచన: మౌనిక

స్వాగతం…. సుస్వాగతము…. ఓ వరుణదేవ
నీవు తడిచినా…! నీరు అందిస్తావు….
నీడవై వెంటే ఉండి నడిపిస్తావు…
నిరంకుశంగా నీ దీవెనలు అందిస్తావు…

వచ్చావా నీవూ నీ జగతిలోకి…
వచ్చావా నీవూ నీ పుడమిలోకి…
వచ్చావా నీవూ నీ ఆవనిలోకి…
అరవిచ్చిన ఆనందంతో చినుకులు అడుగులై తాకుతుంటే…..
మోము మకరిందుస్తుంది….
మది పులకరిస్తుంది…
మనసు పరవసిస్తుంది…

ఆ చినుకు జల్లుల హరివిల్లులలో పసితనం పరవళ్ళు తీస్తుంది…
ఆ చినుకు జల్లుల వాసంతంలో ధరణి తెచ్చే మకరందం మయమరిపిస్తుంది….
ఆ చినుకు జల్లుల పలకరింపులలో లే లేత చెట్ల అల్లికలు నాట్యమాడుతున్నవి….
ఆ చినుకు జల్లుల అనుభూతిలో పక్షుల కిల కిల రాగాలు రాణిస్తున్నవి….

నీ కోపం విడు….
నీ బిడియం విడు….నీ ప్రేమను పంచు….
నీ కోసమై ఎదురు చూసిన మా అన్నదాత కలలను కరుణించూ….
నీ నీటిరాజ్యానికీ రాజువై అందించు రైతుకి ఆహ్లాదం…..

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *