February 21, 2024

అల

డా.తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం ” అమ్మా! కమల ఆంటీ సిల్వర్ జుబిలీ పెళ్ళిరోజు వేడుకకి నాన్న వస్తున్నారా ” తను వేసుకున్న గులాబి రంగు గాగ్రా చోళీ ఒంటిమీద సరిగ్గా అమిరిందా అని అద్దం ముందు నిలబడి చూసుకుంటున్న అనుపమ అద్దంలో నుండే అమ్మను చూస్తూ అడిగింది. ” నాకెలా తెలుస్తుంది? నేను నా తమ్ముడి ఇంట్లో వున్నాను. మీ నాన్న ఎక్కడో తన ఇంట్లో వున్నాడు. పైగా కమల నాతో బాటు పనిచేస్తున్న నా స్నేహితురాలు. మీ […]

మల్లేష్

రచన – డా. లక్ష్మీ రాఘవ బస్టాండు లో బెంగళూరు బస్సుకోసం చూస్తూ వున్నాడు దినేష్. అప్పుడే ఒక డీలక్స్ బస్ వెళ్లి పోయిందట. ఒక పదినిముషాలలో ఆర్డినరీ బస్సు వచ్చింది. ఏదో ఒకటి‘ అనుకుంటూ ఎక్క బోయాడు అతన్ని తోసుకుంటూ “అన్నా ఒక్క నిముషం“ అంటూ లోపలకు దూరిన 12 ఏళ్ల కుర్రాడిని చూసాడు దినేష్. ఒక నిముషంలో లోపలకు దూసుకుపోయి మధ్యగా వున్నఒక సీట్ లో కూర్చున్నాడు ఆ పిల్లాడు. బస్సు ఎక్కాక దినేష్ […]

తెగింపు

రచన: చివుకుల పద్మజ స్టాఫ్ రూమ్ లో కూర్చుని మాటి మాటికి గడియారం కేసి చూపులు సారిస్తోంది రమ్య. ఏంటి, ఇంకా నిర్మల క్లాస్ వదలలేదు అని ఎదురు చూస్తోంది. లాస్ట్ అవర్ ఈ రోజు నిర్మలది. చివరి గంట క్లాస్ తీసుకోవటం చాలా కష్టం. పొద్దుటినుంచి విని విని ఉంటారేమో విద్యార్థులు అస్సలు కూర్చోలేరు, వినలేరు చివరి దాకా. అలాగని ముందు వదిలితే ప్రిన్సిపాల్ గారు ఊరుకోరు. అందరికీ ఇది కత్తి మీద సామే. నిర్మల […]

నెరవేరిన కల

రచన: సునీత పేరిచెర్ల ” తెల్లవారనే లేదు ఇప్పటి నుండే ఏం చేసేస్తున్నావు లక్ష్మీ ” మోహన్ కళ్లు నులుముకుంటూ తన భార్యతో అంటూ హాల్ లోకి వచ్చాడు.. “మర్చిపోయారా ..! ఈ రోజు మనకెంతో ముఖ్యమైన రోజు కదా..మీతో పాటు ఫంక్షనుకు నేను కూడా వద్దామని కాస్త ముందుగానే లేచి పనులన్నీ పూర్తిచేసాను ” కాఫీ కప్పు చేతికందిస్తూ అంది లక్ష్మి…! *** మోహన్ కాలేజీలో లెక్చరర్.. మానవతా దృక్పథం ,ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి.. […]

అమ్మ కోసం

రచన: వంజారి రోహిణి చెల్లికి డెలివరీ టైమ్. అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. దూర ప్రయాణాలు చేసే ఓపిక అసలే లేకపోవటంతో చెల్లెలు గీత తనను పదే పదే బతిమాలడం తోటి తప్పనిసరి పరిస్థితుల్లో కావ్య చెల్లెలి ప్రసవ సమయంలో సాయంగా ఉండేందుకు తన ఇద్దరు చిన్నారులు లిఖిత, నిఖితలను వాళ్ళ నాయనమ్మ, తాతల దగ్గర వదిలి, వారికీ, తన భర్త విశ్వానికి పిల్లల గురించి లక్ష జాగ్రత్తలు చెప్పి అమెరికా విమానం ఎక్కింది కావ్య. పెద్ద కూతురు […]

తిరుక్కడయూర్ అభిరామి కోవెల

రచన: నాగలక్ష్మి కర్రా ఈ తిరుక్కడయూర్ అనే పట్టణంలో అమృత ఘటేస్వర్ కోవెల ఉంది .ఈ తిరుక్కడయూర్ తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నం జిల్లాలో ఉంది. ఈ తిరుక్కడయూర్ “మైలదుత్తురై “(మాయ వరమ్) నుంచి “పోరయార్ “వెళ్ళేదారిలో మైలదుత్తురై కి 22కిమి దూరం, పోరయార్ నుంచి 8కిమి దూరంలో ఉంది. ముందు 60వ పెళ్లి రోజు ఇక్కడ చేయించుకునే వారు. తరవాత తరవాత ఈ కోవెలలో షష్టబ్దిపూర్తి (60 సం.), భీమార్థ శాంతి(70 సం ..నిండిన తరువాత చేసుకొనే […]

చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయము (చేబ్రోలు-గుంటూరు జిల్లా)

రచన: అంబడిపూడి శ్యామసుందరరావు త్రిమూర్తులలో ఒకడైన బ్రహ్మకు భృగుమహర్షి శాపము వలన దేవాలయాలు ఉండవు. ఉన్న దేవాలయాలు కూడా శివలింగాకృతిలో ఉంటాయి. అటువంటి దేవాలయాలు బ్రహ్మ, శివుడు పేర్లను కలిపి ఉంటాయి. అందుచేతనే శివుడిని పూజించేటప్పుడు ముందుగా బ్రహ్మను తలచుకుంటాము, అటువంటి దేవాలయాలలో గుంటూరు జిల్లా లోని చేబ్రోలు గ్రామములో వెలసిన చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి దేవాలయము చాలా ముఖ్యమైనది. ఈ దేవాలయాన్ని రాజా వాసిరెడ్డి వెంటాద్రి నాయుడు గారు 200 ఏళ్ల క్రితము అంటే […]