June 14, 2024

అర్చన 2020 – భువి స్వర్గంగా మార్చు

రచన: వై చంద్రకళ

ఓమనిషి, నీ గమ్యం చేరే వరకూ ఆగక సాగాలి
నవ సమాజ స్థాపనకు నడుం బిగించాలి
అవినీతి, అరాచకం ప్రబలిన లోకంలో
ప్రాణానికి, మానానికి గడ్డిపోచ విలువైనా ఇవ్వక
అధికారాల కోసం అంతస్తులకోసం ప్రాకులాడుతూ
మనిషి పాపపుణ్యాల చింతన మరచి
మంచి, మానవత్వమన్న ఆలోచన లేక
అధోగతిలోకి పయనిస్తున్నవారిని ఆపాలి
ప్రజలంతా దైర్యంగా మనగలగాలి
మరో అందమయిన ప్రపంచాన్ని నిర్మించాలి
స్వార్ధాన్ని విడచి, కలిసికట్టుగా నడచి
సొంత లాభాన్ని కొంత మానుకోవాలి
చేయి,చేయి కలిపి, ఒకరికొకరు అండగా నిలవాలి
భువిని స్వర్గసీమగా మార్చాలి
పిల్లలకు ఆటపాటలతోనే నీతి శతకాలను నేర్పాలి
గీత, రామాయణ,,భారతాలను బోధించాలి
ఉత్తమ పౌరులను తయారు చెయ్యాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *