April 25, 2024

చేనేత మొగ్గలు

(ఆగష్టు7 న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా)

రచన- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

నాగరిక మనిషి నగ్నత్వాన్ని వస్త్రాలతో కప్పుతూనే
సమాజానికి హుందాతనాన్నిచ్చే సాంస్కృతిక పతాక
దేహసంరక్షణకు పాటుపడిన చేతివృత్తి చేనేతరంగం

బంగారు జలతారులతో సీతాకోకచిలుకల బొమ్మలను
చీరంచులకు సుందరంగా నేసి వెలుగులు విరజిమ్ముతారు
పసిడివెన్నెల వెలుగుజిలుగులు చేనేత పట్టుచీరలు

బతుకంతా అప్పుల ఊబిలోనే కూరుకుపోతూనే
మగ్గం గుంతలోనే పానాలను వదులుతుంటరు
నేత నేసిన మగ్గం గుంతలే నేతన్నలకు సమాధి

విదేశీవస్త్రాల మోజులో స్వదేశీ నూలువస్త్రాలను మరచి
స్వదేశీ ఉద్యమనినాదమైన ఖద్దరును గల్లంతు చేస్తున్నరు
అంతర్జాతీయంగా ఖ్యాతిగడించిన చేనేత పట్టుచీరలు

బతుకు గమనానికి ఊపిరిపోసే దారం పోగులే
ఉరితాళ్ళై జీవితాలను ఆగమాగం చేస్తున్నవి
ఆకలిచావుల ఆర్తనాదాలు చేనేత బతుకులు

1 thought on “చేనేత మొగ్గలు

Leave a Reply to మాలిక పత్రిక ఆగస్టు 2020 సంచికకు స్వాగతం… – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *