April 23, 2024

గానం.. సంగీతం…

రచన: భాస్కర ఇందుప్రియ

పదము పదము వాక్యమవును
స్వరము పదము పిలుపు అవును
సమర్పణతో ప్రార్థనవును
రాగముతో గానమవును

మనసులోని భావం తెలిపే మార్గమిదే
విప్లవాన్ని నలుదిశలా రగిలించిన అగ్ని ఇదే
పసిపిల్లల నిదురబుచ్చు మంత్రమిదే
పరమాత్ముడు మోక్షమిచ్చు జ్ఞానమిదే

ఇదే ఇదే ఏంటది?…
నువు పాడే పాటది …
దాని విలువ ఎంతటిది ..
వెల కట్టలేని సంపదది..

జననమనేదొక రాగం
మరణమనే మరో రాగం
ఈ రెండిటి నడుమ సృష్టి పలికేదే నీ జీవనరాగం

గెలుపు అనేదొక రాగం
ఓటమనేదొక రాగం
గెలిచినా ఓడినా విడువరాదు నీ ధర్మం

మౌనమనేదొక రాగం
మాట అనేదొక రాగం
మౌనమయిన మాట అయిన తెలుపరాదు అసత్యం

సృష్టి రహస్యాలే సరిగమపదనిసలుగా…

నింగి మనసు కదిలేలా..
నేల తల్లి మురిసేలా…
హర్షించి మేఘం వర్షించేలా..
ప్రకృతివై పాడు
పరవశంతో నేడు..

నీ ఊపిరె వేణువై
అణువణువూ తాళమై
సంకల్పమే నీ స్వరమున ప్రవహించే పల్లవై
గళం విప్పి పాడు
గర్వంగా నేడు
మనసు పెట్టి పాడు
విశ్వమే నీ తోడు

3 thoughts on “గానం.. సంగీతం…

Leave a Reply to Bhujagasayana Cancel reply

Your email address will not be published. Required fields are marked *