March 19, 2024

తపస్సు – మూసిన పిడికిలి

 

రచన: రామా చంద్రమౌళి

పసిపాప నిద్రపోతోంది
లేత నిప్పురంగులో మూసిన పసి పిడికిలి.. మధ్య మధ్య నవ్వు
‘లోపల ఉన్నవన్నీ రహస్యాలేనా.? ’ అని ప్రశ్న
పిడికిట్లో గాలి.. పిడికిట్లో కాలం
పిడికిట్లో ఊపిరిపోసుకుంటున్న జీవితం

ఆమె
అతను
చూస్తున్నారిద్దరూ కిటికీలోనుండి బయటికి
కల్లోల సముద్రంలోకి.. దిగంతాల్లోకి
‘అందరి చూపులూ అన్నింటినీ చూడగలవా’ అంది ఆమె
అతను మాట్లాడలేదు
చటుక్కున తిరిగి ఆమె కళ్ళలోకి చూశాడు
‘దూరంగా సముద్రం కనిపిస్తోందికదా’ అందామె మళ్ళీ
‘సముద్రం నీ కళ్ళలోనే ఉందికదా ’ అన్నాడతను అభావంగా
ఆ క్షణం ఆమె.. సముద్రంలో
కొన్ని వందల టన్నుల నౌకను ఒక చిన్న ‘ లంగరు ‘
బంధించి ఉంచడం గురించి ఆలోచిస్తోంది –
కాలానికి ఉనికీ.. రూపం.. అస్తిత్వమూ ఉందా
నిన్నటి మొగ్గ.. ఈ రాత్రి పుష్పించి
మొన్నటి గ్రుడ్డు 21 రోజుల తర్వాత కోడిపిల్లగా నడిచొస్తూ
ఆ రోజు.. నా వయసు పదేళ్ళు
నౌ అయాం ఫిఫ్టీ ఇయర్స్‌ ‘ ఓల్డ్‌ ’
పాతబడిపోతూ మనిషి.. పాతబడిపోతూ ప్రపంచం
పాతబడిపోతూ హృదయం.. పాతబడిపోతూ జీవితం –
దారానికి ఓ బరువు కట్టబడి ఊగుతూ
ఆద్యంతాల మధ్య లోలకం
ప్రక్కనే ఆకాశంలోనుండి వ్రేలాడ్తూ సూర్యుడు
కుక్క వెంటాడ్తూంటుంది నారింజ బింబాన్ని.. కుమ్ముతూ
ఋతువులేమో వరుసగా.. బడిపిల్లలవలె.. ఒకటి వెంట ఒకటి
గ్రీష్మ వసంత శరత్‌ రూపాలుగా
ఆకులను రాలుస్తూ.. మళ్ళీ ఆకులను చిగురిస్తూ.. మళ్ళీ రాలుస్తూ
భ్రమణ పరిభ్రమణ ఆత్మభ్రమణ క్రియలు
అన్నీ ఎడారిలో
నిశ్శబ్దంగా నడచిపోతున్న ఒంటెల వరుసలు
వెంట వెంటాడ్తూ నీడలు
ఎడారులైనా.. సముద్రాలైనా.. అంతరిక్షాలైనా తుఫానులు తప్పవు
విచికిత్స ఎప్పుడూ తొలుస్తూ లోపలికి దిగే ‘ డ్రిల్‌ బిట్‌ ‘
కత్తిరించబడ్తూ.. ఉత్తరించబడ్తూ.. ఛేదించబడ్తూ
చివరికి నిశ్శేషమౌతూ .. ‘ ఉన్నది ’.. ‘ లేకుండా ’ మిగలడం-

కాలం పొగమంచులోనుండి
పర్వతాగ్రాల్లోనుండి లోయల్లోకి జారి ప్రవహిస్తూ
గగన గర్భాల్లోంచి సముద్రతలంపైనుండి ముంచుకొస్తోంది
నేడు నిన్నౌతూ..రేపు నేడౌతూ
అంతిమంగా ట్రెడ్‌ మిల్‌ బెల్ట్‌ పై నడకే ఎప్పుడూ
దూరాలూ..గమ్యాలూ..గణనలూ ఉండవు
చెమటలు కక్కుతూ వ్యర్థాన్నంతా కోల్పోతూ కేలరీల లెక్కలే
చివరికి ‘ శక్తి ’ ని దాచుకోవడంకంటే ‘ కోల్పోవడమే ’ అవసరమని జ్ఞానోదయం
కాలాన్నీ, జీవితాన్నీ చూడాలంటే..‘ దృష్టి ’ ని సారించగలగాలి
వీధి మలుపు వరకు..మైదానం చివరి వరకు.. కొండ శిఖరం పైకి
ఇంకా అవతలికి..అవతలికి
చివరికి కళ్ళు మూసుకుని.. లోలోపలికి చూచుకుంటున్నపుడు
కాలం నుండి ఠప్పున విడివడిపోయి
ఎదుట ఒక తెగిన గాలిపటం.. తేలిపోతూ,
*****
ఇంతకూ పాప తన పిడికిలిని ఇంకా తెరువనే లేదు
లోపల ఏముందో –

Translated by R. Anantha Padmanabha Rao

Closed Fist

The baby is sleeping
Closed fist, in purple colour like fresh fire
Laughs in between
Whether all inside are secrets? A question
Wind and time in the fist
Life breaths in the fist
She-he
Both of them looking through a window outside
Turbulent sea and at the end of the direction
She questioned,
Whether the looks can see everything?
No answer.

He glanced immediately into her eyes
She repeated:
‘Can you see the sea at a distance?’
“Sea is in your eyes only,”
Unintentionally he said.
At that moment
She is thinking about a small anchor
Tying a thousand-ton ship inside the sea
Whether time has a presence, an existence, and a shape?
Yesterday’s bud flowering by night
Small chicken coming out as egg in 21 days.
On that day
I was ten years old
Now I am fifty.
Man getting old
World becoming old
She becoming old
Life getting old.
Between the two ends
A weight tied to a pendulum thread,
Sun hanging on the sky the other side
The dog moves around the orange image
Seasons like school children
One after the other
Summer, winter, spring.
Soul stirring movements
Dropping the leaves
Leaves sprouting and dropping.
It appears like
Camels walking in a row silently
Shadows following
Cyclones cannot be avoided
Deserts, sea or sky.
It is a drill bit piercing always with uncertainty
cutting, scissoring and dividing
Finally zeroed down.
Existence remaining as nothing
within the smoky mist of time
Yesterday turns today.
From the heights of hills
Eloping down the valley
From the surface of the sea
Inside the skies it flows.
Always it is like a treadmill walk
Distances, aims, and counts
Everything counted in calories
Losing the waist, sweating
Awakening of wisdom.
Finally saving energy to loose
Look at the time and life.
You have to glance
Up to the end of the street diversion and landscape
Up to the hill top and more and more
Finally closing the eyes
Looking intra ward
A destroyed kite flying
Separated suddenly from the time.
Still the baby does not open her fist
What is in the fist?

2 thoughts on “తపస్సు – మూసిన పిడికిలి

  1. “తపస్సు – మూసిన పిడికిలి”
    drills one’s thoughts both in original and in translation. సముద్రంలో
    కొన్ని వందల టన్నుల నౌకను ఒక చిన్న ‘ లంగరు ‘
    బంధించి ఉంచడం.
    Man control ocean-like thoughts with a mustard sized wisdom which has been missing even in our spiritual country. Ancient India is spiritual, modern is a simulacra of west. Youth has no vigour, child has no curiosity and India has no more wisdom replicated people. This poem injects so many unanswered questions. Let a child open it’s fist and
    A miracle seeds in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *