April 18, 2024

మాలిక పత్రిక , అర్చన 2020 పోటీ ప్రత్యేక సంచిక

Jyothivalaboju Chief Editor and Content Head పాఠకులకు, రచయితలకు సాదర ఆహ్వానం.. కొద్ది కాలం క్రిందట కోసూరి ఉమాభారతి నేతృత్వంలో అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ, శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబుల్ సొసైటీ తరఫున సామాజిక స్పృహ అంశంగా కథలు, కవితలు, కార్టూన్ల పోటీ నిర్వహించబడింది. ఈ పోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించిన 33 కథలు, 19 కవితలతో మాలిక ప్రత్యేక సంచిక ముస్తాబై వచ్చింది. రచయితలందరికీ అభినందనలు.. ఎడిటర్ నుండి ఒక మనవి: […]

అర్చన 2020 – అమ్మ కావాలి

రచన: డా. జి. శోభా పేరిందేవి బెంగుళూరు ఎక్స్ ప్రెస్ కాచిగుడా స్టేషన్లో కరెక్ట్ టైంకి వొఛ్చి ఆగింది. జనం సామాన్లను పట్టుకుని త్వరత్వరగా రైలు వైపుకు సాగారు. లక్ష్మి పెట్టెని ఈడ్చుకుంటూ ముందుకు నడుస్తోంది. ఆమెతోపాటు చెల్లెల్లు సరస్వతి కూడా ఒక పెట్టెని తోసుకుంటూ నడుస్తోంది. వాళ్ళిద్దరికీ కాస్త వెనకగా పదహారేళ్ళ కుర్రాడు సరస్వతి కొడుకు సృజన్ అమ్మమ్మ చేయిపట్టుకుని నెమ్మదిగా నడుస్తున్నాడు. ముగ్గురూ రైలు ఎక్కారు సీట్ నంబర్లు చూసుకున్నారు. ఆ లోగానే సృజన్ […]

అర్చన 2020 – అమ్మ నిర్ణయం

రచన: శారదా పోలంరాజు “అమ్మా స్టేషన్ వచ్చింది. పదపద దిగాలి.” కంపార్ట్‌మెంట్‌లో అందరూ గాఢనిద్రలో ఉన్నారు. “ఇదిగో ఈ బెంచీ మీద కూర్చో. ఇక్కడ మరో రైలు ఎక్కాలి. నేనెళ్ళి టికెట్లు కొనుక్కొస్తాను.” వెళ్ళబోతున్న కొడుకు వైపు జాలిగా చూస్తోంది సుగుణమ్మ. ముందరే అన్నీ అనుకుంటున్నటే జరుగుతున్నాయనేమో మనసు రాయి చేసుకొని నిర్లిప్తంగా ఉంది. హటాత్తుగా ఏదో గుర్తు వచ్చినట్టు, “బాబూ! ఇవిగో నా బీరువా తాళాలు. హడావుడిలో వెంట తీసుకొని వచ్చేసాను.” తల్లి చేతుల్లోంచి తాళాలు […]

అర్చన 2020 – అమ్మమ్మ జ్ఞాపకం

రచన: బి.శ్రీదేవి హలో హలో . . నేను రా. . నాన్నని . . అమ్మమ్మ చనిపోయింది అన్నాడు సుభాష్. . అమెరికా లో ఉన్న తన కొడుక్కి ఫోన్ చేసి. ఆ…ఆ. అదెప్పుడు మొన్న ఆదివారమేగా నాతో మాట్లాడింది. .ఇంతలో ఎమైంది, అన్నాడు అవతల నుంచి శ్రీకర్ హార్ట్ ఎటాక్ . .. జస్ట్…టెన్ మినిట్స్ అయింది. . అమ్మమ్మ అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు అందుకే ఫోన్ చేసా. . నువ్వు […]

అర్చన 2020 – అర్థనారీశ్వరం

రచన: ములుగు లక్ష్మీ మైథిలి “అమ్మా… టవల్ మర్చిపోయాను..ఇవ్వమ్మా” బాత్రూంలో నుండి కేకేసాడు గోపి. “ఇదుగో… అయినా నువు బయటికి వచ్చి తీసుకోవచ్చు చొక్కా మాత్రమేగా విప్పావు ..ఇంకా స్నానం చేయలేదు కదా”అంటూ టవల్ అందించింది తల్లి వాణి. గోపి ఏమీ మాట్లాడకుండా టవల్ తీసుకొని స్నానం చేసిన తర్వాత ..ఆ టవల్ ను వళ్ళంతా చుట్టుకుని ..తన గదిలోకి వెళ్ళిపోయాడు. “గోపి..రారా .. ఎంతసేపు ఇక్కడ టిఫిన్ పెట్టాను తిను.”అంటూ గది తలుపు తట్టింది వాణి. […]

అర్చన 2020 – ఇంతింతై..

రచన: గరిమెళ్ల వెంకట లక్ష్మీనరసింహం ఆకాశానికి చిల్లులు పడ్డాయా, అని భ్రమ కల్పిస్తూ, ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం, కరుణ అరుదయిందా వరుణునకు అని అనుమానం కలుగజేస్తూ, ప్రళయతాండవం చేస్తున్న బంగాళాఖాతం, ప్రకృతి ప్రకోపమా అన్నట్లు, గంటకు సుమారు 130 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురుగాలుల తాకిడికి, నేలమట్టమవుతున్న చెట్లు, పెనుగాలులతో కూడిన వర్షానికి, అతలాకుతలమవుతున్న ప్రభావిత ప్రాంతాలు, పల్లపు ప్రాంతాలలోని జనాన్ని, దగ్గరలోనున్న పట్నంలోని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో నిమగ్నమయిన, ప్రభుత్వ మరియు స్వచ్చంద సంస్థల […]

ఉన్నది ఒకటే జిందగీ

రచన: ఉమా కల్వకోట ఆదివారం … సమయం ఉదయం ఎనిమిది గంటలు కావస్తోంది. అప్పుడే వంశీ, అతని స్నేహితుడు రణధీర్ జాగింగ్ చేసి వచ్చి వంశీ వాళ్ళింటి ముందు వరండాలో కూర్చొని అలసట తీర్చుకుంటున్నారు . ఇంజనీరింగ్ చేస్తున్న వంశీకి స్నేహితులు ఎక్కువ. స్కూల్ ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్, ఇంటి చుట్టుపక్కల ఉన్న స్నేహితులు, ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ఇలా ఊరంతా స్నేహితులే వంశీకి. వంశీ చూడడానికి బాగుంటాడు, మంచి చురుకైనవాడు, చదువులో కూడా ముందుంటాడు. అందులో వంశి […]

అర్చన 2020 – కలుపు మొక్క

రచన: ఉపేంద్ర రాచమళ్ల బావిలోకి జారిపోతున్న బకెట్టులా… ఆలోచనల్లోకి దూరిపోతున్నాడు రామయ్య. ఆకలి మీద ధ్యాస లేదు… నిద్ర ఊసు అసలే లేదు. కూతురి వాలకం చూసినప్పటినుండి తనలో తానే కుమిలిపోతున్నాడు. అటుమెసిలి ఇటు మెసిలి కళ్లు మూసుకున్న భార్య చటుక్కున లేచింది. భర్త అటు తిరిగి పడుకున్నప్పటికి మెలకువగానే ఉన్నాడని ఇట్టే గ్రహించింది. ”ఏమండి.. మీకు ఎంత బాధగా వుందో… నాకు అలాగే ఉంది. రేపు ఎలాగైనా అమ్మాయిని అడిగి విషయం తెలుసుకుంటాను. ఒంటికి నిద్ర […]

అర్చన 2020 – క్రొత్త జీవితం

రచన: మారోజు సూర్యప్రసాద్ ”మీకు పెళ్ళి అయిందా?” మీడియా యాంకర్ సూటిగా ప్రశ్నించింది. ”పెళ్ళి అయింది!” తాపీగా జవాబు చెప్పాను. ”పిల్లలెంతమంది?” ఆమె మరో ప్రశ్న సంధించింది. ”నలభైమంది!” అంతకంటే ధీమాగా సమాధానమిచ్చాను. ”నలభైమందా? సాధారణంగా ఇద్దరో ముగ్గురో పిల్లలుంటారుగానీ… ఎక్కడైనా ఇంతమంది పిల్లలుంటారా?” అసలే పెద్దకళ్ళను మరింత పెద్దవి చేస్తూ చక్రాల్లా త్రిప్పుతూ మరింత అందంగా ఆశ్చర్యార్థకంగా ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ”అందరూ… నా పిల్లలే! సందేహం లేదు!” ”అంటే… అందరూ మీరుకన్న వాళ్ళేనా? మీకు పుట్టిన […]

అర్చన 2020 – చలి భయపడింది

రచన: రంగనాథ్ సుదర్శన్ ధనుర్మాసపు చలి కాలం. . రాత్రంతా చలిచెలి కౌగిలిలో ఒదిగిపోయి, మంచు బిందువుల దుప్పటి కప్పుకున్న పచ్చని ప్రకృతి. . తొలి కిరణాల నులి వెచ్చదనం కోసం ఎదురు చూస్తోంది. రాత్రంతా. . చెట్టుకొమ్మల్లో ముడుచుకొని పడుకున్న పక్షులన్నీ అప్పుడప్పుడే తమ రెక్కలను విదిలిస్తూ. . తమ కువ . . కువ. . నాదలతో జగన్నాథునికి స్వాగత గీతాలు పాడుతూ వెచ్చదనం కోసం ఎదురుచూస్తున్నాయి. నారాయణ మాస్టారు. . . తన […]