August 11, 2022

అర్చన 2020 – అమ్మమ్మ జ్ఞాపకం

రచన: బి.శ్రీదేవి

హలో హలో . . నేను రా. . నాన్నని . . అమ్మమ్మ చనిపోయింది అన్నాడు సుభాష్. . అమెరికా లో ఉన్న తన కొడుక్కి ఫోన్ చేసి. ఆ…ఆ. అదెప్పుడు మొన్న ఆదివారమేగా నాతో మాట్లాడింది. .ఇంతలో ఎమైంది, అన్నాడు అవతల నుంచి శ్రీకర్
హార్ట్ ఎటాక్ . .. జస్ట్…టెన్ మినిట్స్ అయింది. . అమ్మమ్మ అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు అందుకే ఫోన్ చేసా. . నువ్వు దూరంగా ఉన్నావు. . రాలేవులే. ..అమ్మ నీకు చెప్పమంది. .. . ..రావడం కుదురుతుందా. . ఇప్పటికిప్పుడంటే కష్టం అనుకో . .. .. అంటుండగానే. .. .
అదేంటి డాడ్. . నేను వస్తా…వచ్చేదాకా బాడీని ఉంచండి అని చెప్పి తదుపరి ఏర్పాట్ల కోసం. ..ఫోన్ పెట్టేసాడు అనుకున్నట్టుగానే అమెరికా నుంచి వచ్చి అమ్మమ్మ డెడ్ బాడీ ముందు వాలిపోయాడు. . దూరబారాన ఉన్న మీరు రాలేదని ఉంచాం. . రండి శ్రీకర్ బాబు చివరి చూపు సూసేయండి . .. రెండు రోజులైంది… శవాన్ని ఇంకా తీయకపోతే వాసన వస్తుంది అన్నారు చుట్టు పక్కలవాళ్లు. అమ్మమ్మ గుండు రాయిలా ఉండేది. . అమ్మమ్మకి హార్ట్ ఏటాక్ ఏంటి అమ్మా అంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. నా పెళ్ళి వరకు ఉంటాను అని చెప్పింది. .. నాతో అమెరికా వస్తానని చెప్పింది అంటూ బోరుమన్నాడు శ్రీకర్. .
మనమేమి చేస్తాం నాన్నా. . మన చేతిలో ఏముంది. . అంతా ఆ పై వాడి దయ. .. పద నాన్నా స్నానం చేసి వద్దాం అంటూ ఇరవై ఏడేళ్ల కొడుకుని తీసుకుని స్నానానికి తీసుకుని వెల్లాడు తండ్రి సుభష్. స్నానపానాదులు కానిచ్హిన శ్రీకర్ తో . .. పద నాన్నా హైదరాబాద్ వెళ్లి మల్లీ వద్దాం…ఇక్కడేముంటావ్. . ఏసి ఉండదు…సదుపాయాలుండవ్. . వచ్చిన వాళ్లు పోయిన వాల్లతో గొడవ గొడవ గా ఉంటుంది ఇల్లంతా అన్నాడు సుభాష్
లేదు నాన్న పెద ఖర్మ తంతు అయ్యేదాకా నేను ఇక్కడే ఉంటా.. ఈ కోటిపళ్లి తో, అమ్మమ్మతో నాకు చాలా జ్ఞాపకాలున్నాయి. . వీలైతే మీరుండండి, లేకపోతే మీరు వెళ్లి రండి అన్నాడు స్తిరంగా. ..
అదేంటి శ్రీకర్ నువ్వు ఇక్కడ ఉండలేవు. .
లేదు నాన్న.. చిన్నప్పుడు ఇక్కడే పెరిగా. . ఇక్కడే తిరిగా. .. నాకు పునర్జన్మ ఈ వూరే ఇచ్చింది నాన్న అని గట్టిగా అనేసరికి సుభాష్ మౌనంగా ఉండిపోయాడు. అమ్మమ్మ పోయిన బాధలో ఉన్నాడు…సరెరా నీ ఇష్టం అని చెప్పి వెళ్లిపోయాడు సుభాష్.
పక్క వీధిలో రచ్చబండ పక్కనే ఉన్న అలివేలు వచ్హింది…
మామ్మ బాగున్నావా. . అని పలకరించిన శ్రీకర్ ని గట్టిగా వాటేసుకుని . ..బాగున్నా మనవడా… మొన్న సాయంత్రం కూడా నాతో మాట్లాడిందిరా…ఇంతలోనే మ్రుత్యువు తీసుకుపోయింది అమ్మమ్మని ,అని కన్నీల్ల పర్యంతమైంది అలివేలు. నిన్ను తలవని రోజు లేదురా మీ అమ్మమ్మ..మా శ్రీ కి ఇది ఇష్టం, అది ఇష్టం , వాడు ఇలా ఆడేవాడు, ఇలా తినేవాడు, ఇలా పడుకునేవాడు అని ఒకటే కబుర్లు చెప్పేది…మా శ్రీ దగ్గరకి వెల్తా…పెళ్ళి కాకముందే వెళ్లి చూసి వస్తా. . పెల్లైతే కొత్త జంట మద్య నేనెoదుకు అంటుండేది…వాడి పొడుగింత. . వాడు ఆజానుబాహుడు అని ఏ పిల్లైనా బాగుందంటే చాలు…మా శ్రీకి బాగుంటుందా అలివేలు అనేది. . అంటూ కబుర్లు చెబుతున్న అలివేలు, కల్లల్లో వచ్చి న కన్నీళ్లు తుడుచుకుంది స్నేహుతురాలైన అనసూయ ను తలచుకుంటూ… ఆమె వంక తదేకంగా చూస్తూ ఆమె మాటల్లో అమ్మమ్మని గుర్తు చేసుకుంటున్నాడు శ్రీకర్. ఉన్నట్టుండి మామ్మా రండి ఒక దగ్గరికి వెల్లాలి అని ఉదుటున లేచి గోడ కొయ్యకున్న షర్ట్ తీసి వేసుకుని ఆ అలివేలు మామ్మ బుజం మీద చేయి వేసి పెరటిలో ఉన్న మొక్కలవద్దకు తీసుకుని వెల్లాడు. . పెరట్లో మొక్కలన్నీ చాలా పెద్దవయ్యాయి. . మామిడి చెట్టు ,పనస చెట్టు, జామ చెట్టు, దానిమ్మ…నిమ్మ…యెలమ కాయల చెట్టు. ..ఒకటేమిటి…రక రకాల చెట్లు . . వ్రుక్షాలైపోయాయి…కొత్తగా చేరాయి కొన్ని మొక్కలు…ఆ సంపెంగ చూడు ఎంత పెద్ద గా అయిందో అని ఆ రోజులను తలుచుకున్నాడు శ్రీకర్.
అప్పుడే ఈ మొక్కలన్నీ ఎంత పెద్దగా అయిపోయాయి అన్నాడు శ్రీకర్. . అవును రా..మొక్కలన్నీ తనే తెచ్చి వేసింది…ఒకటి ఒకటి…వేసి పెద్ద వనం చేసింది చూడు అంటున్న అలివేలు మామ్మ ని చూస్తున్న శ్రీకర్కి ఒక్కసారిగా పాత జ్ఞాపకాలు చుట్టుముట్టాయి.
అప్పుడు నాకు పన్నెండో సంవత్సరం అనుకుంటా. .
రఘు కాన్సెప్ట్ స్కూల్ హైదరాబాద్ లో ఏడో క్లాస్ చదువుతున్న రోజులు
మీ వాడి ప్రవర్తన ఏం బాగాలేదు. . అల్లరి బాగ ఎక్కువైంది. . చదువు సాము లేదు. . క్లాస్ ని నాశనం చేసి పడేస్తున్నాడు. .. ఇదిగో ఈ పిల్ల జుత్తు నిన్న బ్లేడ్ తో కత్తిరించేసాడు . ..వాల్లమ్మ వాళ్లు గొడవకి వచ్హేసారు. .. ఇక నా వల్ల కాదు ఇదిగో టి.సి అని ముఖం మీద కొట్టింది.. ఆ స్కూల్ హేడ్ మిసెస్ సంధ్యా రాణి..అంతే ఆ రోజు అమ్మ బరా బరా లాక్కు వచ్హింది స్కూల్ నుంచి నన్ను ఇంటికి. అవమాన భారంతో ఏం చెయ్యాలో తెలియక తల పట్టుకుని ఏడుస్తూ కూర్చుంది అమ్మ. ఆఫీస్ నుంచి వచ్చి న నాన్న కి విషయం చెప్పింది అమ్మ. .. అంత పని చేసాడా . . ఇలా అయితే వీడి స్కూల్, చదువు కష్టమే. . నువూ ఆఫీసుకి సెలవు తీసుకుని వీడితో పాటు తిరిగి, ఏ స్కూల్ వీడ్ని భరిస్తుందో ఆ స్కూల్ లో పడెయ్ అని సలహా కూడా ఇచ్హాడు నాన్న.
అంతే గాని మీరు సెలవు పెట్టరు…నేనే అన్నీ పడాలి. . అంటూ విసుక్కుంది అమ్మ. ..ఇంకో స్కూల్ కి తీసుకుని వెల్లింది.. ఆ స్కూల్ కి నా కాండక్ట్ చేరింది గాబోలు . . వాళ్లు చస్తే చేర్చుకోమన్నారు. . అక్కడ దగ్గర్లో ఇంకో స్కూల్ వుంది.. పద అని అక్కడికి తీసుకుని వెల్లింది. ..అక్కడా అదే పరిస్తితి. . ఈ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ ఏవి నిన్ను చేర్చుకోవు. ..ఇక నీ చదువు సంకనాకినట్టే. . ఏ హాస్టల్ లోనో పడేస్తే పడి ఉందువు అని అమ్మ తిట్టింది. . . .
ఇంతలో మా అమ్మాయి జుట్టు బ్లేడ్తో కట్ చేసిన . .. మీకొడుక్కి కాస్తా బుద్ది చెప్పండి ఇలాగే వదిలేస్తే రేపు ఇంకేమి చేస్తాడో అని ఆ పిల్ల తండ్రి వచ్చి ఇంటిముందు చిన్నపాటి గలాటానే చేసాడు. అంతే కాక “రేపు ఏమిచేస్తాడో” అని అనడంతో కోపంతో ఊగిపోయిన అమ్మ అవమానంతో, కోపం తో నా వీపు విమానం మోతే మోగించింది. ..నీకు చదువు సాము వద్దు. . నన్ను కాల్చుకు తినడానికే పుట్టావ్ అంటూ నా ముఖం మీద తలుపు వేసి లోపలికి వెళ్లిపోయింది
అంతే ఒక్క క్షణం నన్ను నేను నిగ్రహించుకోలేకపోయా… ఇంట్లోనుంచి పారిపోయా . . హైద్రాబాద్ లో ఎక్కడెక్కడో తిరిగి, సాయంత్రం రైల్వె స్టేషన్ కి చేరాను. అక్కడ ఒక బెంచ్ ఉంటే కూర్చున్నా. . రాత్రి అయిపోయింది. .ఎటు వెల్లాలో తెలియదాయె, ఆకలి దంచేస్తోంది. ..ష్టేషన్ లో ఎవరెవరో వస్తున్నారు…కొంతమంది వచ్చి న ట్రైన్ దిగి పోతున్నారు. ..ఎటువెల్లాలో నాకే తెలియట్లేదు. ..ఆ రాత్రి అలాగే ఆ బెంచ్ మీద నిద్రపోదామని చారబడ్డాను. తెల్లవారు జామున అనుకుంటా ఎవేవో ట్రైన్లు వస్తున్నట్లున్నాయి. . గోల గోల గా ఉంది . . ఒక పక్క ఆకలి, మరో పక్క గోల…ఆ గోలకి లేచి కూర్చున్నా. ..ఏదైతె అది అయింది లే అని ఒక ట్రైన్ ఎక్కి పోయా. ..మరో అర్ధఘంట దాటింది టికెట్ టికెట్ అనుకుంటూ నల్ల కోటు మాస్టారు ఇటే వస్తున్నారు. . నా దగ్గర టికెట్ లేదు…ఏం చెయ్యాలో అర్ధం కాలేదు…అక్కడ దగ్గరలో ఉన్న బాత్ రూం లో దూరేసాను . .. చీ…చీ కంపు కంపు. వాంతు వస్తోంది ముక్కు మూసుకుని కిటికీలో నుంచి బయటకు…చూస్తున్నా. ..ఆ నల్లకోటు వేరే పెట్టెలోకి వెళ్లిపోగానే బయటకు వచ్హా. . అలా ఆ రోజు ఆ ట్రైన్లో గడిపేసా…విశాఖపట్నం లో ట్రైన్ ఆగిపోయింది . . అందరూ దిగుతున్నారు, నేను దిగిపోయాను నక నక లాడుతోంది కడుపు. బయట నా ఈడు పిల్లలు అడుక్కుంటున్నారు. . నాకు అంత నచ్చలేదు ఆ పని. ఎదురుగా ఒక పైపు కనిపించింది అక్కడకి వెళ్లి కడుపు నిండా నీళ్లు తాగి, అక్కడ బల్ల మీద కూర్చున్నా. . అలా ఆ రోజంతా కూర్చున్న. . అమ్మ మీద కోపం గా ఉంది, ఆ స్కూల్ టేచెర్ మీద, ఆ జుట్టు కట్ చేసిన పిల్ల నాన్న మీద చలా చాలా కోపం గా ఉంది. అలా ఆ బెంచ్ మీద కూర్చుని ఉన్నా…నా పక్కనే ఒక కుటుంబం వచ్చి కూర్చుంది…వాళ్లు ట్రైన్ ఎక్కడానికి రెడీ గా ఉన్నారు. ..
ఎక్కడికి వెల్తున్నారు అని అందులో ఉన్న చిన్న అబ్బాయి ని అడిగా…మెము కోటి పళ్లి వెల్తున్నాం…మా పెద్దమ్మ ఇంటికి అన్నాడు…అప్పుడు గుర్తు వచ్హింది అమ్మమ్మ ఉన్నది కోటిపళ్లి కదా. . అక్కడకి పోతా అనుకుంటూ వాల్లని ఫాలో అయిపోయా. . ట్రైన్లో మల్లీ మల్లీ దాక్కుని…వాల్ల వెనకల దిగిపోయా…ఇదేనా కోటిపళ్లి అన్నాను వాల్ల వెనకాలె వచ్చి . .
ఇక్కడ నుంచి బస్ ఎక్కాలి అన్నారు వాళ్లు…అయ్య బాబోయ్ డబ్బు లేదు ఎలా. .. .వీళ్లు వెళ్లిపోతే నాకు దారి తెలియదు. ..నేను ఒక్కడినే వెల్లలేను…ఎలాగైనా వీల్లతోనే వెల్లాలి…అందుకే సిగ్గుగా ఉన్నా. . అంకుల్. ..అంకుల్. . కోటిపళ్లి లో మా అమ్మమ్మ ఉంది పేరు అనసూయ. ..ఆమె దగ్గరకి వెల్లాలి, నా దగ్గర డబ్బులు పోయాయి అన్నా. .. .ఎక్కడి నుంచి వచ్హావ్ . . నువ్వు ఎవరు అని ఆరా తీసాడాయన…కాని ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయా. . ఏమనుకున్నాడో ఏమో . . సరె బస్ ఎక్కు అన్నాడు ఆ పెద్దాయన. . అంతే అలా అమ్మమ్మ ఇళ్లు చేరా. .. .. అమ్మమ్మ నన్ను చూసి ఆశ్చర్యపోయింది . . గట్టిగా వాటేసుకుంది. ..అక్కడ నీకోసం మీ అమ్మ నాన్న వెతుకుతున్నారు . . ఎక్కడికి వెల్లావో, ఎమైపోయావో అని బెంగ పెట్టుకుంది మీ అమ్మ. . ఆ రోజునుంచి నిద్ర హారాలు లేక పిచ్హివాల్ల లా తిరుగుతున్నారు వాళ్లు నువ్వు వెళ్లిపోయావని పోలీస్ రెపోర్ట్ కూడా ఇచ్హారు . .. నీకు కొంచెమైనా బుద్ది ఉందా అని నన్ను గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది అమ్మమ్మ మెత్తగా మందలించింది…ఉండు అమ్మ కి ఇప్పుడే ట్రంకాల్ చేస్తా అంది… అమ్మమ్మ . . అలా చేస్తే ఇక్కడ నుంచి నేను పారిపోతా అని బెదిరించా. ..
సరె నాన్నా. . నేను చెప్పను…సరేనా…రా. . స్నానం చెయ్ . . వేడి వేడి భోజనం వడ్డిస్తా చక్కగా తిని పడుకో శ్రీ…అంది అమ్మమ్మ. అంతే. . చక్కగా స్నానం చేసి హాయిగా నిద్ర పోయా. అమ్మమ్మ ఎప్పుడు అమ్మకి సమాచారం ఇచ్హిందో తెలీదు. .. .తెల్లారేసరికి అమ్మ నాన్న కారులో దిగి నా మంచానికి అటు ఇటు కూర్చున్నారు నేను లేచే సరికి . . నేను లేవగానే…నన్నా శ్రీ అంటూ అమ్మా నాన్న ఇద్దరూ వచ్చి పట్టుకోబోయారు. . కాని వారిద్దరినీ తోసుకుని అమ్మమ్మ దగ్గరికి వెళ్లిపోయా. . అంతే…ఆ రోజు అమ్మ చాలా ఏడ్చింది…నాకు బాగా గుర్తు. . అయినా నేను అమ్మ దగ్గరకి పోలేదు. ..నాన్న కూడా నాకు దగ్గరవ్వలని వచ్హారు…కాని తోసేసా. . నందు- సుభాష్. . శ్రీ కి గాలి మార్పిడి, స్థలం మార్పిడి అవసరం నాతో పాటు కొన్ని రోజులు ఉంటాడు. ..ఆ తరువాత ఆలోచిద్దం వాడి భవిష్యత్తు గురుంచి అంది అమ్మమ్మ. సరె అన్నారిద్దరూ. .
మీరు వెల్లండి…శ్రీ నా దగ్గరే ఉంటాడు…కొన్ని రోజులయ్యాక నేను తీసుకువస్తా అంటూ పంపేసింది అమ్మమ్మ వాల్లని . . అప్పట్నుంచి…ఆరు నెలలు అక్కడే ఉన్నా. . చాలా బాగుంది…అమ్మమ్మ నా కిష్టమైనవి వండి పెట్టేది, కోటి పళ్లి రేవు కి తీసుకుని వెల్లేది…ఊరంతా తిప్పేది, అలివేలు అమ్మమ్మ ఇంటికి తీసుకుని వెల్లేది…ఇక నాకు ఆడింది ఆట, పాడింది పాట లా ఉండేది… ఓ రోజు అమ్మమ్మ. ..శ్రీ నీతోటి పిల్లలంతా ఎంచక్కా బడికి పోతున్నారు అంది అంతే. . హిస్టేరియా వచ్చి న వాడిలా అరిచా…నాకు చదువు వద్దు, బడి వద్దు…అలా అయితే ఇక్కడ నుంచి పారిపోతా. .. . చేతిలో కంచాన్ని విసిరి కొట్టా. .. . ఆ రోజు నుంచి చదువు, స్కూల్ గురుంచి ఎవరూ నా దగ్గర మాట్లాడలేదు.
కోటిపళ్లి లో ఓ రోజు
పెరటిలో మొక్కకి పురుగులు పట్టాయి. . చూడమ్మమ్మా…
అవునా ఎక్కడ చూపించు . .
ఇదిగో అమ్మమ్మా…ఈ కోళ్లు తినేస్తున్నాయి
ఆ…అవునవును అంది అమ్మమ్మ
మరి ఈ మొక్క ఆ మొక్క చచ్హిపోతుంది. . చూడు . .. అమ్మమ్మా. .
ఊహూ. .. .చనిపోదు నాన్నా ఈ మాత్రానికే ఎందుకు చనిపోతుంది అంది అమ్మమ్మ
మరికొన్ని రోజుల తరువాత. .
మేకల మంద వచ్చి ఆ మొక్కలకున్న ఆకులన్నిటినీ తిని లాగి పీకి చిందర వంద చేసేసాయ్ అమ్మమ్మా. . చూడు. . ఆ మేకలన్నీ ఎలా తినేసాయో ఆ మొక్కలని…పాపం అవి చచ్హిపో యాయి అని ఫిర్యాదు చేసా
ఆ…ఈ మాత్రానికేనా…నువ్వు కంగారు పడకు. .. నాలుగు రోజుల తరువాత ఆ ఆకులు మల్లీ వచ్హెస్తాయి చూడు అంది అమ్మమ్మ
ఏంటమ్మమ్మా…మరీను. . ఆకులన్నీ తినేసాయి. . సగం వేర్లు బయటకే ఉన్నాయి ఆ మొక్కలు ఇంకెలా బతుకుతాయ్. .. అన్నా
అమ్మమ్మ నవ్వి వూరుకుంది
నాలుగు రోజుల తరవాత చూసా. .. .అమ్మమ్మ చెప్పింది నిజం. . చిన్న చిన్న చిగురులు వచ్హాయి. . మొన్న బయటకి వచ్చి న వేళ్లు కనపడటమే లేదు
అలా మరి కొన్ని రోజులకు. .. మొక్కలు ఏపుగా పెరిగాయి
ఓ రోజు పెద్ద గాలి వానా వచ్హింది. . పెరటిలో మొక్కలు ఇరిగిపోతున్నాయి. . అటు ఇటు ఊగిపోతున్నాయ్,,,
అమ్మమ్మా. . ఈ రోజు మన పెరటిలో మొక్కలు పూర్తిగా నాశనమైపోతున్నాయ్. .. మనమేమి చెయ్యలేమా అన్నాను
వాటిని అవే రక్షించుకోవాలి. . . . మనమేం చెయ్యగలం శ్రీ . . మనల్ని మనం రక్షించుకోవాలి కదా. . పద పదా తలుపులన్నీ వేసెయ్యాలి అంటూ తలుపులు, కిటికీలు వేసేసింది అమ్మమ్మ. ఆ రోజు తలుపలన్నీ వేసుకుని అమ్మమ్మ పక్కనే అమ్మమ్మని గట్టిగా పట్టుకున్నా. ..
అప్పుడు చెప్పింది అమ్మమ్మ. ..
చూడు శ్రీ. . ఆ చిన్ని చిన్ని మొక్కలకు పురుగులు పట్టాయి… నువ్వు చూసావ్ కదా . . ఆ మొక్కలు చచ్హిపోయాయా…ఆ మొక్క మొదలను ఆ పురుగులు కొరికి కొరికి వదిలాయి . .ఆ పురుగులు తినడానికి వచ్చి న కోళ్లు మొక్క కాండాన్ని తమ ముక్కుతో ఎంతలా గుచ్హి గుచ్హి చంపాయి, అలా అని ఆ మొక్కమరో చోటకి పారిపోయిందా, బతకడం మానేసిందా . . ఎదగటం మానేసిందా. .
కొద్ది కొద్దిగా ఎదుగుతున్నప్పుడు నువ్వే చూసావు గా ఆ మొక్కలకున్న ఆకులను ఎలా మేకలు తినేసాయో..వేళ్లు ఎలా లాగేసాయో.ఎలా విరిచేసాయో. . అలా అని ఆ మొక్క బాదపడి ఎదగడం మానేసిందా
ఇదిగో ఇప్పుడు వచ్చి న గాలి వానకి పాపం అల్లల్లాడిపోతున్న ఆ మొక్కలను ఎవరు కాపాడతారు. ..వాటిని అవే కాపాడుకోవాలి…వాటికవే నిలదొక్కుకోవాలి . . అలా వాటికి ఎదురైన ప్రమాదాలను అవే ఎదుర్కుని నిలదొక్కుకుంటే అవి వ్రుక్షాలై…వనాలై… ఫలాలిస్తాయి. . అక్కడే ఉండి ద్రుడం గా మారుతాయి, సమస్య వచ్హిందని అవి ఎక్కడికి పారిపో పోవు. . అలా భయపడి పారిపోయి, , ఎదగడం మానేస్తే… మొక్కలు పెద్దవై..వ్రుక్షాలై. . వనమవుతుందా చెప్పు అంది అమ్మమ్మ
ఆ పెద్ద చెట్లు చూడు అవి ఒకప్పటి మొక్కలే ,ఎదురైన ఆటంకాలను, ఒడుదుడుకులను ఎదుర్కుంటూ పెరిగిన ఆ వ్రుక్షాలను చూడు ఎలా మనకి పండ్లను ఇస్తున్నాయో. . మన పెరట్లో మొక్కలు చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు నుంచి ఎన్నో ఇబ్బందులను తట్టుకుని నిలబడ్డాయి…నిలదొక్కుకుని మొక్కలు పెద్దవై…వ్రుక్షాలయ్యాయి. మేకలు తినేసాయనో, గాలి వీచిందనో…చచ్హిపోతే, ఈ మొక్కలు ఆ వ్రుక్షాలవుతాయా. . మనిషి కూడా అంతే నన్నా. . . ..
అమ్మ కొట్టిందనో, టీచర్ తిట్టిందనో ఎవరైనా ఇంట్లో నుంచి పారిపోతారా . .. శ్రీ. .. .. స్కూల్ టేచర్ తిట్టిందని నువ్వు చదువుకోకుండా నీ భవిష్యత్తు పాడుచేసుకుంటావా. .. ఒక్కగనొక్క కొడుకు వి నువ్వు. .. అమ్మ కొట్టిందనో, టేచర్ తిట్టిందనో బడికి వెల్లకపోతే ఎవరికి నష్టం. ..ఆ టేచర్ కి నష్టమా. . అమ్మకి నష్టమా. .
ఆ రోజు నువ్వు పారిపోయావని తెలిసిన రోజు . .. విషయం తెలియగానే పై ప్రాణాలు పైనే పోయాయి. . మీ అమ్మ ఎన్నో పూజలు చేసింది నీ కోసం. . నీకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని నాన్నతో పాటు కష్టపడి ఉద్యోగం చేస్తోంది…పుట్టగానే నిన్ను నేను తీసుకు వస్తానంటే. . నా దగ్గర ఉంచుకోవడానికి నేను కన్నాను గాని…నీకివ్వడానికి నేను కనలేదమ్మా. . అంతలా ఇబ్బంది అయితే ఉద్యోగం మానేస్తాను గాని నిన్ను నాకివ్వను అంది మీ అమ్మ… కల్లల్లో పెట్టుకుని చూసుకుంటున్న తళ్లి తండ్రులను భాద పెట్టడం అంత మంచి విషయమా…శ్రీ…పిల్లల భవిష్యత్తు ఇలా ఉండాలి. .అలా ఉండాలి అని పిల్లల గురుంచి ఎన్ని కలలు కంటారో తెలుసా…”ఈ దేశం నిండా… బతికితే పిల్లల కోసమే బతకాలి, చచ్హినా పిల్లల కోసమే చావాలి అనుకునే తళ్లి తండ్రులే ఉన్నారు.”.. శ్రీ. అటువంటి వాల్లని ఒదిలి పిల్లలు తమకి తాముగా నిర్నయాలు తీసుకుని మీ జీవితం మీదే అన్నట్టు, మీకు మీరే ఈ లోకం లోకి వచ్చి నట్టు. ..మీ జీవితం మీద సర్వ హక్కులు మీవే అన్నట్టు, ఇలా పారిపోయి కొందరు, ఇట్టే పై నుంచి దూకి చనిపోతారు ఇంకొందరు…ఏమిట్రా ఇది. . పిల్లలు ఇలా చేస్తే, ఆ తళ్లి తండ్రులు బతుకుతారట్ర. .. ఒక వేళ బతికినా చచ్హిన శవాలే కదరా. . ఈ “లోకంలో పిల్లలను, ఒక్క తళ్లి తండ్రులు తప్ప ఎవరూ అంత గొప్ప గా ప్రేమించరు, ప్రేమించలేరు. అంటున్న అమ్మమ్మని గట్టిగా వాటేసుకున్నా. .
“సారీ” అమ్మమ్మా. . ఇంకెప్పుడు ఇలా చెయ్యను అమ్మమ్మా. .. .అంటూ వాటెసుకున్నా. .
ఆ తరువాత…అమ్మమ్మ నన్ను హైదరాబాద్ తీసుకుని వెళ్లి ఒక స్కూల్ లో చేర్పించింది . . అంతే నా చదువు మొదలైంది…మరి తిరిగి చూడలేదు. . నేను కంప్యూటర్ ఇంజనీర్ ని అయ్యా. . అమెరికాలో ఎం.ఎస్ , మంచి జాబ్ లో ఈ సెటిల్ అయ్యా…నా ఈ జీవితాన్ని ఇచ్హిన అమ్మమ్మకి అమెరికా తీసుకుని వెల్దామనుకున్నా…కాని “మనమొకటి అనుకుంటే. .భగవంతుడొకటి తలుస్తాడు”. ..అమ్మమ్మ లేదు కాని అమ్మమ్మ జ్ఞాపకాలున్నాయ్ నాతో అనుకున్ని భారంగా ఊపిరి పీల్చుకున్నా. . అదిగో అప్పుడే ఎవరో వచ్హారు. ..నందూ. . నందూ . . కార్యక్రమం అయిపోగానే ఈ ఇంటి రిజిష్ట్రేషన్ పెట్టుకుందాం అన్నారు. .. వరుసకి అమ్మకి బాబాయ్ అయిన ముకుందరావు. అలాగే బాబాయ్ అంది అమ్మ
ఇంతలో అమ్మా…కొన్ని గుర్తులు, జ్ఞాపకాలు మనం బతికినంత కాలం మనతో నే ఉండాలి. . ఆ పెరటిలో ఉన్న చెట్ల నుంచి అమ్మమ్మ నాకు జీవిత సత్యాలే నేర్పించింది…ఈ ఇంట్లో ప్రతిచోట అమ్మమ్మ తో నేను గడిపిన జ్ఞాపకాలే ఉన్నాయ్. ఇంటి ని అమ్మెయ్యద్దమ్మా… నేను వచ్చి నప్పుడంతా ఇక్కడకి వచ్చి ఓ పదిరోజులు గడుపుదాం. . అమ్మమ్మ తో గడిపినట్టే ఉంటుంది
ఈ ఇళ్లు అమ్మద్దు అని చెప్పిన నన్ను అమ్మ గట్టిగా వాటేసుకుంది…నా ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని నా నుదిటి మీద ముద్దు పెట్టి…అలాగే నాన్న…ఈ ఇళ్లు నీకు నాకు కూడా ఒక మంచి జ్ఞాపకం..దీన్ని అమ్మద్దు లే నాన్నా అంది నా వైపు అమ్మ ప్రేమ గా చూస్తూ.

2 thoughts on “అర్చన 2020 – అమ్మమ్మ జ్ఞాపకం

  1. బావుంది అమ్మమ్మ జ్ఞాపకం… బంటుపల్లి శ్రీదేవి గారే కదా రచయిత్రి. బి.శ్రీదేవంటే ఎవరో అనుకున్నాను. ఇలా పేరు మారిస్తే రచయిత కి రచన పడ్డ ఆనందం ఏముంటుంది

    1. నిజమే ఇందు రమణ గారు , నేను సరిగా చూసుకోలేదు . ఇంటి పేరు ఉంటె ఆ త్రిల్ వేరు . అద్భుతమైన ఫీలింగ్. నా కధ చదివినందుకు కృతజ్ఞతలు. నా తప్పు తెలిపినందుకు కూడా మీకు కృతజ్ఞతలు ..
      బంటుపల్లి శ్రీదేవి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *